Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

NVS Non Teaching Recruitment 2024: Notification Out For 1377 Posts

 1,377 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు. నెలకు లక్షకు పైగా జీతం. అర్హతలు మరియు పూర్తి వివరాలు

NVS Non Teaching Recruitment 2024: Notification Out For 1377 Posts

నిరుద్యోగులు జాబ్ కొట్టేందుకు ఇదే సరైన సమయం. ఇటు రాష్ట్రం, అటు కేంద్రంలో భారీగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు రిలీజ్ అవుతున్నాయి. మళ్లీ రాని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే జీవితంలో ఉన్నత స్థానంలో స్థిరపడిపోవచ్చు. ఇటీవల 1377 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ ఉద్యోగాలకు ఎంపికైతే నెలకు రూ. లక్షలకు పైగా జీతం అందుకోవచ్చు. ప్రభుత్వ ఉద్యోగం సాధించడమే మీ లక్ష్యమైతే ఈ జాబ్స్ ను అస్సలు వదలొద్దు. మరి ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునేందుకు అర్హులు ఎవరంటే?

నవోదయ విద్యాలయ సమితి నిరుద్యోగులకు గుడ్ న్యూస్ అందించింది. దేశవ్యాప్తంగా ఉన్న జవహర్ నవోదయ విద్యాలయాల హెడ్‌క్వార్టర్స్‌లలో, నవోదయ విద్యాలయ కార్యాలయాల్లో 1,337 నాన్ టీచింగ్ పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను రిలీజ్ చేసింది. ప్రకటించిన పోస్టుల్లో హెడ్‌క్వార్టర్స్‌లలో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, ఆడిట్ అసిస్టెంట్, జూనియర్ ట్రాన్స్‌లేషన్ ఆఫీసర్, లీగల్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్, కంప్యూటర్ ఆపరేటర్, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, మల్టీటాస్కింగ్ స్టాఫ్ పోస్టులను, నవోదయ విద్యాలయ కార్యాలయాల్లో స్టాఫ్ నర్స్(ఉమెన్), కేటరింగ్ సూపర్‌వైజర్, జూనియర్ సెక్రటేరియట్అసిస్టెంట్, ఎలక్ట్రీషియన్ కమ్ ప్లంబర్, ల్యాబ్ అటెండెంట్, మెస్ హెల్పర్ పోస్టులను భర్తీచేయనున్నారు. అభ్యర్థులు ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది

ఖాళీల వివరాలు:

1. ఫిమేల్‌ స్టాఫ్ నర్స్: 121 పోస్టులు

2. అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్: 5 పోస్టులు

3. ఆడిట్ అసిస్టెంట్: 12 పోస్టులు

4. జూనియర్ ట్రాన్స్‌లేషన్‌ ఆఫీసర్: 4 పోస్టులు

5. లీగల్ అసిస్టెంట్: 1 పోస్టు

6. స్టెనోగ్రాఫర్: 23 పోస్టులు

7. కంప్యూటర్ ఆపరేటర్: 2 పోస్టులు

8. క్యాటరింగ్ సూపర్‌వైజర్: 78 పోస్టులు

9. జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్: 381 పోస్టులు

10. ఎలక్ట్రీషియన్ కమ్ ప్లంబర్: 128 పోస్టులు

11. ల్యాబ్ అటెండెంట్: 161 పోస్టులు

12. మెస్ హెల్పర్: 442 పోస్టులు

13. మల్టీ టాస్కింగ్ స్టాఫ్: 19 పోస్టులు

మొత్తం పోస్టుల సంఖ్య: 1,377.

అర్హత: పోస్టును అనుసరించి 10వ తరగతి, 12వ తరగతి, సంబంధిత విభాగంలో డిప్లొమా, బ్యాచిలర్స్ డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. 

ఎంపిక విధానం: రాత పరీక్ష, ట్రేడ్/ స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు. 

తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: అనంతపురం, కాకినాడ, నెల్లూరు, గుంటూరు, కర్నూలు, విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్, మహబూబ్‌నగర్, నిజామాబాద్, ఖమ్మం, కరీంనగర్.

దరఖాస్తు విధానం: కేంద్రీయ విద్యాలయ సమితి వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు రుసుము: జనరల్‌/ ఓబీసీ/ ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు రూ.1500(ఫిమేల్‌ స్టాఫ్ నర్స్ పోస్టులకు) రూ.1000 (ఇతర పోస్టులకు). ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులకు రూ.500.

How To Apply For NVS Non-Teaching 2024? 

The registration process for these posts will consist of various steps including filling up the application form, uploading of concerned documents and fee payment. You can apply for these posts in online mode after following the steps given below. 

Step I: Visit to the official website-https://navodaya.gov.in.

Step 2:  You have to follow the link as mentioned on the official website.  

Step 3: Only one application per candidate for a particular post is allowed under the recruitment process.

Step 4: Login into the recruitment portal with the credentials on the official website.

Step 5: Uploaded the photograph, signature and requisite documents/Certificates to the link.

Step 6: Complete the application submission process step by step by filling required information and take printout of the same.

గమనిక: ఆన్‌లైన్ దరఖాస్తు, పరీక్ష తేదీలు త్వరలో వెల్లడి కానున్నాయి

OFFICIAL WEBSITE  https://navodaya.gov.in/


NOTIFICATION

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "NVS Non Teaching Recruitment 2024: Notification Out For 1377 Posts"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0