Praveen Prakash's orders should be stopped. BJP asked the EC
ప్రవీణ్ ప్రకాశ్ ఆదేశాలు నిలిపివేయాలి.ఈసీని కోరిన భాజపా
ఉపాధ్యాయులు విద్యార్థుల తల్లిదండ్రులతో ఈనెల 23న సమావేశాలు నిర్వహించాలని రాష్ట్ర పాఠశాల ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్ జారీచేసిన ఆదేశాలను నిలిపివేయాలని కోరుతూ.. ఎన్నికల ప్రధాన కమిషనర్ ముకేశ్కుమార్ మీనాకు మంగళవారం భాజపా రాష్ట్ర శాఖ వినతిపత్రం అందజేసింది.
ప్రవీణ్ ప్రకాశ్ అమానుష చర్యలతో ఉపాధ్యా యులు మనస్తాపానికి గురవుతున్నారని పేర్కొంది.
పబ్లిక్ సర్వెంట్గా కాకుండా.. అధికారంలో ఉన్న ప్రభుత్వానికి ఆయన ఏజెంట్గా వ్యవహరిస్తు న్నారని ఆరోపించింది.
మే13న ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో.. ఈ నెల 23న ఉపాధ్యాయుల సమావేశాలు నిర్వహించాలని ఆదేశాలు జారీచేయడం ఎలక్షన్ కోడ్ను ఉల్లంఘించడమేనని తెలిపింది. ఆ అమలును నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీచేయాలని సచివాలయంలో ఈసీకి అందజేసిన వినతి పత్రంలో ఆ పార్టీ లీగల్ సెల్ కన్వీనర్ కె. మల్లికార్జున మూర్తి కోరారు.
0 Response to "Praveen Prakash's orders should be stopped. BJP asked the EC"
Post a Comment