Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Students Summer Holidays Activities - Summer vacation- summer activities

 Students Summer Holidays Activities - Summer vacation- summer activities

We Love Reading Summer Activities

ఏపి పాఠశాల విద్యార్థులకు  వేసవి సెలవుల కార్యకలాపాలు అమలు చేయడంపై ఉపాధ్యాయులకు మార్గదర్శకాలుతో ఉత్తర్వులు విడుదల.

Download Proceedings Copy & Activities Here

Day - 8 Activities









Class :3,4,5

8వ రోజు 

Q) ఒక రైతు మరియు బంగారు బాతు  కథలోని కీలక పదాలను గుర్తించి ' సున్నా ' చుట్టండి. చదువుతూ 5 సార్లు  మీ నోటు పుస్తకం లో రాయండి.

నేటి జాతీయం

నరం లేని నాలుక

నరం లేని నాలుక ఎటైనా తిరుగుతుందన్నది జాతీయం. అంటే మాట నిలుపుకోలేకపోవటం, ఇప్పుడు చెప్పింది మరికాసేపటికి కాదనటం అనేలాంటి అర్థాలలో ఈ జాతీయం ప్రయోగంలో ఉంది. నాలుక అనేది మాటకు ప్రతీకగా, నరం అనే దాన్ని పటుత్వానికి గుర్తుగానూ చెబుతారు


🤠 నేటి సామెత 

అదిగో తెల్లకాకి అంటే ఇదిగో పిల్ల కాకి అన్నట్లు

అసలు అక్కడ జరిగేది ఏమి లేకుండానే, ఏదో ఉందని చెప్పే వారి పక్కన దానికి మరో నాలుగు కలిపి చెప్పే వాళ్ళు ఉంటారు. అదిగో తెల్లకాకి అంటే ఇదిగో దానికి పుట్టిన పిల్ల కాకి అని, ముందు చెప్పినదే పెద్ద తప్పు దాన్ని సమర్థిస్తూ చెప్పేది ఇంకాపెద్ద తప్పు చెప్పే వారు కూడా ఉంటారు.

👭నేటి బాలగేయం

వారాలు

వారం వారం

సోమవారం

చకచక బడికి

వెళ్ళే హారం

వారం వారం

మంగళవారం

చెడు పనులకు

మేము దూరం

వారం వారం

బుధవారం

చెడు స్నేహాల

పంచన చేరం

వారం వారం

గురువారం

పెద్దల మాటలు

మేము మీరం

వారం వారం

శుక్రవారం

చందమామంటే

మాకు మమకారం

వారం వారం

శనివారం

అవ్వ, తాతల

కథలే మాకు వరం

వారం వారం

సెలవాదివారం

ఆటలు చేర్చును

ఆనంద తీరం

నేటి ఆణిముత్యం

అందమైన సూక్తి అరుణోదయంబట్లు

బాల మానసముల మేలుకొల్పు

సూక్తి లేని మాట శ్రుతిలేని పాటరా

లలిత సుగుణజాల! తెలుగుబాల!

భావము:

పాటకు శ్రుతి చాలా ప్రధానం అలానే మాటకు సూక్తి ప్రాణంతో సమానం. సూర్యుడు ఉదయించగానే చీకటి చెదరిపోతుంది. అలానే మంచి సూక్తి విద్యార్థులకు జ్ఞానం ఇచ్చి, వారిని మంచికి పురి కొల్పుతుంది. విద్యలో అలాంటి సూక్తులుండాలి. 

విద్యార్థులు సూక్తులు నేర్చి, వాటిని పాటించాలి. మీరు నేర్చిన సూక్తులు చెప్పి వివరించండి.

పొడుపు కథ

అంతులేని చెట్టుకు

అరవై నాల్గే కొమ్మలు

కొమ్మకు కోటి పువ్వులు

పువ్వుల్లో రెండే కాయలు

జవాబు: ఆకాశం, చుక్కలు, సూర్యుడు, చంద్రుడు

నేటి మంచి మాట

కాలం ఎంత విలువైనది అంటే

 ఉన్నప్పుడు కనుకోలేనంత

లేనప్పుడు కొనుకోలేనంత


ఒక వేణువు కథ ...8

*******************

అనగనగా అవి సీతారాముల వనవాసపు రోజులు. సీతమ్మవారొక రోజు చెరువులో జలకాలు ఆడుతున్నదట. తానం కానిచ్చి ఒడ్డుకి వచ్చి కుటీరానికి వెళ్ళుతుండగా  దారిలో  ఓ ముల్లు ఆవిడ కాల్లో గుచ్చుకుందట. బహు సుకుమారి. కళ్లంట జివ్వున నీళ్ళు తిరిగాయి.

