Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

UPSC Civil Services

UPSC Civil Services : డిగ్రీ అర్హతతో 1206 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు. దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది

UPSC Civil Services

DOWNLOAD HALL TICKETS

UPSC Civil Services Exam 2024 : అందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఉద్యోగ నియామక నోటిఫికేషన్లు వచ్చేశాయ్‌. సివిల్ సర్వీసెస్‌ ఎగ్జామినేషన్‌ (UPSC CSE)- 2024, ఇండియన్‌ ఫారెస్ట్‌ సర్వీస్‌ ఎగ్జామ్‌-2024 నోటిఫికేషన్లను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) విడుదల చేసింది. ఈసారి సీఎస్‌ఈ నోటిఫికేషన్‌ ద్వారా 1056 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇక.. ఈ పోస్టుల భర్తీకి సంబంధించి ఆన్‌లైన్‌ దరఖాస్తులు ఫిబ్రవరి 14వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. అర్హత ఉన్న అభ్యర్థులు మార్చి 5వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. మే 26వ తేదీన ప్రిలిమినరీ పరీక్ష జరుగనుంది.

UPSC CSE 2024 నోటిఫికేషన్‌ ద్వారా వివిధ సివిల్ సర్వీసులకు చెందిన ఉద్యోగాలు భర్తీ కానున్నాయి. సీఎస్‌ఈ ద్వారా గతేడాది (UPSC CSE 2024) 1,105 ఖాళీలను భర్తీ చేయగా.. ఈ ఏడాది 1056 పోస్టులను భర్తీ చేయనున్నారు. అలాగే.. ఐఎఫ్‌ఎస్‌ నోటిఫికేషన్‌ (UPSC IFS 2024) ద్వారా 150 ఖాళీలను భర్తీ చేయున్నారు. సీఎస్‌ఈ 2024 పరీక్షకు ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులై అభ్యర్థులు అర్హులు. డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక.. అభ్యర్థుల వయసు 21 ఏళ్లు నిండి ఉండి.. 32 ఏళ్లు మించకుండా ఉండాలి. రాత పరీక్ష (ప్రిలిమ్స్, మెయిన్స్), ఇంటర్వ్యూ, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 

యూపీఎస్సీ ఇంజినీరింగ్ సర్వీసెస్ ఎగ్జామినేషన్‌ (UPSC ESE)-2024 ప్రిలిమ్స్‌ పరీక్ష ఈ-అడ్మిట్‌ కార్డులను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) విడుదల చేసింది. ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు రిజిస్ట్రేషన్‌ ఐడీ, పుట్టిన తేదీ వివరాలతో అడ్మిట్‌ కార్డు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో ఫిబ్రవరి 18వ తేదీన పరీక్ష జరుగనుంది. ఈ పరీక్షకు తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్, విశాఖపట్నం, తిరుపతి నగరాల్లో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు.

యూపీఎస్సీ ఈ నోటిఫికేషన్‌ ద్వారా దేశవ్యాప్తంగా రైల్వే, టెలికాం, డిఫెన్స్‌ సర్వీస్‌ తదితర కేంద్ర ప్రభుత్వ విభాగాలు, శాఖల్లో ఇంజినీరింగ్‌ ఉద్యోగాలు భర్తీ చేయనుంది. సివిల్‌ ఇంజినీరింగ్‌, మెకానికల్‌ ఇంజినీరింగ్‌, ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ టెలీకమ్యూనికేషన్‌ ఇంజినీరింగ్‌ విభాగాల్లో మొత్తం 167 పోస్టులు భర్తీ చేయనున్నారు. స్టేజ్‌-1(ప్రిలిమినరీ) ఎగ్జామ్‌, స్టేజ్‌-2 (మెయిన్‌) ఎగ్జామ్‌, స్టేజ్‌-3 (పర్సనాలిటీ టెస్ట్‌), మెడికల్‌ ఎగ్జామినేషన్‌, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "UPSC Civil Services"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0