Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

It should be said that crow is a bird that gives a good message to human life

 కాకిలో ఇన్ని మంచి లక్షణాలున్నాయా - మీరు చాలా ఆశ్చర్యపోతారు

మారుతున్న కాలంతో పాటూ మనుషుల ప్రవర్తనలో మార్పులొచ్చాయి కానీ మూగజీవాల్లో ఎలాంటి మార్పులు లేవు. ఇలాంటి టైమ్ లో మనిషి జీవితానికి ఓ మంచి సందేశం ఇచ్చే పక్షి కాకి అనే చెప్పుకోవాలి.

ఎంతో విచక్షణ ఉందని చెప్పుకునే మనుషులు కాకి జీవనశైలి ముందు తలవంచాల్సిందే. ప్రకృతిలో ఎన్ని మార్పులొచ్చినా తన జీవనశైలిని, పకృతి ధర్మాన్ని మార్చుకోని ఒకేఒక పక్షి కాకి. అందుకే ‘కాకిని కాలజ్ఞాని’ అంటారు.

కాకిలో అన్నీ మంచి లక్షణాలే

  • బ్రహ్మ ముహూర్తంలో స్నానమాచరించే ఒకేఒక పక్షి
  • వేకువ జామునే అంటే బ్రహ్మ ముహూర్తంలో మేల్కొని స్నానం ఆచరించే పక్షి కాకి
  • సూర్యాస్తమయం తర్వాత ఎట్టిపరిస్థితుల్లోను ఆహా ముట్టుకోని జీవి సూర్యగ్రహణానికి ముందు, గ్రహణం పూర్తి అయ్యాక స్నానం చేసే ఏకైక పక్షి కాకి
  • గ్రహణం తరువాత తన గూడును శుభ్రం చేసుకుంటుంది
  • తినే నాలుగు మెతుకులు అందరితో పంచుకుని తింటుంది
  • సూర్యాస్తమయం సమయానికి గూటికి చేరే సలక్షణమైన అలవాటు సమయపాలన కాకులదే

కాకి నుంచి నేర్చుకోవాల్సిన 5 విషయాలు

  • కాకి నేర్పించే ఐదు విషయాల్లో మొదటిది- ధైర్యంగా ఉండడం
  • రెండోది -సంభోగం సమయంలో ఎవ్వరూ చూడకుండా జాగరూకతతో ఉండడం
  • మూడోది-ఇతరుల కార్యకలాపాలు గమనిస్తూ ఉండడం
  • నాలుగోది- ఒక్కసారి భాగస్వామిని ఎన్నుకుంటే జీవితకాలంలో మళ్లీ మార్చవు
  • ఐదోది-సందర్భాన్ని బట్టి తెలివిగా ఆలోచించడం ( నీళ్లు కావాలంటే గులకరాళ్లు వేసి నీళ్లు పైకి వచ్చాక తాగిన కథ చిన్నప్పుడు చదువుకున్నాం కదా)

పిండాలను కాకులకే ఎందుకు పెడతారు

సాధారణంగా కాకులు వాలితే దోషమని, కాకి తంతే అరిష్టం అని భయపడతారు. మరికొందరైతే కాకి ఇంటిముందు అరిస్తే చుట్టాలొస్తారని నమ్ముతారు. ఇవన్నీ మూఢ నమ్మకాలా, నిజాలా అన్నది పక్కనపెడితే చాలామంది విశ్వసిస్తారన్నది మాత్రం నిజం. చనిపోయిన వారి ఆత్మలు కాకి రూపంలో వస్తాయని నమ్మకం. అందుకే వారిని తలుచుకుని కాకికి పిండం పెడతారని అంటారు. కాకులు పూర్తిగా తింటే మన పెద్దలు సంతృప్తిగా ఉన్నారని.. ఒకవేళ కాకులు ముట్టుకోకుంటే వారి కోరికలు ఏవో మనం నెరవేర్చలేదని అందుకే అసంతృప్తితో ఉన్నారని భావిస్తారు. దీనివెనుక పురాణాల్లో ఓ కథ ప్రచారంలో ఉంది.

కాకికి వరం ఇచ్చిన యమధర్మరాజు

రావణుడి బారి నుంచి తప్పించుకునేందుకు దేవతలంతా ఒక్కొక్కరు ఒక్కో జంతువులోకి ప్రవేశించారట. తొండలోకి కుబేరుడు, లేడి లోకి ఇంద్రుడు, నెమలిలోకి వరుణుడు, యుముడు కాకిలోకి ప్రవేశిస్తారు. రావణుడి నుంచి తప్పించుకున్న తర్వాత ఆయా జంతువుల శరీరంలోంచి బయటు వచ్చిన దేవతలు వాటికి వరమిస్తారు. లేడికి వళ్లంతా కళ్లున్నట్టు అందంగా ఉండే వరం ఇచ్చాడు ఇంద్రుడు..అందుకే లేడి ఒళ్లంతా కళ్లున్నట్టు కనిపిస్తుంది. వర్షం పడే సమయంలో ఆనందంతో పురివిప్పి అందంగా ఆడేలా నెమలికి ఫించం ఇచ్చాడు వరుణుడు. కాకికి బలవర్మణం తప్ప స్వతహాగా మరణం ఉండదని వరమిచ్చాడు యముడు. ఇక యమలోకంలో నరకం అనుభవించే వారిలో కాకులు ఎవరి పిండం అయితే తింటాయో వారికి ఈ నరక బాధల నుంచి విముక్తి కలుగుతుందని చెప్పాడు. అప్పటి నుంచీ పిండాలను కాకులకు పెట్టడం ఆనవాయితీగా వస్తోంది. రామాయణం ప్రకారం రాముడు ఒక భక్తుడికి నీ పూర్వీకులు కాకి రూపంలో విహరిస్తుంటారు, కాకులకి ఆహారం పెడితే నీ పూర్వీకులకి చేరుతుందని ఒక వరం ఇస్తాడు, రాముడి వరం ప్రకారమే నేటికీ కాకులకి ఆహారాన్ని పెడతారని కూడా చెబుతారు

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "It should be said that crow is a bird that gives a good message to human life"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0