Water Apple
Water Apple: ఈ పండు తింటే ఎంత షుగర్ ఉన్నా డౌన్ అవ్వాల్సిందే
డయాబెటీస్ ఉన్నవారు ఏ ఆహారం తీసుకోవాలన్నా ఇబ్బందిగానే ఉంటుంది. ఆహారం విషయంలో ఏ మాత్రం కాస్త నిర్లక్ష్యం వహించినా.. ప్రాణాల మీదకు తెస్తుంది. షుగర్ వ్యాధికి ఇప్పటి వరకూ సరైన మందు లేదు.
కేవలం ఆహారంతోనే కంట్రోల్ చేసుకోవాలి. ఒక్కసారి మధుమేహం వచ్చిందంటే.. అంత త్వరగా తగ్గదు. కాబట్టి రాకుండానే జాగ్రత్త పడండి. డయాబెటీస్ ఉండే వారికి ఆకలి అనేది ఎక్కువగా వేస్తుంది. దీంతో ఏం తినాలా అని తర్జనభర్జన పడుతూ ఉంటారు. చాలా మంది వీక్ అయిపోతారు. ఇలాంటి వారికి ఈ ‘వాటర్ యాపిల్’ చాలా బెటర్ అని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.
ఈ వాటర్ యాపిల్ చెట్టును కూడా ఇంట్లోనే పెంచుకోవచ్చు. పచ్చిగా ఉన్నప్పుడు ఆకుపచ్చగా.. పండినప్పుడు ఎర్రగా ఉంటుంది. ఈ పండును పచ్చిగా ఉన్నప్పుడైనా, పండిన తర్వాత అయినా తినవచ్చు. వాటర్ యాపిల్ తినడం వల్ల కేవలం షుగర్ తగ్గడమే కాకుండా ఇంకా చాలా ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.
రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గిస్తుంది:
వాటర్ యాపిల్ తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అనేవి తగ్గుతాయి. మీకు ఎంత ఎక్కువ షుగర్ ఉన్నా.. క్రమం తప్పకుండా ఈ పండు తింటే.. కంట్రోల్ అయిపోతుంది. డయాబెటీస్ ఉన్నవారికి ఈ ఫ్రూట్ చాలా బెటర్. వీటిల్లో ఐసో మెరిక్ ప్లేవనోన్, చాల్ కోన్ అనే రెండు రసాయన సమ్మేళనాలు ఉంటాయి. ఇవి రక్తంలో షుగర్ లెవల్స్‌ను అదుపులో ఉంచుతుంది.
జీర్ణ శక్తి మెరుగు పడుతుంది:
వాటర్ యాపిల్ తినడం వల్ల జీర్ణ శక్తి అనేది మెరుగు పడుతుంది. కడుపులో ఉబ్బరం, గ్యాస్, అజీర్తి, మల బద్ధకం వంటి సమస్యలు తగ్గుతాయి. పొట్ట ఫ్రీగా ఉంటుంది. చాలా తేలికగా ఫీల్ అవుతారు. ఇందులో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది.
వెయిట్ లాస్ అవుతారు:
వాటర్ యాపిల్‌లో నీటి శాతం, ఫైబర్ కంటెంట్స్ ఎక్కువగా ఉంటాయి. దీంతో ఇది కొద్దిగా తిన్నా కడుపు నిండిన ఫీలింగ్ ఉంటుంది. దీంతో ఇతర ఆహారాలను తినలేరు. ఈజీగా వెయిట్ లాస్ అవ్వొచ్చు.
ఇంకా చాలా బెనిఫిట్స్.
ఎముకలు కూడా బలంగా, దృఢంగా మారతాయి. చర్మం, జుట్టు సమస్యలు కూడా తగ్గుతాయి. గుండె ఆరోగ్యం మెరుగు పడుతుంది. క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధుల బారని పడకుండా ఉంటారు. శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపుతుంది వాటర్ యాపిల్.
గమనిక: ఇది నిపుణులు, అధ్యయనాల నుంచి సేకరించిన సమాచారం. అవగాహన కోసం మాత్రమే ఈ కథనం. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా నిపుణులను సంప్రదించడం మేలు.
0 Response to "Water Apple"
Post a Comment