SA - 2 (CBA - 3) TOEFL Exam and SLAS Exam 2024 Administration Guidelines.
SA - 2 (CBA - 3) TOEFL Exam and SLAS Exam 2024 Administration Guidelines.
1. TOEFL.
- 1. TOEFL READINESS టెస్ట్ రాష్ట్రవ్యాప్తంగా ఎంపిక చేసి DCEB లకు అందచేసిన జాబితాలోని పాఠశాలల్లో 3, 4, 5 తరగతులకు ఏప్రిల్ 10వ తేదిన మరియు 6, 7, 8, 9 తరగతులకు ఏప్రిల్ 12 తేదిన నిర్వహించబడును.
- 2. జిల్లాల వారీగా పాఠశాలల వివరాలు, రోల్ వివరాలు ఇవ్వబడినవి.
- 3. DCEB లు పాఠశాలలో విద్యార్ధుల వాస్తవ సంఖ్య ఆధారంగా ప్రశ్న పత్రాలు ఆయా పాఠశాలకు అందించవలెను.
- 4. 3, 4, 5 తరగతులకు ఒక ప్రశ్న పత్రము, 6, 7, 8, 9 తరగతులకు మరొక ప్రశ్న పత్రము ఇవ్వబడును.
- 5. రీడింగ్, లిసనింగ్ విభాగాలలో ప్రశ్నలు ఉండును.
- 6. ప్రీ ప్రింటెడ్ OMR పై విద్యార్థులు తమ సమాధానాలను బబుల్ చేయవలెను (CBA లలో మాదిరిగానే )
- 7. సనింగ్ కి ఆడియో క్లిప్స్ IFP / SMART TV / టీచర్ ట్యాబ్స్ లలో రాష్ట్ర స్తాయి నుంచి IT సెల్ వారిచే పరీక్ష రోజు పంపబడును.
- 8. ఆయా పాఠశాలల్లో IFP / SMART TV / టీచర్ ట్యాబ్స్ కు ఏమైనా రిపేర్ ఉంటె ముందుగానే రిపేర్ చేయించుకొనవలెను.
- 9. DCEB లు DNO (IT) లు సమన్వయము తో వ్యవహరించవలెను.
- 10. పరీక్ష నిర్వహణకు TOEFL మాన్యువల్ లో సూచించిన రూమ్స్ అలోట్ మెంట్ సీటింగ్ అరేంజ్ మెంట్ విధానం పాటించాలి.
- 11. TOEFL మాన్యువల్ ప్రతి టీచర్ చదివేలా సాఫ్ట్ కాపీ షేర్ చేయవలెను. సంబందిత నిబంధనలు తప్పనిసరిగా పాటించవలెను.
- 12. ప్రశ్న పత్రాలు విద్యార్ధులకు తిరిగి ఇవ్వరాదు. USED/ UNUSED ప్రశ్న పత్రాలు తిరిగి పాఠశాలల నుంచి DCEB కి తెప్పించవలెను. తదుపరి సూచనల వరకు వాటిని సీల్ వేసి భద్రపరచవలెను.
- 13. OMR లు CBA తరహాలో ప్రత్యేకంగా ప్యాక్ చేసి DCEB కి తెప్పించి తదనంతరం స్కానర్ కి అందించవలెను.
- 14. OMR లో కుడి చేతి వైపు ఉన్న FORM CODE / SCHOOL USE ఓన్లీ అని ఉన్న బాక్స్ లో ఫిల్ చేయనవసరం లేదు.
- 15. ప్రీ ప్రింటెడ్ OMR రాని లేదా OMR పాడైన విద్యార్ధులకు బఫర్ OMR లలో NAME, UDISE CODE / STUDENT ID / CLASS తదితర వివరాలు ఫిల్ చేయవలెను.
- 16. టీచర్ ATTENDANCE APP లో OMR స్కానింగ్ ఆప్షన్ ENABLE చేయబడుతుంది. దాని ద్వారా ONLINE ATTENDANCE కోసం OMR స్కాన్ చేయవలెను.
2.CBA - 3
- 1. CBA 3 పరీక్షలు ఏప్రిల్ 6వ తేది నుంచి జరుగును.
- 2. గతం లో మాదిరిగానే OMR పద్ధతి లో పరీక్షలు నిర్వహించబడును.
