Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Relationship Tips

 Relationship Tips: రిలేషన్ షిప్ లో ఈ తప్పులు చేయకండి.. నిపుణులు చెబుతున్న విషయాలు 

Relationship Tips

ఇష్టమైన వారితో రిలేషన్ లో ఉండటం సులభమైన విషయమే. కానీ దాన్ని చివరి వరకు నిలబెట్టుకోవడమే చాలా కష్టంతో కూడుకున్న వ్యవహారం. ఇందుకు లోతైన శ్రద్ధ, అవగాహన, ఆప్యాయత అవసరం.

ప్రేమ తగ్గడం ప్రారంభిమైనప్పుడు రిలేషన్ ను కొనసాగించే పరిస్థితి ఉండదు. అందుకే వారు నమ్మకం కోల్పోకుండా ప్రేమిస్తున్నానని చెప్పేందుకు ప్రయత్నించాలి. భాగస్వామికి ప్రత్యేక అనుభూతిని కలిగించాలి. మీ ప్రేమను ఎప్పటికప్పుడు వారికి తెలియజేయాలి. రిలేషన్ షిప్ లో కాలం గడిచేకొద్దీ ప్రేమ, వ్యామోహం తగ్గడం కామన్. ప్రేమలో ఉండటం నుంచి ఒకరిని ప్రేమించడం వైపునకు మారతామనే విషయాన్ని ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలి. రిలేషన్ షిప్ లో ఉన్న వారిలో చాలా మంది తమ అభిప్రాయాలను వ్యక్తం చేయరు. తమ ఆలోచనల కారణంగా ఎదుటి వారు ఇబ్బందులకు గురవుతారని భావిస్తుంటారు. అయితే ఇలా చేయడం ఏ మాత్రం సరైనది కాదు. ఏదైనా అవసరమైనప్పుడు నిస్సందేహంగా అడగాల్సిందే. 

భాగస్వామి పట్ల ఎప్పుడూ గౌరవంగా ఉండాలి. సాధారణంగా, మనకు కోపం వచ్చినప్పుడు ఆవేశంలో అనరాని మాటలు అనేస్తాం. అవి భాగస్వామిని తీవ్రంగా బాధించవచ్చు. ఆ తర్వాత రియలైజ్ అయ్యి.. వారికి సారీ చెప్పడం గానీ, ఎందుకు అలా మాట్లాడాల్సి వచ్చిందో అర్థం అయ్యేలా చెబితే చాలు వారు అర్థం చేసుకునే అవకాశం లేకపోలేదు. భాగస్వామి చేసిన ప్రయత్నాలకు థ్యాంక్స్ చెబుతుండాలి. మీ భావాలను పంచుకోవాలి. పొరపాట్లు అనుకోకుండా జరుగుతాయి, కాబట్టి భాగస్వామిని ఏది బాధపెడుతుందో ఎప్పటికీ తెలియదు. కాబట్టి మీరు తప్పు చేస్తే బాధపెడుతుందో ఎప్పటికీ తెలియదు. కాబట్టి మీరు తప్పు చేస్తే తప్పకుండా బాధ్యత వహించాల్సిందే. అంతే కాకుండా భాగస్వామితో మరింత సమర్థవంతంగా కనెక్ట్ అవ్వాలి.

పార్ట్ నర్ కు సపోర్ట్ గా ఉండటం చాలా అవసరం. వారికి మీరు ఉన్నారనే ధైర్యాన్ని కలిగించాలి. ప్రతి విజయాన్ని వారితో కలిసి సెలబ్రేట్ చేసుకోవాలి. వారు వేసే ప్రతి అడుగును ప్రోత్సహించాలి. అభిప్రాయాలకు విలువ ఇవ్వడం అలవాటు చేసుకోవాలి. ఎదుటి వారు చెబుతున్నది సరైనది కాకపోయినా ముందు పూర్తిగా వినాలి. ఆ తర్వాత ఆ టాపిక్ పై మీకున్న డౌట్స్ ను, అలా చేయడం వల్ల కలిగే నష్టాలు, ఇబ్బందులను వివరించాలి. ఏది ఏమైనా రిలేషన్ షిప్ సాఫీగా ఉండాలంటే ఎవరో ఒకరు తగ్గాలనే విషయాన్ని మర్చిపోకూడదు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Relationship Tips"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0