అల్లంత దూరాన ఉన్న రాముల వారిని " సామీ..!" అని పిలిచి, పక్కనే ఉన్న రాయి మీద  కూకోయిందట.

పరుగున వచ్చిన రాముల వారు ఎర్రగా కందిపోయిన అమ్మవారి మొహాన్ని చూసి కంగారు పడ్డారట.ఇంకొక్కింత ఎర్రగా కందిన అరికాలిని చూసి బెంబేలు ఎత్తారంట. ఎలాగో తంటాలు పడి నెమ్మదిగా

ఆ ముల్లును బయటకు లాగి, సీత మొహం వైపు చూసారట.ముల్లు దిగిన కంటే పైకి లాగిన బాధ ఎక్కువగా ఉందేమో! జలజలా నీటి బిందువులు ఎర్రటి చెక్కిళ్ళ మీద జారిపోతుండగా "వచ్చేసిందా?" అన్నట్టు చూసిందట ఆయన వైపు.

ఏడు మల్లెలెత్తు రాకుమారిని అడవులంట తిప్పుతున్నానే అనే బాధలో అసలే మునిగి ఉన్నారేమో రాముల వారు, చేతిలో ఉన్న ముల్లు వైపు బాధగా చూసారట.

అది చూపా? అనల బాణమా? ముల్లు భగ్గున మండి బూడిదైపోయిందట.

ఇదంతా చూసిన సీతమ్మ వారు " అయ్యో, ఏలే దొరలే కినుక చూపితే ఇంక దిక్కెవరు జీవులకు ? మండుట అగ్గి లక్షణం. అలాగే గుచ్చుట ముల్లు లక్షణం. ఇంత పెద్ద శిక్షా నాథా ?" అని వాపోయిందట.

మహనీయుల కోపం తాటాకు మంట కదూ! చప్పున చల్లారిన రామయ్య నొచ్చుకున్నాడు.

 బూడిదయిన ముల్లుని దయగా చూసాడు. మండించి మసిచేసిన చూపే కరుణించి ఏం వరమిచ్చిందయ్యా ముల్లుకి అంటే..

వెదురై పుట్టి కన్నయ్య చేతిలో వేణువు అయిందట. సంతోషంతో మధురంగా పాడిందటా

DAY-8

📒WE LOVE READING

💁‍♀️The Brahmin’s dream..

A poor Brahmin lived in a village all alone. He had no friends or relatives. He was known for being stingy and he used to beg for a living. The food he got as alms were kept in an earthen pot which was hung beside his bed. This allowed him to easily access the food when he got hungry.

On one day, he got so much rice gruel that even after completing his meal, there was so much leftover in his pot. That night, he dreamt that his pot was overflowing with rice gruel and that if a famine came, he could sell the food and earn silver from it. This silver could then be used to buy a pair of goats who would soon have kids and create a herd. This herd in turn could be traded for buffaloes who would give milk from which he could make dairy products. These products could be sold in the market for more money.

This money would help him get married to a rich woman and together they would have a son who he could scold and love in equal measure. He dreamt that when his son wouldn’t listen, he would run after him with a stick.

Wrapped up in his dream the Brahmin picked up the stick near his bed and started hitting  the air with the stick. While flailing about, he hit the earthen pot with the stick, the pot broke and all the contents spilled over him. The Brahmin woke up with a start only to realize that everything was a dream.

Moral of the story

One should not build castles in the air.

✅తెలుసు కుందాం

🟥హెలికాప్టర్ , విమాలన్లలో వాడే బ్లాకు బాక్స్ అంతే ఏమిటి , అది ఎలా ఉపయోగపడుతుంది ?

