Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Still hungry after a meal? Do not take out the light.. take this test immediately

 భోజనం తర్వాత కూడా ఆకలిగానే ఉందా? లైట్ తీస్కోవద్దు. వెంటనే ఈ టెస్ట్ చేయించుకోగలరు

Still hungry after a meal? Do not take out the light.. take this test immediately


సాధారణంగా కొంతమందికి కడుపునిండా తిన్నా కూడా మళ్లీ ఆకలి వేస్తుంటుంది. ఇలా తిన్నాక కూడా ఆకలిగా అనిపిస్తుంటే అప్రమత్తం కావాలి.

ఎందుకంటే నిరంతర ఆకలి అనేది హైపోథైరాయిడిజం, పోషకాహార లోపం, ఒత్తిడి, ఆందోళన వంటి అనేక ఆరోగ్య సమస్యలకు సంకేతం కావచ్చు. ఇది డయాబెటిక్ హైపర్‌ఫాగియా (Diabetic hyperphagia) అనే పరిస్థితిని కూడా సూచిస్తుంది. ఈ మెడికల్ కండిషన్ డయాబెటిస్ ఉన్నవారిలో ఎక్కువగా కనిపిస్తుంది. హైపర్‌ఫాగియా ఉన్నవారు ఎంత తిన్నా కూడా ఎప్పుడూ ఆకలి వేస్తూనే ఉంటుంది.

నిపుణుల అభిప్రాయం ప్రకారం, రక్తంలో చక్కెర స్థాయిలు ఎక్కువగా ఉన్నప్పుడు లేదా తక్కువగా ఉన్నప్పుడు ఈ పరిస్థితి సంభవిస్తుంది. డయాబెటిక్ హైపర్‌ఫాగియా అనేది డయాబెటిక్ కీటోయాసిడోసిస్ (Diabetic ketoacidosis)కు ఒక వార్నింగ్ సైన్. డయాబెటిక్ కీటోయాసిడోసిస్ అనేది శరీరంలో అధిక మొత్తంలో రక్త ఆమ్లాలు ఉత్పత్తి అయ్యే ఒక ప్రాణాంతకమైన పరిస్థితి.

అతి ఆకలి

శరీరం శక్తి కోసం చక్కెరను (గ్లూకోజ్) ఉపయోగిస్తుంది. ఇన్సులిన్ చక్కెరను కణాల లోపలికి పంపిస్తుంది. ఇన్సులిన్ సమస్యలు ఉన్నప్పుడు చక్కెర కణాల బయటే ఉండిపోతుంది. శరీరం దానిని శక్తి కోసం వినియోగించలేదు. దీంతో ఎనర్జీ కోసం శరీరం ఆహారం తినాలని, ఆకలిని కలిగిస్తుంది. అందుకే భోజనం చేసిన తర్వాత కూడా చాలా ఆకలిగా (హైపర్‌ఫాగియా) అనిపిస్తుంది. మధుమేహం మెదడులోని హైపోథాలమస్‌ను ప్రభావితం చేస్తుంది. హైపోథాలమస్ ఆకలితో సహా శరీర విధులను ప్రభావితం చేస్తుంది, హైపోథాలమస్‌లో లోపం కారణంగా ఆకలికి సంబంధించిన మార్పులు సంభవించవచ్చు.

టైప్ 1, టైప్ 2, జెస్టేషనల్ డయాబెటిస్‌తో సహా మధుమేహం అన్ని రకాలలో హైపర్‌ఫాగియా పరిస్థితి కామన్‌గా కనిపిస్తుందని వైద్యులు చెబుతున్నారు. మధుమేహం ఉన్నవారికి సాధారణంగా మూడు నియంత్రణ లేని సమస్యలు వస్తాయి. వాటిలో పాలిఫాగియా (అధిక ఆకలి), పాలియూరియా (అధిక మూత్రవిసర్జన), పాలిడిప్సియా (అధిక దాహం) ఉన్నాయి. హైపర్‌ఫాగియా అనేది శరీరం శక్తి కోసం చక్కెరను సరిగ్గా వినియోగించుకోలేకపోవడం లేదా గ్లూకోజ్ లోపం వల్ల సంభవిస్తుంది.

మధుమేహం కాకుండా, కొన్ని మానసిక ఆరోగ్య పరిస్థితులు కూడా హైపర్‌ఫాగియాకు దారితీస్తాయని నిపుణులు చెబుతున్నారు. వాటిలో కొన్ని చూద్దాం. ఒత్తిడికి గురైనప్పుడు, శరీరం కార్టిసాల్ అనే హార్మోన్‌ను విడుదల చేస్తుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిని పెంచి, ఆకలిని కలిగిస్తుంది. ఎటైపికల్ డిప్రెషన్ కూడా ఆకలి, బరువు పెరగడానికి కారణమవుతుంది. ఆందోళన కారణంగా కార్టిసాల్ స్థాయిలు పెరుగుతాయి, ఫలితంగా తరచుగా ఆకలి వేస్తుంది.

డయాబెటిక్ హైపర్‌ఫాగియా లక్షణాలు

ఈ సమస్య ఉన్నవారికి, క్రమం తప్పకుండా తింటున్నప్పటికీ ఆకలిగా అనిపిస్తుంది. ఎక్కువగా తినడం వల్ల బరువు పెరగవచ్చు. అతి దాహం, తరచుగా మూత్రవిసర్జన, విరేచనాలు, వికారం, ఛాతీలో మంట వంటి సమస్యలు, అలసట, తలతిరగడం, తరచుగా తలనొప్పి, ఏకాగ్రత లేకపోవడం, వణుకు, చమట పట్టడం.. వంటివన్నీ ఈ సమ్యను సూచించే లక్షణాలు.

చికిత్స

హైపర్‌ఫాగియాకు చికిత్స మూల కారణాన్ని బట్టి ఉంటుంది. చికిత్స పొందాక ఈ పరిస్థితి సాధారణంగా తగ్గిపోతుందని వైద్యులు చెబుతున్నారు. టైప్ 1 మధుమేహం చికిత్సలో జీవితకాల ఇన్సులిన్ ఇంజెక్షన్లు, రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడం ఉంటాయి. హైపోగ్లైసీమియాను గ్లూకోజ్ తినడం లేదా తాగడం ద్వారా నయం చేసుకోవచ్చు. గ్లూకాగాన్ ఇంజెక్షన్ ద్వారా కూడా చికిత్స పొందవచ్చు. రోగి స్పందనను బట్టి డాక్టర్ మందును మార్చవచ్చు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Still hungry after a meal? Do not take out the light.. take this test immediately"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0