AP EAPCET 2024 Exam Rescheduled
AP EAPCET 2024 Exam Rescheduled: ఏపీ ఎంసెట్ పరీక్ష తేదీల్లో మార్పులు. కొత్త తేదీల వివరాలు.
రాష్ట్రంలో ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మా కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఏపీఈఏపీసెట్(ఎంసెట్)–2024 పరీక్ష తేదీలను ఏపీ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ మార్చింది. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఇంజనీరింగ్ విభాగంలో మే18న జరగాల్సిన పరీక్షను ఇప్పుడు మే 23కు మారుస్తూ నిర్ణయించారు.
అగ్రికల్చర్, ఫార్మసీ విభాగాల్లో ముందుగా నిర్ణయించినట్లుగానే మే 16, 17 తేదీల్లో ప్రవేశ పరీక్షలను నిర్వహించనున్నారు. అభ్యర్థులు మరిన్ని వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్ cets.apsche.ap.gov.in లో పరక్ష షెడ్యూల్‌ను చెక్ చేయవచ్చు.
సంబంధిత తేదీల్లో రోజూ ఉదయం 9 నుంచి 12 గంటల వరకు తొలి సెషన్, మధ్యాహ్నం 2.30 నుంచి 5.30 గంటల వరకు రెండో సెషన్ పరీక్షలను నిర్వహిస్తారు. CBT విధానంలో పరీక్ష ఉంటుంది. మొత్తం 160 మార్కులకు, 3గంటల పాటు సమయం ఉంటుంది. ఇక హాల్‌టికెట్లను మే 7 నుంచి వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతారు.
0 Response to "AP EAPCET 2024 Exam Rescheduled"
Post a Comment