Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Details of new rules in these areas from April.

 ఏప్రిల్ నుండి ఈరంగాలలో కొత్త రూల్స్ వివరాలు.

Details of new rules in these areas from April.

ప్రతి దేశంలో ఆర్థిక వ్యవస్థ అనేది ఎంతో కీలకమైనది. ఇది ఎంత పటిష్ఠంగా ఉంటే.. దేశం అభివృద్ధి దిశలో అంత మెరుగు చెందుతుంది. మరి ప్రపంచ దేశల్లలో ప్రతి ఏటా ఆర్థిక సంవత్సర విధానాన్ని పాటిస్తర్నసంగతి తెలిసిందే. అయితే ఈ విధానం అనేది ఒక్కో దేశంలో ఒక్కోక్కలా ఉంటుంది. ఉదహరణకు అగ్రారాజ్యమైన అమెరికాలో.. ఆర్థిక సంవత్సరం అక్టోబరు 1న ప్రారంభమై తర్వాతి ఏడాది సెప్టెంబరు న 30న ముగుస్తుంది. ఇక ఆస్ట్రేలయాలో జులై 1న ప్రారంభమై దాని తర్వాత సంవత్సరం జూన్ 30న ముగుస్తుంది. ఇలా ఒక్కోక్క దేశంలో ఒకోలా ఉంటే.. మన దేశంలో మాత్రం మాత్రం ఏప్రిల్ 1తో ప్రారంభమై.. తర్వాత ఏడాది మార్చి 31తో ఎండ్ అవుతుంది. ఇక ఆర్థిక సంవత్సరం ముగియడంతో పాటు.. కొత్త ఆర్థిక సంవత్సరంలోకి అడగుపెట్టబోతున్నా ముందు కొన్ని బడ్జెట్ నియమాలను కూడా ప్రవేశ పెడతారు. ఇక వాటిని తప్పనిసారిగా తెలుసుకోవాలి. మరి, ఈ సంవత్సరం అమలులోకి వచ్చే ఆర్థిక నియమాలు ఏంటో తెలుసుకుందాం.

మరో మూడు రోజుల్లో మార్చి నెల ముగియడంతో పాటు కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభమవుతుంది. మరి, ఏప్రిల్ 1, 2024 నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం(new financial year) మొదలవతున్న నేపథ్యంలో.. కొన్ని ఐటీ నింబంధనలు కూడా మారుతుంటాయి. ఇెక ఈ కొత్త సంవత్సరం వ్యాపార ఆర్థిక విషయాల్లో కూడా కొన్ని నియమాలు అమలులోకి వచ్చాయి. మరి ఈసారి ప్రవేశపెట్టిన ఆ ఆర్థిక నియమాలను ప్రతిఒక్కరూ తప్పనిసరిగా తెలుసుకోవాలి. ఎందుకంటే ఇవి సామాన్య ప్రజలపై ప్రత్యక్షంగా ప్రభావం చూపనున్నాయి. మరి ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఫాస్టాగ్ KYC అప్‌డేట్

సాధారణంగా ఫాస్టాగ్‌కి సంబంధించి కొన్ని నియమాలు ఏప్రిల్ 1, 2024 నుంచి మారునున్నాయి. ఈ క్రమంలో ప్రతిఒక్కరూ మార్చి 31, 2024లోపు Fastag KYCని తప్పని సరిగా అప్‌డేట్ చేసుకోవాలి. లేకుంటే.. వచ్చే నెల నుంచి అనేక ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. పైగా ఎవరికైనా KYC లేకుంటే బ్యాంకులు ఫాస్టాగ్‌ని డీయాక్టివేట్ చేస్తున్నాయి. అంటే ఫాస్టాగ్‌లో బ్యాలెన్స్ ఉన్నా దాని ద్వారా చెల్లింపు జరగదు. అందుచేతనే NHAI ఫాస్టాగ్ KYC అప్‌డేట్ అనేది తప్పనిసరిగా చేసుకోవాలి.

