Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

APPSC Forest Range Officers Notification 2024

 APPSC FRO: ఆంధ్రప్రదేశ్‌ అటవీశాఖలో ఫారెస్ట్‌ రేంజ్‌ ఆఫీసర్‌ ఉద్యోగాలు. నోటిఫికేషన్‌ విడుదల

APPSC Forest Range Officers Notification 2024

APPSC Forest Range Officers Notification 2024 : ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగ అభ్యర్థులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న అటవీ శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.

ప్రధానాంశాలు:

  • ఏపీపీఎస్సీ జాబ్‌ రిక్రూట్‌మెంట్‌ 2024
  • ఫారెస్ట్‌ రేంజ్‌ ఆఫీసర్‌ ఉద్యోగాలు భర్తీ
  • ఏప్రిల్‌ 15 నుంచి దరఖాస్తులు ప్రారంభం
  • 05.05.2024 దరఖాస్తులకు చివరితేది

ఆంధ్రప్రదేశ్ అటవీశాఖలో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్స్ (Forest Range Officers) పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా 37 ఫారెస్ట్‌ రేంజ్‌ ఆఫీసర్‌ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. అభ్యర్థులు ఏప్రిల్ 15వ తేదీ నుంచి మే 5వ తేదీ వరకు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. రాత పరీక్ష, కంప్యూటర్ ప్రొఫీషియన్సీ టెస్ట్, సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. అభ్యర్థులు పూర్తి వివరాలను https://psc.ap.gov.in/ వెబ్‌సైట్‌లో చూడొచ్చు.

ముఖ్య సమాచారం :

మొత్తం  పోస్టులు - 37

అర్హత: సంబంధిత విభాగంలో బ్యాచిలర్స్ డిగ్రీ లేదా తత్సమాన విద్యార్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అగ్రికల్చర్‌, బోట‌నీ, కెమిస్ట్రీ, కంప్యూటర్ అప్లికేషన్స్ / కంప్యూటర్ సైన్స్, ఇంజినీరింగ్ (అగ్రికల్చర్‌/ కెమికల్ / సివిల్ / కంప్యూటర్ / ఎలక్ట్రికల్ / ఎలక్ట్రానిక్స్ /మెకానికల్) పర్యావరణ శాస్త్రం, ఫారెస్ట్రీ, జాగ్రఫీ, హార్టీకల్చర్‌, మ్యాథమెటిక్స్‌, ఫిజిక్స్‌, స్టాటిస్టిక్స్‌, వెటర్నరీ సైన్స్, జువాలజీ విభాగాల్లో తత్సమాన విద్యార్హతతో పాటు నోటిఫికేషన్‌లో చూపిన విధంగా శారీరక/ వైద్య ప్రమాణాలు కలిగి ఉండాలి.

వయోపరిమితి: 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.

దరఖాస్తు ఫీజు: ప్రతి అప్లికెంట్‌ రూ. 250 అప్లికేష‌న్ ప్రాసెసింగ్ ఫీజుతో పాటు.. ప‌రీక్ష ఫీజు రూ. 120 చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ/ ఎస్టీ, బీసీ/ఎక్స్ సర్విస్‌మెన్ తదితరులకు ప‌రీక్ష ఫీజు రూ.120 నుంచి మినహాయింపు ఉంటుంది.

జీతం: రూ. 48,000 నుంచి రూ. 1,37,220గా నిర్ణయించారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

NOTIFICATION

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "APPSC Forest Range Officers Notification 2024"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0