Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

  • AP Teachers Latest InfoIMP
  • More

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Let's find out where earth and sky meet

భూమి మరియు ఆకాశం ఎక్కడ కలుస్తాయో తెలుసుకుందాం

భూమి ఎక్కడ అంతమవుతుంది.. భూమిపై చివరి రోడ్డు ఎక్కడ ఉంది.. ఎక్కడ అంతమవుతుంది.. ఆతరువాత ఏముంటుంది. అనే విషయం తెలుసుకోవాలనే ఆసక్తి అందరికి ఉంటుంది.

జియాలజిస్టులు తెలిపిన వివరాల ప్రకారం ఐరోపాలో చివరి రోడ్డు ఉంది.. అక్కడ భూమి.. ఆకాశం రెండూ కలుస్తాయట .. ఇక్కడితో ప్రపంచ రహదారి ముగింపునకు వస్తుంది. ఆ వివరాల్లేంటో చూద్దాం.

ప్రపంచంలోని చివరి రహదారి చిరునామా ఐరోపాలోని జియాలజిస్టులు ఆ రహదారి స్థానాన్ని ఓ దేశంలో ఉందని నిర్దేశించారు..ప్రపంచంలోని చివరి రహదారి చిరునామా ఐరోపాలోని 'E-69 హైవే' అని చెబుతున్నారు జియాలజిస్టులు. ప్రపంచంలోని చివరి రహదారి చిరునామా ఐరోపాలోని 'E-69 హైవే' అని చెబుతున్నారు. ఈ E-69 నార్వేలో ఉంది. ఇది ప్రపంచపు రోడ్డు చివరి అంచు అని తేల్చారు. దీంతో ఈ అరుదైన ప్రాంతాన్ని చూడడానికి చాలా మంది అక్కడకి వెళ్తున్నారు. భూమి చివరి అంచుపై ఒక్కసారి అయినా నడవాలని ఇష్టపడుతున్నారు. ఈ రోడ్డు ముగిసిన చోట భూమి ,... ఆకాశం రెండూ కలుస్తాయి.

ఉత్తర ధ్రువం వద్ద.

భూమి అంచు ఉత్తరార్ధగోళంలో ఉంది. అంటే భూమధ్య రేఖకు ఎగువన ఉంటుంది. నార్వే దేశంలోని E-69 రహదారి ఉత్తర ధ్రువం వద్దకు వెళ్తుంది. ఈ రహదారి ఉత్తర ఐరోపాలోని నార్డ్‌కాప్‌ను నార్వేలోని ఓల్డాఫెవోఓర్డ్‌ గ్రామంతో కలుపుతుంది. ఈ రహదారి పొడవు 129 కిలోమీటర్లు. ఈ మార్గం ఐదు సొరంగాల గుండా వెళ్తుంది. వీటిలో పొడవైన సొరంగం నార్త్‌కేప్‌. దీని పొడవు 6.9 కిలోమీటర్లు. ఇది సముద్రమట్టానికి 212 మీటర్ల దిగువకు ఉంటుంది. దీనినే చివరి రహదారిగా పిలుస్తున్నారు.

ఈ నిబంధనలు పాటించాలి.

భూమి చివరి రోడ్డుపై వెళ్లాలంటే కొన్ని నియమాలు, నిబంధనలు పాటించాలి. లేదంటే అనుమతి ఇవ్వరు.. నిబంధనలు పాటించకుంటే ఆ దారిలో వెళ్లేందుకు అనుమతించరు. కాబట్టి 'ఈ-69 హైవే'లో ఒంటరిగా వెళ్లేందుకు అనుమతి లేదు.ఇక్కడ గాలి భయంకరమైన వేగంతో వీస్తుందని భూగర్భ శాస్త్రవేత్తలు తెలిపారు. అంతేకాకుండా చలి కూడా ఓ రేంజ్‌లో ఉంటుందట. వేసవిలో కూడా ఇక్కడ మంచు కురుస్తుందట. అప్పుడు కూడా కాబట్టి చలి ఉంటుంది. ఇక శీతాకాలంలో ఈ రహదారి మంచుతో కప్పబడి ఉంటుంది. రోడ్డు మూసుకుపోయింది. భారీ హిమపాతం, వర్షంతో అప్పుడప్పుడు తుఫానులు. వాతావరణ సూచన ఇక్కడ పని చేయదు. వాతావరణ మార్పుల కారణంగా ఇక్కడ ఒంటరిగా వెళ్లడం నిషేధించబడింది.

చివరి అంచున.. ఈ రోడ్డు వెంట దట్టమైన దేవదారు చెట్లు, రెయిన్ డీర్లు కనిపిస్తుంటాయి. ఈ రోడ్డు డెడ్‌ఎండ్‌కు వెళ్తే చివరకి సముద్రం కనిపిస్తుంది. ఈ- డెడ్‌ఎండ్ దగ్గర ఓ సొరంగం కూడా ఉంది. దాన్ని సముద్రంలో నిర్మించారు. ఇది మెగెరోయా అనే ఐలాండ్‌ని కలుపుతుంది. ఈ డెడ్‌ఎండ్ దగ్గర భూమిలోపల ఒక చర్చి, మ్యూజియం కూడా ఉన్నాయి. ఒకప్పుడు హైవేపై ఇక్కడికి వచ్చినవారు అక్కడితో తమ ప్రపంచయాత్ర ముగిసిందని భావించేవారు. 'ఇ--69' రహదారి ప్రతి ప్రయాణానికి ఒక అంతం ఉంటుందని చెబుతుంది.

నిర్మాణానికి 62 ఏళ్లు.

