Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Explaining the convenience of withdrawing cash at home without going to the bank and ATM any more.

ఇకపై బ్యాంక్ మరియు ఎటిఎం కు వెళ్ళకుండానే ఇంటి వద్దే నగదు తీసుకునే వెసులుబాటు ఎలాగో వివరణ.

Explaining the convenience of withdrawing cash at home without going to the bank and ATM any more.

ప్రస్తుతం టెక్నాలజీ పెరిగిపోయింది. ఒకప్పుడు ఏదైనా ఆర్థిక లావాదేవీలకు సంబంధించి పని ఉంటే బ్యాంకుకు వెళ్లి చేసుకునే వాళ్లం. కానీ ఇప్పుడు టెక్నాలజీ అభివృద్ధి చెందిన కారణంగా ఇంట్లోనే ఉండి పనులు చేసుకునే వెసులుబాటు వచ్చింది.

అయితే మనకు అకౌంట్‌ నుంచి డబ్బు కావాలంటే బ్యాంకుకు వెళ్లిల్సి ఉంటుంది. అత్యవసరంగా డబ్బు అవసరమైతే ఏటీఎంకు వెళ్తుంటాము. కొందరికేమో ఏటీఎంకు వెళ్లే సమయం కూడా ఉండకపోవచ్చు. అలాంటి సమయంలో నగదు కోసం ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో మీరు నగదు కోసం, బ్యాంకుకు, ఏటీఎంకు వెళ్లకుండా మీ ఇంటి వద్ద తీసుకునే వెసులుబాటు ఉంది. ఇలాంటి వారికి ఇండియన్‌ పోస్టల్‌ కొత్త సర్వీసులను అందుబాటులోకి తీసుకువచ్చింది.

ఇండియా పోస్టు పేమెంట్స్ బ్యాంకు (IPPB) ఆన్‌లైన్ ఆధార్ ఏటీఎం అనే కొత్త విధానాన్ని ప్రవేశపెట్టింది. అంతేకాకుండా.. తాజాగా ఐపీపీబీ దీని గురించి Xలో దీనికి సంబంధించిన ఓ పోస్ట్ ద్వారా వెల్లడించింది. మీకు అత్యవసరం డబ్బు అవసరమైతే ఏటీఎంకు, బ్యాంకుకు వెళ్లకుండా ఈ సర్వీసు ద్వారా మీకు కావాల్సిన నగదును ఇంటికే తెచ్చుకోవచ్చు. ఇక నుంచి IPPBONLINE Aadhaar ATM (AePS) సర్వీస్‌తో నగదును సులభంగా పొందవచ్చు. ఇంటి వద్దే కావాల్సినంత నగదు విత్‌డ్రా చేసుకునే వెసులుబాటు ఉంది. ఈ సర్వీసును డోర్‌స్టెప్ సర్వీస్ అని కూడా అంటారు. మీరు ఇంటి వద్దే ఉండి నగదు కోసం అప్లై చేసుకున్నట్లయితే పోస్ట్‌మ్యాన్‌ మీ ఇంటికి వచ్చి నగదును అందజేస్తాడు. అలాగే ఇతర సమాచారం కోసం ఈ వెబ్‌సైట్‌ను సందర్శించండి అని పోస్ట్ చేశారు.

బయోమెట్రిక్‌ విధానం ద్వారా.

ఇక ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్ (AePS) ద్వారా ఎవరైనా డబ్బులు కావాలనుకునే వ్యక్తి వారి బయోమెట్రిక్ ఉపయోగించడం ద్వారా నగదును తీసుకోవచ్చు. ఇంకా ఆధార్ లింక్డ్ అకౌంట్ ద్వారా డబ్బు తీసుకోవచ్చు. ఖాతాదారుడు తన ఆధార్‌ కార్డును ఉపయోగించడం ద్వారా ఐడెంటిటీ ధ్రువీకరణతో.. క్యాష్ విత్‌డ్రాయల్, బ్యాలెన్స్ ఎంక్వైరీ, బ్యాలెన్స్ ఎంక్వైరీ, మినీ స్టేట్‌మెంట్, ఆధార్ టు ఆధార్ ఫండ్ ట్రాన్స్‌ఫర్ వంటి ఇతర బేసిక్ బ్యాంకింగ్ లావాదేవీలు కూడా చేసుకునే సదుపాయం ఉంది.

ఈ సేవలను ఎలా పొందాలంటే?

మీరు ఈ సర్వీసు ద్వారా ఇంటి వద్దే విత్‌డ్రా సదుపాయం పొందాలంటే ePS తో అనుసంధానమై ఉన్న బ్యాంక్ అకౌంట్ ఉండాలి. బ్యాంకు అకౌంట్‌కు ఆధార్‌ లింకై ఉండాలి. బయోమెట్రిక్ అథెంటికేషన్ ద్వారానే లావాదేవీ చేసుకునే సదుపాయం ఉంటుంది. బ్యాంకు అకౌంట్‌కు ఆధార్‌ అనుసంధానం లేకపోతే లావాదేవీలు జరగవు. ఐపీపీబీ ద్వారా డోర్‌స్టెప్ సర్వీస్ ద్వారా లావాదేవీ సక్సెస్ అయిందో లేదో SMS అలర్ట్ ద్వారా తెలుసుకోవచ్చు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Explaining the convenience of withdrawing cash at home without going to the bank and ATM any more."

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0