Key directives of Central Election Commission in disbursement of pensions in AP
AP లో పింఛన్ల పంపిణీలో కేంద్ర ఎన్నికల కమిషన్ కీలక ఆదేశాలు
ఇంటింటికి పింఛన్ల పంపిణీపై కేంద్ర ఎన్నికల కమిషన్ చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డికి కీలక ఆదేశాలు జారీ చేసింది. గతంలో ఇచ్చిన ఆదేశాలను అమలు చేయాలని ఆదేశించింది.
ప్రభుత్వ ఉద్యోగుల ద్వారా ఇంటింటికి పింఛన్లను పంపిణీ చేయాలని ఎన్నికల కమిషన్ చీఫ్ ఎన్నికల కమిషనర్ చీఫ్ సెక్రటరీని ఆదేశించారు. పింఛన్ల పంపిణీలో ఇప్పటికే అనేక ఫిర్యాదులు అందాయని ఆ ఆదేశాల్లో పేర్కొంది.
వీలుకాకుంటే మే 1వ తేదీన పింఛన్ పంపిణీ చేయాల్సి ఉంది. పెన్షన్ పంపిణీలో వృద్ధులకు ఇబ్బంది కలగకుండా ఇంటివద్దకే పింఛను పంపిణీ జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ప్రభుత్వ ఉద్యోగులను మాత్రమే ఇందుకు ఉపయోగించుకోవాలని పేర్కొంది. పింఛను పంపిణీకి ఇంకా నాలుగు రోజులు సమయం ఉండటంతో ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని సూచించింది. ఇంటింటికీ పింఛను పంపిణీ వీలు కాకపోతే డీబీటీ ద్వారా చెల్లించాలని ఆదేశాల్లో ఎన్నికల కమిషన్ పేర్కొంది.
0 Response to "Key directives of Central Election Commission in disbursement of pensions in AP"
Post a Comment