- 3. కాకినాడ జిల్లాకు మాత్రం OCR పద్దతిలో CBA 3 మాత్రమె నిర్వహించబడును.
- 4. కాకినాడ జిల్లాకు మాత్రం OCR లో బబుల్ కి బదులుగా రైట్ టిక్ మార్క్ చేయవలెను. దీనికి సంబంధించిన వీడియో విడుదల చేయబడును.
- 5. కాకినాడ జిల్లాకు మాత్రం ప్రత్యేకంగా టీచర్లకు అన్ని CBA పరీక్షల అనంతరం OMR సమాధానాల స్కానింగ్ కొరకు ఒక APP లింక్ షేర్ చేయబడును.
- 6. OCR స్కానింగ్ APP తమ మొబైల్స్ లో ఇన్స్టాల్ చేసుకుని సమాధానాలు నమోదు చేసిన OMR ను టీచర్లు స్కాన్ చేయవలసి ఉంటుంది. అందుకు సంబంధించిన వీడియో విడుదల చేయబడుతుంది.
- 7. టీచర్లు స్కాన్ చేసిన అనతరం ఆయా OCR లను సీల్ వేసి పాఠశాలలో HM కంట్రోల్ లో భద్రపరచవలెను. తదుపరి తగిన సూచనలు జారీ చేయబడతాయి.
- 8. కాకినాడ మినహా మిగిలిన జిల్లాలలో గతం లో మాదిరి గానే OMR లు DCEB లు వెనక్కి తెప్పించుకోవాలి. DCEB APPROVED స్కానర్ తో స్కాన్ చేయించుకోవాలి.
3.SLAS-2024
- 1. SLAS - 2024 పరీక్ష 4వ తరగతి విద్యార్థులకు April 16th న జరుగుతుంది.
- 2. తెలుగు, ఇంగ్లీష్, గణితం సబ్జెక్టులపై విద్యార్థులకు SLAS నిర్వహిస్తారు. ప్రతి విద్యార్థి ఏదైనా రెండు సబ్జెక్టులను కలిపి రాస్తారు.
- 3. OMR పద్దతి లో SLAS నిర్వహించబడును.
- 4. ఇంగ్లీష్ మరియు తెలుగు సబ్జెక్టులలో, ఇన్విజిలేటర్ విద్యార్థులకు చదవి వినిపించాల్సిన కథ/గద్యం/పద్యం/గేయం/ పోస్టర్లు 2 ఉంటాయి.
- 5. రెండు సబ్జెక్టులు ఒకదాని తర్వాత ఒకటి నిర్వహించబడతాయి. మొదటి పేపర్ ఉదయం 9:00 నుండి 10:30 వరకు మరియు రెండవ పేపర్ ఉదయం 10:45 నుండి మధ్యాహ్నం 12:15 వరకు ఉంటుంది.
- 6. పరీక్ష తర్వాత, విద్యార్థులు విద్యార్థి అభిప్రాయ సేకరణ కు రూపొందించిన ప్రశ్నాపత్రాన్ని పూరించాలి. ఇన్విజిలేటర్ ప్రతి ప్రశ్నను చదవాలి మరియు విద్యార్థులు తమ జవాబుని OMRలో గుర్తించాలి. దీన్ని పూరించడానికి వారికి 15 నిమిషాలు ఇవ్వబడుతుంది.
- 7. పాఠశాల ప్రశ్నాపత్రం మరియు ఉపాధ్యాయుల ప్రశ్నాపత్రం కూడా పాఠశాల కి Google Form రూపంలో పంపబడతాయి. పరీక్ష ముగిసేలోపు పాఠశాలలో 4వ తరగతి బోధించే ఉపాధ్యాయులు, ఉపాధ్యాయుల ప్రశ్నాపత్రం మరియు HM ల ప్రశ్నాపత్రం పూరించాలి.
- 8. ప్రతి పాఠశాలలో, SLAS కు హాజరయ్యే విద్యార్థుల గరిష్ట సంఖ్య 40. అంతకంటే ఎక్కువ మంది విద్యార్థులు ఉన్నట్లయితే, మీరు 40కి చేరుకునే వరకు ప్రతి 3వ విద్యార్థిని ఎంపిక చేయాలి.
0 Response to " SA - 2 (CBA - 3) TOEFL Exam and SLAS Exam 2024 Administration Guidelines."
Post a Comment