What makes a postal ballot invalid ?Lack of awareness ?Indifference?
పోస్టల్ బ్యాలెట్ invalid కావడం ఏమిటి ?అవగాహన లోపమా ?అనాసక్తత?
ఎన్నికల విధులపై శిక్షణ ఇచ్చే సమయం లోనే సిబ్బందికి పోస్టల్ బ్యాలెట్ వినియోగంపై అవగాహన కల్పిస్తారు. అయినా పొరపాట్లు, నిర్లిప్తత కారణంగా పలు ఓట్లు చెల్లకుండా పోతున్నాయి.
ఓటరు జాబితాలో ఉన్న ప్రకారం డిక్లరేషన్ పత్రంపై....ఉద్యోగి పూర్తి పేరు, చిరునామా,బ్యాలెట్ పత్రంలో ఉన్న సీరియల్ నంబరు రాసి సంతకం చేయాలి. వాటిలో ఎక్కడైనా తప్పు దొర్లితే ఆ ఓటును పరిగణించరు.
డిక్లరేషన్ పత్రంపై గెజిటెడ్అధికారి సంతకం చేయించాలి . పలువురు ఆ సంతకం లేకుండానే పోస్టల్ ballot లో ఓట్ వేస్తున్నారు .
ఉద్యోగుల డిక్లరేషన్ పత్రాన్నిగులాబీ రంగు కవర్లో బ్యాలెట్ పత్రాన్ని నీలం రంగు కవర్లో అందజేస్తారు ఓటు వేశాక.. ఆయా పత్రాల్ని అవే కవర్లలో ఉంచి సీల్ వేయాలి. కొందరు డిక్లరేషన్ పత్రాన్ని నీలం కవర్ , బ్యాలెట్ పత్రాన్ని గులాబీ కవర్లో ఉంచి సీల్ వేస్తున్నారు. మరికొందరు సీల్ కూడా వేయడం లేదు. అలాంటి వాటిని లెక్కించరు.
నచ్చిన అభ్యర్థికి సంబంధించి బ్యాలెట్ పత్రంలో నిర్దేశించిన గడి (బాక్స్) లోనే 'టిక్' మార్క్ గానీ, 'క్రాస్' మార్క్ గానీ వేయాలి.* గడి దాటి వెళ్లిన మార్కును ఓటుగా పరిగ ణించరు. మరికొందరు తమకు నచ్చిన అభ్యర్థి గడిలో 'టిక్' మార్కు వేసి, నచ్చని అభ్యర్థుల గడుల్లో 'క్రాస్' గుర్తులు వేస్తున్నారు. ఇలాంటి పోస్టల్ ఓట్లను తిరస్కరిస్తారు.
గతంలో ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బంది, మిలిటరీ ఉద్యోగులకే పోస్టల్ బ్యాలెట్ సదుపాయం ఉండేది. ఈసారి ఎయిర్పోర్టు, రైల్వే, ఆల్ ఇండియా రేడియో, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, వైద్యారోగ్య, విద్యుత్తు, రోడ్లు భవనాలు, పౌరసరఫరాలు, అగ్నిమాపక శాఖ. మీడియా, బీఎస్ఎన్ఎల్, ఎఫ్ సీఐ శాఖల ఉద్యోగులకు కూడా పోస్టల్ బ్యాలెట్ సదుపాయాన్ని ఈసీ కల్పించింది.
0 Response to "What makes a postal ballot invalid ?Lack of awareness ?Indifference?"
Post a Comment