SSC CHSL latest Notification 2024:
SSC CHSL latest Notification 2024: 3712 పోస్టుల భర్తీకి SSC CHSL నోటిఫికేషన్ విడుదల పూర్తి వివరాలు.
ఇంటర్ విద్యార్హతతో భారత ప్రభుత్వంలోని వివిధ విభాగాలు, కార్యాలయాల్లో ఉన్న 3,712 ఉద్యోగాల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్(SSC) నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఇందులో లోయర్ డివిజన్ క్లర్క్, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్ వంటి పోస్టులు ఉన్నాయి. ఈ ఉద్యోగాలకు ఇంటర్‌మీడియట్(12వ తరగతి) అర్హత. విద్యార్హత కలిగి ఆసక్తి ఉన్న అభ్యర్థులు మే 7వ తేదీలోపు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
మొత్తం ఖాళీలు: 3,712.
విభాగాలు:
లోయర్ డివిజన్ క్లర్క్(ఎల్‌డీసీ)
జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్
డేటా ఎంట్రీ ఆపరేటర్(డీఈవో)
డేటా ఎంట్రీ ఆపరేటర్(గ్రేడ్-ఎ)
విద్యార్హతలు: అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు/యూనివర్శిటీ నుండి 12వ తరగతి/తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి. కన్జ్యూమర్ అఫైర్స్, ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ మినిస్ట్రీ, కల్చర్ మినిస్ట్రీలో డేటా ఎంట్రీ ఉద్యోగాలకు ఇంటర్‌లో సైన్స్ గ్రూప్‌తో మ్యాథ్స్ ఒక సబ్జెక్టుగా చదివి ఉండాలి.
వయోపరిమితి
SSC Job Age Limit :
అభ్యర్థుల వయస్సు 2024 ఆగస్టు 1 నాటికి 18-27 ఏళ్ల మధ్యలో ఉండాలి.
ప్రభుత్వ నిబంధనల ప్రకారం, ఓబీసీలకు 3 ఏళ్లు; దివ్యాంగులకు 10-15 ఏళ్లు; ఎస్టీ, ఎస్సీలకు 5 ఏళ్ల పాటు వయోపరిమితి సడలింపులు వర్తిస్తాయి.
దరఖాస్తు చేయు విధానం: ఆన్‌లైన్.
ముఖ్యమెన తేదీలు:
దరఖాస్తులు ప్రారంభ తేదీ: 08-04-2024.
దరఖాస్తులకు చివరి తేదీ: 07-05-2024.
ఫీజు చెల్లింపు చివరి తేదీ: 08-05-2024.
SSC CHSL అప్లికేషన్ ఫీజు వివరాలు
Gen ₹00/-
OBC/ EWS ₹00/-
SC/ ST/ PH ₹00/-
చెల్లింపు మోడ్ ఆన్‌లైన్: నెట్ బ్యాంకింగ్, డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, మొదలైనవి.
SSC CHSL వయోపరిమితి 2024
కనీస వయస్సు: 18 సంవత్సరాలు.
గరిష్ట వయస్సు: 27 సంవత్సరాలు.
అథారిటీ నిబంధనల ప్రకారం వయో సడలింపు అదనపు.
SSC CHSL ఉద్యోగాలు 2024 కోసం ఎలా దరఖాస్తు చేయాలి
- స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) ssc.gov.in SSC CHSL రిక్రూట్‌మెంట్ రిజిస్ట్రేషన్ ఫారమ్ 2024ను ప్రారంభించబోతోంది. SSC CHSL ఆన్‌లైన్ దరఖాస్తు ఫారమ్ 2024 కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయడానికి దరఖాస్తుదారులు తప్పనిసరిగా ఈ దశలను అనుసరించాలి.
- SSC CHSL నోటిఫికేషన్ 2024 PDF నుండి అర్హత ప్రమాణాలను తనిఖీ చేయండి.
- క్రింద ఇవ్వబడిన దరఖాస్తు ఆన్‌లైన్ లింక్‌పై క్లిక్ చేయండి లేదా ssc.gov.in SSC CHSL ఆన్‌లైన్ ఫారమ్ 2024 యొక్క అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి.
- SSC CHSL రిజిస్ట్రేషన్ ఫారమ్ 2024ని పూరించండి.
- అవసరమైన పత్రాలను అప్‌లోడ్ చేయండి.
- దరఖాస్తు రుసుము చెల్లించండి.
- చివరగా దరఖాస్తు ఫారమ్‌ను ప్రింట్ చేయండి.
0 Response to "SSC CHSL latest Notification 2024:"
Post a Comment