Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Do you keep your ACs on all night but Tasmat can detect these things.

 రాత్రి మొత్తం మీ AC లను ఆన్లోనే ఉంచుతున్నారా అయితే తస్మాత్ జాగ్రత్త ఈ విషయాలు తెలుసుకోగలరు.

కాబట్టి చాలామంది ఉదయం నుంచి రాత్రి దాకా ఏసీ లోనే ఉంటున్నారు. అది చాలదు అన్నట్టు.. రాత్రి అంతా కూడా ఏసీ ఆన్ లోనే ఉంచి నిద్రపోతున్నారు. 

మనం రోజుకి కనీసం ఆరు నుంచి ఎనిమిది గంటలు నిద్రపోతాం. కానీ అంతసేపు ఏసీలో ఉంటే చాలా ప్రమాదాలు ఎదుర్కోవాల్సి వస్తుందట. ఎక్కువసేపు ఏసీలో ఉండటం వల్ల.. లేదా నిద్రపోవడం వల్ల మన శరీరానికి మన ఆరోగ్యానికి కూడా చాలా హాని జరుగుతుంది. 

రాత్రి అంతా ఏసీలోనే పడుకుంటే ఉదయం పూట శరీరం చాలా వేడిగా అయిపోతుంది. ఏసీ వల్ల శరీరం బిగుతుగా అయిపోయినట్లు అనిపిస్తుంది. ప్రతిరోజు ఏసీలో ఉండటం వల్ల మన ఎముకలపై కూడా తీవ్ర ప్రభావం ఉంటుంది. మన శరీరం ఇక అధిక ఉష్ణోగ్రతను తట్టుకోలేని పరిస్థితికి వచ్చేస్తుంది. ఏసీలో నిదురించే వారి లో శ్వాసకి సంబంధించిన ఇబ్బందులు కూడా వస్తూఉంటాయి. ముఖ్యంగా దగ్గు, ఛాతిలో నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా ఉండటం వంటివి ఎదుర్కోవాల్సి వస్తుంది. 

ఏసీలో ఉండే అధిక చల్లదనం.. మన శరీరంలో ఉన్న ఉండే తేమను కూడా తగ్గించేస్తుంది. దానివల్ల చర్మం చాలా త్వరగా పొడిబారిపోతుంది. అసలే వేసవికాలం కారణంగా శరీరానికి కావాల్సిన నీటి శాతం అందదు. అది చాలదు అన్నట్టు.. ఏసీలో ఉంటే చర్మం ఇంకా పొడిబారిపోయి ముడతలు కూడా వచ్చేస్తాయి. 

ఏసీలోనే ఉండటం కారణంగా ఎలర్జీలు కూడా వచ్చి దురదలు, మచ్చలు వంటి సమస్యలు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. రోగ నిరోధక శక్తి కూడా బాగా తగ్గిపోతుంది. ఏసీ నుంచి వచ్చే దుమ్ము ధూళి కూడా ముక్కులోకి వెళ్లి అలర్జీలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి రాత్రి పూట మూడు లేదా నాలుగు గంటలకు మించి ఏసీ ఆన్ చేసి ఉంచకూడదు అని నిపుణులు చెబుతున్నారు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Do you keep your ACs on all night but Tasmat can detect these things."

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0