E-69 హైవేను 1930లో ఐరోపాలోని నార్వేలో నిర్మించాలని శాస్త్రజ్ఞులు ప్రణాళిక రూపొందించారు. అయితే దానిని ఖరారు చేయడానికి మరో నాలుగేళ్లు పట్టింది. అంటే 1934లో రోడ్డు నిర్మాణం ప్రారంభించారు. ఆశ్చర్యం ఏమిటంటే ఈ రోడ్డు నిర్మాణానికి 62 ఏళ్లు పట్టింది. 1992లో నిర్మాణం పూర్తయింది. అయితే, అనంతం వరకు వెళ్లే ఇలాంటి రోడ్లు ప్రపంచంలో చాలానే ఉన్నాయని భూగర్శ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

కష్టమైన జీవన శైలి.

ఇక్కడ బతకడం చాలా కష్టం. ఇంట్లో ఉన్నా చల్లగానే ఉంటుంది. ఇంట్లో 24 గంటలూ చలి మంట వేసుకుంటారు. బయటకు వస్తే రక్తం గడ్డకట్టేసేలా చలి ఉంటుంది. ఇక్కడ చేపల వ్యాపారమే సాగుతోంది. ఇంకేమీ చెయ్యడానికి వీలుగా ఉండదు. ఆ చేపలు కూడా సముద్రంలో లభిస్తాయి కాబట్టి... వాటిని అమ్ముతారు. మార్కెట్‌లో అవి ఎప్పుడూ ఫ్రెష్‌గానే ఉంటాయి గానీ.. గట్టిగా రాళ్లలా ఉంటాయి. వాటిని ఇంటికి తీసుకెళ్లి వేడి నీటిలో వేస్తే... అప్పుడు మెత్తగా అవుతాయి. అలాంటి ఇబ్బందికరమైన పరిస్థితులు ఇక్కడ ఉంటాయి. అయినా సరే ప్రజలు అలాగే జీవిస్తున్నారు.

పర్యాటకంగా.

ప్రపంచ పర్యాటకుల్ని ఆహ్వానించడం మొదలుపెట్టారు. దీంతో స్థానికులు ఆదాయం సంపాదించుకునేందుకు వీలవుతోంది. ఈ రోడ్డుపై ఎన్ని కండీషన్లు ఉన్నా... రోజూ చాలా మంది పర్యాటకులు దీన్ని చూసేందుకు వస్తున్నారు. ఎందుకంటే... భూమి ఉత్తర ధ్రువంపై కాలు పెట్టడం అంత ఈజీ కాదు ... కనీసం ఈ రోడ్డు చివరి దాకానైనా వెళ్లి... ఉత్తర ధ్రువం వైపు వెళ్లిన ఫీల్ పొందవచ్చని భావిస్తున్నారు పర్యాటకులు. చలికాలంలో ఇక్కడికి వెళ్లేవారికి ఓ స్పెషాలిటీ ఉంటుంది. వారు అరోరాలను చూడగలరు. సూర్యుడి నుంచి వచ్చే సౌర గాలులు ఆకాశంలో గ్రీన్, పింక్ కలర్స్ లాగా కనిపిస్తాయి.

గుంపుగా ప్రజలు వచ్చినప్పుడు మాత్రమే ఈ రోడ్డుపై వెళ్లనిస్తారు. ఇందుకు బలమైన కారణం ఉంది. ఈ రోడ్డు ఉన్న ప్రాంతం మొత్తం మంచు తెరలు కప్పేసి ఉంటాయి. వాహనం నడిపేటప్పుడు రోడ్డు ఎక్కువ దూరం కనిపించదు. ఆ పొగమంచులో దారి తప్పి... ఎటో నడిపితే... ప్రమాదం అంచుల్లోకి వెళ్లినట్లే. పైగా ఈ రోడ్డులో ఐదు సొరంగాలు ఉంటాయి. అలాంటి రోడ్డు ప్రయాణంలో ఒక్కరే ఉంటే కష్టమే కదా... అదే ఎక్కువ మంది ఉంటే... ఆపదలో ఉన్నవారిని మిగతా వారు కాపాడేందుకు వీలవుతుంది. అందుకే ఆ కండీషన్ పెట్టారు. చలికాలంలో మరో కండీషన్ ఉంది. సొంత వాహనాల్లో వెళ్లనివ్వరు. రోజూ రెండు కాన్వాయ్‌లు నడుపుతారు. పర్యాటకులు ఆ కాన్వాయ్‌లలో మాత్రమే వెళ్లేందుకు వీలు ఉంటుంది. ప్రత్యేక సమయంలో వాతావరణం బాగుంటేనే వాటిని నడుపుతారు.

అద్భుతాలెన్నో

ఈ హైవేపై ప్రయాణిస్తే.. ప్రకృతికి ఉన్న రకరకాల రూపాలను చూడొచ్చు. దారి పొడవునా కనిపించే మంచు కొండలు తనలోకి తీసుకోడానికి ముందుకు వస్తున్నట్టు అనిపిస్తాయి. రోడ్డు వెంబడి ఎన్నో లోయలు, ఎత్తైన గుట్టలు కనిపిస్తాయి. 'ఇ-69' హైవేలో కొన్ని ప్రాంతాల్లో ఒంటరిగా కారు నడపడం నిషిద్ధం. వందల కిలోమీటర్ల పాటు సముద్ర తీరంపైనే ఈ రహదారిపై వెళ్తుంటే పక్కనే ఉన్న చిన్న చిన్న గ్రామాలు సముద్రంలో కలిసిపోతాయేమో అనే అనుభూతి కలుగుతుంది.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Let's find out where earth and sky meet"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0