Birth Certificate New Regulations Key Changes Central Govt.
బర్త్ సర్టిఫికెట్ కొత్త నిబంధనలు కేంద్ర ప్రభుత్వం కీలక మార్పులు.
బర్త్ సర్టిఫికెట్ ఉనికి ఉన్న విలువ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే వివిధ రకాల స్కీమ్స్ కావాల్సిన ప్రధానమైన పత్రల్లో బర్త్ సర్టిఫికెట్ ఒకటి.
కేవలం పథకాలకే కాకుండా ఉద్యోగాలకు, ఇతర దేశాలకు వెళ్లే సమయంలో వీసాకు సంబంధించిన విషయాల్లో జనన ధృవీకరణ పత్రం అవసరం. ఇప్పటి వరకు కొన్ని రూల్స్ తో బర్త్ సర్టిఫికెట్ ను స్థానిక అధికారులు జారీ చేస్తుంటారు. తాజాగా జనన వివరాల నమోదుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వ కీలక మార్పులు చేయనుంది. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..
ప్రతి ఒక్కరికీ బర్త్ సర్టిఫికెట్ అనేది ముఖ్యమైనది. తాజాగా ఈ సర్టిఫికెట్ విషయంలో కేంద్రం కీలక మార్పులు చేయనున్నట్లు సమాచారం. కొత్తగా పుట్టిన శిశువుల తల్లిదండ్రులు ప్రస్తుతం ఉన్న 'కుటుంబ మతం' డిక్లరేషన్‌కు భిన్నంగా ప్రతిపాదిత జనన నివేదికలో తమ మతాన్ని వేరువేరుగా, వ్యక్తిగతంగా నమోదు చేయాల్సి ఉంటుందని 'ది హిందూ' పేర్కొంది. ఇక ఈ కథనం ప్రకారం.. బర్త్ సర్టిఫికెట్ సంబంధించిన కొత్త ఫారమ్ కేంద్ర హోం మత్రిత్వశాఖ మోడల్ నిబంధనలకు అనుగుణంగా ఉంది. అయితే దీన్ని అమల్లోకి తెచ్చే ముందు రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం తెలియజేయాల్సి ఉంటుందని ది హిందూ నివేదించింది. అలానే కేంద్రం తీసుకురానున్న ఈ రూల్ కి ఆయా ప్రభుత్వాలు ఆమోదించాల్సి ఉంటుంది. అదే విధంగా పిల్లలను దత్తత తీసుకునే పేరెంట్స్ కూడా ఇదే వర్తించనున్నట్లు తెలుస్తోంది.
అలానే పిల్లలను దత్తత తీసుకునే వారు కూడా తమ మతాన్ని వ్యక్తిగతంగా నమోదు చేయాల్సి ఉంటుందని పేర్కొంది. జనన, మరణాల రికార్టుల భద్రత కోసం నేషనల్ లెవెల్ లో డేటాబేస్ ను ఏర్పాటు చేస్తారు. ఆధార్ నంబర్ల, ఆస్తి రిజిస్ట్రేషన్లు, వివిధ రకాల కార్డులు, రేషన్ కార్డులు, ఎలక్టోరల్, డ్రైవింగ్ లైసెన్స్ లు, నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ వంటి అనేక ఇతర డేటాబేస్లను రిఫ్రెష్ చేయడానికి ఈ సమాచారం ఉపయోగపడుతుంది. దీని ప్రకారం.. పుట్టిన తేదీ, పుట్టిన ప్రదేశానికి సంబంధించి ఇలా వేర్వేరు డాక్యుమెంట్లు సమర్పించాల్సిన అవసరం ఉండదని తెలుస్తోంది. వివిధ వ్యక్తిగత పనుల నిమిత్తం ఈ బర్త్ సర్టిఫికెట్‌ను సింగిల్ డాక్యుమెంట్‌గా వినియోగించుకోవచ్చని తెలుస్తోంది. 2023 అక్టోబర్ నుండి విద్యా సంస్థలలో నమోదు, డ్రైవింగ్ లైసెన్స్, ఓటరు, ఆధార్ నంబర్ పొందడం, వివాహాల నమోదు, ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు వంటి వివిధ ముఖ్యమైనవాటికి జనన ధ్రువీకరణ పత్రాన్నే ఏకైక పత్రంగా గుర్తించనున్నారని తెలుస్తోంది.
0 Response to "Birth Certificate New Regulations Key Changes Central Govt."
Post a Comment