TTD - Tirumala Tirupati Devasthanam
TTD Jobs : తిరుమల తిరుపతి దేవస్థానం జాబ్ నోటిఫికేషన్ విడుదల.. రేపటి నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం
TTD - Tirumala Tirupati Devasthanam : ఆంధ్రప్రదేశ్ - తిరుపతిలోని తిరుమల తిరుపతి దేవస్థానం (Tirumala Tirupati Devasthanam).. శాశ్వత ప్రాతిపదికన TTD డిగ్రీ కాలేజీలు/ ఓరియంటల్ కాలేజీల్లో డిగ్రీ లెక్చరర్లు.. అలాగే TTD జూనియర్ కళాశాలల్లో జూనియర్ లెక్చరర్ ఉద్యోగాల భర్తీకి జనవరి నెలలో నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో మొత్తం 78 పోస్టులున్నాయి. వీటిలో కూడా డిగ్రీ లెక్చరర్ పోస్టులు- 49.. జూనియర్ లెక్చరర్-29 పోస్టులున్నాయి. అయితే.. జూనియర్ కాలేజీల్లోని 29 లెక్చరర్ పోస్టులకు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ మార్చి 5 నుంచి ప్రారంభమైంది. అర్హత, ఆసక్తిఉన్న విద్యార్థులు ఆన్‌లైన్ విధానంలో మార్చి 25వ తేదీ వరకు అప్లయ్ చేసుకోవచ్చు. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు పూర్తి వివరాలకు, దరఖాస్తు చేసుకోవడానికి ఏపీపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్ చూడొచ్చు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని హిందూ మతానికి చెందిన అభ్యర్థులు మాత్రమే ఈ పోస్టులకు అప్లయ్ చేసుకోవాల్సి ఉంటుంది.
మొత్తం పోస్టులు : 78
డిగ్రీ లెక్చరర్ పోస్టులు: 49
అకడెమిక్ రికార్డుతో పాటు కనీసం 55 శాతం మార్కులతో మాస్టర్స్ డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. దీంతోపాటు నెట్/స్లెట్ అర్హత తప్పనిసరి.
సబ్జెక్టుల వారీ జేఎల్ ఖాళీలు:
బోటనీ- 4, కెమిస్ట్రీ- 4, సివిక్స్- 4, కామర్స్- 2, ఇంగ్లిష్- 1, హిందీ- 1, హిస్టరీ- 4, మ్యాథమెటిక్స్- 2, ఫిజిక్స్- 2, తెలుగు- 3, జువాలజీ- 2 పోస్టులు ఉన్నాయి.
జూనియర్ లెక్చరర్: 29 ఖాళీలు
మాస్టర్స్ డిగ్రీలో కనీసం 55 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించిన వారు అర్హులు. ఈ పోస్టులకు సబ్జెక్టుల వారీ ఖాళీలను పరిశీలిస్తే.. బోటనీ- 4, కెమిస్ట్రీ- 4, సివిక్స్- 4, కామర్స్- 2, ఇంగ్లిష్- 1, హిందీ- 1, హిస్టరీ- 4, మ్యాథమెటిక్స్- 2, ఫిజిక్స్- 2, తెలుగు- 3, జువాలజీ- 2 చొప్పున పోస్టులు ఉన్నాయి.
విద్యార్హత: కనీసం 55% మార్కులతో మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి: అభ్యర్థుల వయసు 01-07-2023 నాటికి 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు అయిదేళ్లు.. దివ్యాంగులకు పదేళ్ల వయో సడలింపు ఉంటుంది.
జీత భత్యాలు: నెలకు జూనియర్ లెక్చరర్ పోస్టులకు రూ.57,100- రూ.1,47,760 ఉంటుంది.
ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష (కంప్యూటర్ ఆధారిత రిక్రూట్‌మెంట్ టెస్ట్), ధ్రువపత్రాల పరిశీలన తదితరాల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు ఫీజు: ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులు, ఎక్స్-సర్వీస్ మెన్ అభ్యర్థులకు రూ.250. ఇతరులకు రూ.370గా నిర్ణయించారు.
దరఖాస్తు విధానం : ఆన్‌లైన్ విధానంలో అప్లయ్ చేసుకోవాల్సి ఉంటుంది.
ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం: 05.03.2024
దరఖాస్తులకు చివరితేదీ: 25.03.2024
Website : https://psc.ap.gov.in/
0 Response to "TTD - Tirumala Tirupati Devasthanam "
Post a Comment