🟩నీటిలో తడిచినా ఏమీ కాదు , అత్యధిక ఉష్ణోగ్రతలను తట్టుకుంటుంది .. కాబట్టి మంటలలో కాలిన పాడు అవదు . గట్టి పదార్ధం తో తయారు చేస్తారు కనుక ఎంత ఎత్తి నించి కింద పడినా విరగదు . అదే బ్లాకు బాక్స్ . .. విమానాలు , హెలికాప్టర్ లలో తప్పనిసరిగా వీటిని అమర్చుతారు . చిత్రమేమంటే బ్లాకు బాక్స్ నల్లగా ఉండదు . నారింజ రంగులో ఉంటుంది . విమానము పేలిపోయినా , ముక్కలైపోయినా ... ఇది మాత్రము సురక్షితం గానే ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటారు . విమానము నడిపే సమయము లో పైలట్ల సంభాషణలను ఇతర శబ్దాలను కొన్ని గంటలపాటు రికార్డ్ చేసే ఏర్పాటు దీనిలో ఉంటుంది . అంతే పమాదానికి ముందు ఎవరేం మాట్లాడారో శబ్దాలు ఏమిటో లాంటి సమాచారాన్ని బ్లాకు బాక్స్ ద్వారా తెలుసుకోవచ్చును . అందుకే దీని పాత్ర చాలా కీలకమైనది .

బ్లాకు బాక్స్ ఆంటీ ఒక వ్యవస్థ లాంటిదన్నమాట , ఫ్లైట్ డాటా రికార్డర్ (FDR) కాకపిట్ వాయిస్ రికార్డర్ (CVR) అనే రెండు శబ్దగ్రాహక యంత్రాలు ఇందులో ఇమిడి ఉంటాయి . ఇందులో fdr యంత్రం లో విమానము ఎంత ఎత్తులో వెళ్ళింది , ఏ దిశలో వెళ్ళింది , ఎంత వేగం తో గాలి వీచింది లాంటి సాంకేతిక సమాచారము నమోదవుతూ ఉంటుంది . cvr యంత్రము లో అన్ని రకాల శబ్దాలు కొన్ని గంటల పాటు నమోదై ఉంటాయి . ఈ సమాచారము మొత్తాన్ని పరిశోధించి , విశ్లేషించడం ద్వారా నిపుణులు వాయు వాహనాల ప్రమాదాలము కారణాలేంటో తెలుసుకో వచ్చును .

అందుకే ఎక్కడ విమాన ప్రమాదం జరిగినా .. వెంటనే బ్లాకు బాక్స్ కోసమే వెతుకుతారు . నీటిలో మునిగిపోయినా సరే సునిశితమైన ఆల్త్రసోనిక్ శబ్దతరంగాలను వెలువరించే ఏర్పాటు కుడా వీటిలో ఉంటుంది . దీని ధర ఏడున్నర లక్షల రూపాయల వరకు ఉంటుంది . ఈ బ్లాకు బాక్స్ యంత్రాలతో అనుసంధానం చేసిన సెన్సార్లు విమానమంతా అమర్చి ఉంటాయి .

విమానాన్ని కనిపెట్టిన రైట్ బ్రదర్స్ కుడా కొంత సమాచారాన్ని నమోదు చేసే యంత్రాన్ని ఏర్పాటు చేసారని చెబుతారు ... అయితే రెండో ప్రపంచ యుద్ధం తర్వాత వీటి వాడకం విస్తరించబడింది , ఇప్పుడైతే విమానము లో బ్లాకు బాక్స్ తప్పనిసరి . మొదట్లో సమాచారము నమోదుకు మాగ్నటిక్ టేప్ లను ఉపయోగించినా ఇప్పుడు దృఢమైన మెమరీ చిప్ లను వాడుచున్నారు . మొదటిగా బ్లాకు బాక్స్ ఫ్లైట్ రికార్డర్ ఉండాలనే అల్లోచన ఆస్ట్రేలియా శాస్త్రవేత్త " డేవిడ్ వారెన్"కి వచ్చించి . అలా 1953 కల్లా ఆస్ట్రేలియాలో దీన్ని తాయారు చేశారు .

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Students Summer Holidays Activities - Summer vacation- summer activities"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0