Exam Stress
Exam Stress: పరీక్షల సమయంలో పిల్లలు ఒత్తిడికి లోను కాకూడదంటే ఇలా చేయండి చాలు.
పిల్లలు స్కూలు, కాలేజీ దశలలో బాగా చదివి మంచి మార్కులు తెచ్చుకుంటే వారి తదుపరి దశలు కూడా చక్కగా ఉంటాయి. కానీ నేటికాలంలో చాలామంది పిల్లలు పరీక్షలు, ర్యాంకుల ఒత్తిడిలో సతమతం అవుతున్నారు.
సరిగ్గా చదివినా పరీక్షలు బాగా రాయగలుగుతామో లేదోనని, తక్కువ మార్కులు వస్తే స్కూల్ టీచర్ల నుండి తల్లిదండ్రుల వరకు అందరూ అనే మాటలకు భయపడి తీవ్ర ఒత్తిడికి లోనవుతుంటారు. పిల్లలలో పరీక్షల ఒత్తిడి దూరం కావాలంటే ఈ కింది పనులు తప్పక చేయాలి.
విశ్రాంతి.
పరీక్షల ఒత్తిడి తగ్గాలంటే పిల్లలు చదివేటప్పుడు విశ్రాంతి, విరామం తీసుకోవాలి. చదువులో మరింత మెరుగ్గా ఉండాలన్నా, చదివేది బాగా అర్థం కావాలన్నామైండ్ ను రిలాక్స్ గా ఉంచుకోవడం ఎంతో అవసరం.
ధ్యానం.
రోజూ కనీసం 20 నిమిషాల రెగ్యులర్ మెడిటేషన్ చేయడం వల్ల ఏకాగ్రత పెంపొందించుకోవడం సులువు అవుతుంది. ఇది మానసిక ప్రశాంతతను కాపాడుతుంది.
ఆహారం.
ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. వాల్ నట్లు, పండ్లు,ఒమేగా సమృద్దిగా ఉండే ఆహారాలు, కూరగాయలు జ్ఞాపకశక్తిని, ఏకాగ్రతను పెంచుతాయి. అదే విధంగా దైవభక్తి , ప్రార్థన కూడా మానసిక ఆరోగ్యం పెచుతుంది.
నిద్ర.
మానసిక ఆరోగ్యం బాగుండాలన్నా, ఒత్తిడి తగ్గాలన్నా సరైన నిద్ర చాలా అవసరం. అలసిపోయిన మెదడుకు విశ్రాంతిని, ఓదార్పును ఇవ్వడంలో నిద్ర చాలా సహాయపడుతుంది.
0 Response to "Exam Stress"
Post a Comment