These are the foods that children should be fed if they want to grow tall.. What are the benefits of eating these
పిల్లలు ఎత్తు పెరగాలంటే తినిపించాల్సిన ఆహారాలు ఇవే.. ఇవి తింటే ఎన్నో లాభాలు.
ఈమధ్య కాలంలో తల్లీదండ్రులలో చాలామంది పిల్లలు ఎత్తు లేరని తెగ టెన్షన్ పడుతున్నారు. పిల్లలు పొట్టిగా ఉండటం వల్ల పిల్లలు సైతం ఆత్మనూన్యతకు గురవుతున్న సందర్భాలు అయితే ఉన్నాయి.
పిల్లలకు కొన్ని ఆహారాలు ఇవ్వడం ద్వారా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. పిల్లల్లో ఎత్తు పెరగడానికి క్యాల్షియం ఎంతో ముఖ్యమనే సంగతి తెలిసిందే. సోయాబీన్స్, సోయా మిల్క్ ను రెగ్యులర్ గా డైట్ లో భాగంగా చేస్తే పిల్లలు ఎత్తు పెరిగేలా చేయవచ్చు.
రెగ్యులర్ గా పాలు తాగడం ద్వారా కూడా పిల్లలు సులువుగా ఎత్తు పెరిగే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. పిల్లల ఆహారంలో మాంసాన్ని భాగం చేయడం ద్వారా కూడా పిల్లలు ఎత్తు పెరిగే అవకాశాలు అయితే ఉంటాయి. పిల్లలు ఎత్తు పెరగడంలో గుడ్లు ఎంతగానో సహాయపడతాయి. ప్రతిరోజూ గుడ్లు తినడం ద్వారా పిల్లల ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుందని చెప్పవచ్చు.
పిల్లలు బెండకాయలను ఎక్కువగా తింటే సులువుగా ఎత్తు పెరిగే అవకాశం ఉంటుంది. పిల్లల ఎత్తు పెరగాలని భావించే తల్లీదండ్రులు పిల్లల ఆహారం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. పిల్లలకు సరైన పోషకాహారం లభిస్తే పిల్లలకు ఆరోగ్య ప్రయోజనాలు చేకూరడంతో పాటు సులువుగా ఎత్తు పెరుగుతారు. పిల్లల విషయంలో తల్లీదండ్రులు అన్ని విధాలుగా కేర్ తీసుకోవాలి.
పిల్లలు క్యారెట్ ను తీసుకోవడం ద్వారా ఎత్తు పెరిగే ఛాన్స్ ఉంటుంది. బీన్స్ తినడం వల్ల కూడా ఎత్తు పెరిగే అవకాశాలు ఉంటాయి. బెండకాయలు తినడం వల్ల శరీరానికి కావాల్సిన పోషకాలు లభిస్తాయి. బచ్చలికూర, బఠానీలు, అరటిపండు, సోయాబీన్, పాలు తీసుకోవడం ద్వారా ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. పిల్లలకు పౌష్టికాహారం అవసరం అనుకున్న వాళ్లు ఈ ఆహారాలను తినిపిస్తే మంచిది.
0 Response to "These are the foods that children should be fed if they want to grow tall.. What are the benefits of eating these"
Post a Comment