పాన్, ఆధార్ లింక్

ఇప్పటి వరకు ఇంకా ఆధార్ కార్డుతో పాన్ కార్డును అనుసంధానం చేయనివారు వెంటనే దానిని కూడా చేసుకోవాలి. ఎందుకంటే.. పాన్‌ను ఆధార్‌తో లింక్ చేయడానికి గడువు మార్చి 31, 2024 వరకు మాత్రమే ఉంది. కనుక ఇప్పటి వరకు ఇంకా పాన్‌ను ఆధార్‌తో లింక్ చేయకపోతే వెంటనే లింక్ చేసుకోండి. అలా చేయకుంటే.. పాన్ నంబర్ కచ్చితంగా రద్దు చేయబడుతుంది. అంటే పాన్ డాక్యుమెంట్‌గా ఉపయోగించుకోవడానికి సాధ్యపడదు. కనుక ఏప్రిల్ 1 తర్వాత పాన్‌ను ఆధార్‌తో లింక్ చేయాలి అనుకునే వినియోగదారులు రూ. 1,000 జరిమానా చెల్లించాల్సి ఉంటుంది.

EPFO కొత్త రూల్

ఇక EPFO నిబంధనలు కూడా ఏప్రిల్ 1, 2024 నుంచి మారబోతున్నాయి. నిజానికి ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ కొత్త నిబంధన వచ్చే నెల నుంచి అమలు కాబోతుంది. అయితే ఈ నియమం ప్రకారం.. ఎంప్లాయ్ ఉద్యోగం మారిన తర్వాత PF ఖాతా ఆటో మోడ్‌లో బదిలీ చేయబడుతుంది. అంటే వినియోగదారుల ఖాతాను బదిలీ చేయడానికి అభ్యర్థన ఇవ్వాల్సిన అవసరం లేదు. కనుక ఈ నిబంధన అనేది అమలులోకి వచ్చిన తర్వాత వినియోగదారుల ఇబ్బందులు చాలా వరకు తగ్గనున్నాయి.

SBI క్రెడిట్ కార్డ్

అలాగే SBI క్రెడిట్ కార్డ్ కలిగి ఉన్న వినియోగదారులకు కూడా ఏప్రిల్ 1, 2024 నుంచి కొత్త నిబంధనలు అనేవి అమల్లోకి రానున్నాయి. ఒకవేళ మీరు SBI క్రెడిట్ కార్డ్ ద్వారా అద్దె చెల్లింపును చేస్తే.. ఏప్రిల్ 1 నుంచి అద్దె చెల్లింపుపై మీకు ఎటువంటి రివార్డ్ పాయింట్లు ఉండవు. ఈ నియమం కొన్ని క్రెడిట్ కార్డ్‌లపై ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తుంది. కను SBI క్రెటిట్ కార్డు నిబంధన అనేది ఇది ఏప్రిల్ 15, 2024 నుంచి వర్తింపజేస్తుంది.

LPG గ్యాస్ ధర

ఇక LPG సిలిండర్ గ్యాస్ ధరలు కూడా దేశవ్యాప్తంగా ఏప్రిల్ 1, 2024న నుంచి మారనున్నాయి. అయితే 2024 లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో వాటి ధరల్లో కొన్ని మార్పులు వచ్చే అవకాశం అనేది తక్కువగా ఉన్నాయి.

కొత్త పన్ను విధానం

చాలామంది పన్ను చెల్లింపుదారులు ఇప్పటి వరకు పన్ను విధానాన్ని ఎంచుకోకపోతే తక్షణమే దానిని ఎంచుకోండి. ఎందుకంటే.. ఏప్రిల్ 1, 2024 నుంచి కొత్త పన్ను విధానం అనేది డిఫాల్ట్ పన్ను విధానంగా మారుతుంది. ఈ క్రమంలో కొత్త పన్ను విధానంలో నిబంధనల ప్రకారం పన్ను చెల్లింపుదారులు ఆటోమేటిక్‌గా పన్ను చెల్లించాల్సి వస్తుంది.

ఇక కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభమైవుతున్న సందర్భంగా అమలులోకి వచ్చిన ఈ ఆర్థిక నిబంధనలను ప్రతిఒక్కరు తెలుసుకోని తప్పనిసరిగా పాటించాండి. మరి, ఈ సంవత్సరం అమలులోకి వచ్చిన ఈ ఆర్థిక నియమాలు వచ్చిన మార్పులు పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Details of new rules in these areas from April."

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0