WhatsApp Chat Lock Feature
WhatsApp Chat Lock Feature : వాట్సాప్ సరికొత్త అప్‌డేట్ తీసుకొస్తోంది. అతి త్వరలో వాట్సాప్ లింక్ చేసిన డివైజ్‌ల్లోనూ చాట్ లాక్ ఫీచర్ ప్రవేశపెట్టనుంది.
WhatsApp Chat Lock Feature : ప్రముఖ మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్ వాట్సాప్ కొత్త ఫీచర్‌లను ప్రవేశపెడుతూనే ఉంది. అందులో చాలా వరకు ప్రయోజనకరమైనవే ఎక్కువగా ఉంటాయి. కొత్త ఫీచర్‌లు ముందుగా యాప్ బీటా వెర్షన్‌లో అందుబాటులోకి వస్తాయి. ఆయా ఫీచర్ల ఫంక్షనాలిటీ టెస్టింగ్ చేసిన తర్వాతే పబ్లిక్ వెర్షన్‌కి రిలీజ్ చేస్తుంది. వాట్సాప్ అనేక ఫీచర్లపై టెస్టింగ్ చేస్తున్నప్పటికీ.. ఇప్పుడు లింక్డ్ డివైజ్‌లకు కూడా చాట్ లాక్ ఫీచర్‌ను పొడిగించింది. స్టేటస్ అప్‌డేట్‌లలో ఒకరు తమ కాంటాక్ట్‌లను కూడా ట్యాగ్ చేయొచ్చు.
మల్టీ డివైజ్‌ల్లో అకౌంట్లను లింక్ చేసే యూజర్లకు వాట్సాప్ మరింత భద్రతను అందిస్తుంది. ఒకవేళ మీకు తెలియకుంటే.. స్టేటస్ అప్‌డేట్‌లు, చాట్ లాక్ వంటి కొన్ని ఫీచర్‌లు ప్రస్తుతం సెకండరీ డివైజ్‌లలో అందుబాటులో లేవు. తద్వారా ప్రైవేట్ చాట్‌లకు రిస్క్ ఉండవచ్చు. దీన్ని పరిష్కరించడానికి వాట్సాప్ లింక్ చేసిన డివైజ్‌లకు చాట్ లాక్ సపోర్టును విస్తరిస్తోంది. వినియోగదారులు ఇప్పుడు వారి ప్రైమరీ డివైజ్‌లో సీక్రెట్ కోడ్‌ని సెట్ చేయవచ్చు. లింక్ చేసిన అన్ని డివైజ్‌లలో చాట్‌లను సురక్షితం చేయవచ్చు. అదనంగా, వాట్సాప్ స్టేటస్ అప్‌డేట్స్ కోసం ప్రైవేట్ రెస్పాన్స్‌ను ప్రవేశపెట్టనుంది.
ఈ ఫీచర్ నిర్దిష్ట కాంటాక్టులను ట్యాగింగ్ చేసేందుకు అనుమతిస్తుంది. ట్యాగ్ చేసిన రీసివర్‌కు మాత్రమే తెలియజేస్తుంది. ప్రైవేట్ ప్రస్తావనలు ప్రస్తుతం బీటా యూజర్లకు అందుబాటులో ఉన్నాయి. త్వరలో యూజర్లందరికి అందుబాటులోకి రానున్నాయి. అయితే, ఈ ఫీచర్లు ప్రస్తుతం ఐఓఎస్, ఆండ్రాయిడ్ రెండింటి బీటా వెర్షన్‌లో మాత్రమే అందుబాటులో ఉన్నాయని గుర్తుంచుకోండి. వాట్సాప్ త్వరలో ఈ ఫీచర్లను రిలీజ్ చేసే అవకాశం ఉంది.
అంతేకాకుండా, యాప్‌లోని యూజర్ ఇంటరాక్షన్‌లను మార్చడానికి వాట్సాప్ త్వరలో మెటా ఏఐ చాట్‌బాట్‌ను కూడా ప్రవేశపెట్టాలని భావిస్తోంది. వాట్సాప్‌లో నేరుగా ఇంటిగ్రేట్ చేసిన ఈ ఏఐ మోడల్ ప్లాట్‌ఫారమ్ నుంచి నిష్క్రమించకుండానే డేటాను యాక్సెస్ చేసేందుకు యూజర్లను అనుమతిస్తుంది.
మెటా ఏఐతో యూజర్లు వాట్సాప్‌లో రియల్ టైమ్ రెస్పాన్స్ పొందవచ్చు. నివేదికల ప్రకారం.. ఈ కొత్త ఫీచర్ ఇంకా అభివృద్ధిలో ఉంది. అంతర్జాతీయ లావాదేవీలను క్రమబద్ధీకరించాలని కోరుకునే భారతీయ యూజర్ల కోసం వాట్సాప్ త్వరలో సరికొత్త ఫీచర్ తీసుకొస్తోంది. యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI)ని ఉపయోగించి వాట్సాప్ త్వరలో భారతీయ బ్యాంకు అకౌంట్ల నుంచి నేరుగా అంతర్జాతీయ చెల్లింపులను చేసుకోవచ్చు.
0 Response to "WhatsApp Chat Lock Feature"
Post a Comment