Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

APRDC CET 2024 Notification

 APRDC CET 2024 Notification

APRDC CET 2024 Notification

APRDC CET: ఏపీ ఆర్‌డీసీసెట్‌-2024 

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం పల్నాడు జిల్లా నాగార్జునసాగర్‌లోని రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాలలో 2024-25 విద్యాసంవత్సరానికి డిగ్రీ​(ఆంగ్ల మాధ్యమం) మొదటి సంవత్సరంలో ప్రవేశాలకు గుంటూరులోని ఏపీ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ దరఖాస్తులు కోరుతోంది. ఇందుకు సంబంధించి ఏపీఆర్‌డీసీ సెట్‌-2024 నోటిఫికేషన్​ను విడుదల చేసింది. ఇంటర్‌ ఉత్తీర్ణులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అర్హులైన విద్యార్థులు మార్చి 31వ తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకున్నవారికి ఏప్రిల్‌ 25వ తేదీన ప్రవేశపరీక్ష నిర్వహించనున్నారు. 

ప్రవేశ వివరాలు:

ఏపీ రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజ్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌-2024

గ్రూపు, సీట్లు: బీఏ(హిస్టరీ, ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్)- 40 సీట్లు; బీకాం- 40 సీట్లు; బీఎస్సీ (మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ)- 36 సీట్లు; బీఎస్సీ(మ్యాథ్స్, స్టాటిస్టిక్స్ అండ్‌ కంప్యూటర్ సైన్స్)- 36 సీట్లు.

మొత్తం సీట్ల సంఖ్య: 152.

అర్హత: 2023-24 విద్యా సంవత్సరంలో ఇంటర్మీడియట్ లేదా తత్సమాన అర్హత పరీక్ష ఉత్తీర్ణులై ఉండాలి.

ఎంపిక ప్రమాణాలు: కామన్ ఎంట్రన్స్ టెస్ట్, రిజర్వేషన్ ఆధారంగా.

పరీక్ష ఫీజు: 

ఆన్‌లైన్ దరఖాస్తు :రూ.300.

ముఖ్య తేదీలు

ప్రారంభం: 01.03.2024.

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 31.03.2024.

హాల్ టికెట్‌ల జారీ: 12.05.2023.

ప్రవేశ పరీక్ష తేదీ: 25.04.2024.

మెరిట్ జాబితా వెల్లడి: 14.05.2024.

మొదటి దశ కౌన్సెలింగ్ తేదీ: 23.05.2024.

రెండో దశ కౌన్సెలింగ్ తేదీ: 31.05.2024.

మూడో దశ కౌన్సెలింగ్ తేదీ: 07.06.2024.

Website Here : https://aprs.apcfss.in/aprdc-index

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "APRDC CET 2024 Notification"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0