Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Key directions of AP High Court on DSC Notification

డీఎస్సీ నోటిఫికేషన్ పై AP హైకోర్టు కీలక ఆదేశాలు


ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన డీఎస్సీ నోటిఫికేషన్ పై హైకోర్టులో విచారణ.

హై కోర్ట్ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ మరియు జస్టిస్ రఘునందనరావు ధర్మాసనం ముందు విచారణ..

పిటిషనర్ తరపున వాదనలు వినిపించిన ప్రముఖ న్యాయవాది జడ శ్రవణ్ కుమార్.

ఎస్ జి టి టీచర్ పోస్టులకు బిఈడి అభ్యర్థులను కూడా అనుమతించడo సుప్రీంకోర్టు నిబంధనలకు వ్యతిరేకమన్న పిటిషనర్ న్యాయవాది జడ శ్రవణ్ కుమార

బీఈడీ అభ్యర్థులను అనుమతించడం వలన లక్షల మంది డిఎడ్ అభ్యర్థులు తీవ్రంగా నష్టపోతున్నారన్న పిటిషనర్ న్యాయవాది.

ప్రభుత్వం తరఫున పసలేని వాదనలు వినిపించిన  అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ గారు.

ఎస్ జి టీ పోస్టులకు బీ ఇ డి అభ్యర్థులను  అనుమతించవద్దు అంటూ రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశం.

సుప్రీంకోర్టు నిబంధనలకు వ్యతిరేకంగా ఉన్న రాష్ట్ర ప్రభుత్వ జీవో పై స్టే విధిస్తూ ఆదేశాలు.

నియామక ప్రక్రియ కొనసాగించాలి అంటే సుప్రీంకోర్టు నిబంధనలకు అనుగుణంగా మాత్రమే కొనసాగించాలి అంటూ రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశం.

తదుపరి విచారణ ఎనిమిది వారాలకు వాయిదా వేస్తూ ప్రధాన న్యాయమూర్తితో కూడిన ధర్మాసనం సంచలన నిర్ణయం..

న్యాయస్థానం నిర్ణయంతో ఆరు లక్షల మందికి పైగా D.ED విద్యార్థులకు న్యాయం జరిగింది...కావాలనే నిరుద్యోగులకు అందరికీ అన్యాయం చేశారు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Key directions of AP High Court on DSC Notification"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0