Good news for PF members.. Money Withdraw Rules Changed EPF
పీఎఫ్ సభ్యులకు శుభవార్త.. డబ్బు విత్ డ్రా రూల్స్ మార్చిన ఈపీఎఫ్
ప్రభుత్వ, ప్రైవేటు యాజమాన్యంలో పనిచేస్తున్న ఉద్యోగులు తప్పనిసరిగా పీఎఫ్ చెల్లిస్తుంటారు. అయితే కొన్ని అత్యవసర, అనుకోని సమయాల్లో ఈ మెుత్తాన్ని తిరిగి విత్ డ్రా చేసుకునేందుకు వెసులుబాటు కల్పించబడుతుంది.
దీనికి సంబంధించిన కీలక నిబంధనల్లో మార్పులు చేయబడ్డాయి.
వాస్తవానికి పీఎఫ్ అనేది పదవీ విరమణ సమయంలో తీసుకునే మెుత్తం. కానీ ప్రస్తుత కాలంలో చాలా మంది తమ అవసరాలకు అనుగుణంగా మధ్యలోనే పీఎఫ్ విత్‌డ్రా చేసేస్తున్నారు. ఈ క్రమంలో మానవ ప్రమేయం వల్ల అనేక సార్లు చెల్లింపులు ఆలస్యం అవుతున్నాయి. దీనిని పరిష్కరించేందుకు ఈపీఎఫ్ఓ తాజాగా ఆటో సెటిల్‌మెంట్ పద్ధతిని ప్రవేశపెడుతోంది. ప్రజల పీఎఫ్ సొమ్ము విత్‌డ్రావల్ అభ్యర్థనలను సులభతరం చేసే ప్రక్రియను కొన్ని నెలల క్రితం ప్రారంభించగా ప్రస్తుతం అది అమలులోకి వచ్చింది.
ఎడ్యుకేషన్, వివాహం క్లెయిమ్‌ల కోసం రూల్ 68K కింద ఆటో సెటిల్‌మెంట్ సౌకర్యం అందించబడింది. ఇదే క్రమంలో రూల్ 68B కింద గృహ కొనుగోలుకు క్లెయిమ్‌లను ఆటోమేట్ చేసినట్లు ఈపీఎఫ్ఓ మే 13న విడుదల చేసిన సర్క్యులర్ ద్వారా తన సభ్యులకు వెల్లడించింది. అలాగే వైద్య చికిత్స కోసం PF మొత్తాన్ని ముందస్తుగా పొందేందుకు రూల్ 68J కింద ఇచ్చే మొత్తాన్ని ఏప్రిల్ 16, 2024న జారీ చేసిన సర్క్యులర్ ద్వారా పెంచారు. పైన పేర్కొన్న నాలుగు అవసరాలకు మానవ ప్రమేయం లేకుండా రూ.లక్ష వరకు సభ్యులు ఆటో-సెటిల్‌మెంట్ కింద డబ్బు విత్ డ్రా చేసుకునేందుకు అనుమతించబడ్డారు.
పీఎఫ్ సభ్యులు రూల్ 68J కింద అనారోగ్య చికిత్స కోసం EPF ఖాతా నుంచి కొంత భాగాన్ని ఉపసంహరించుకోవచ్చు. అలాగే తన కుటుంబ సభ్యుల చికిత్స కోసం కూడా తీసుకునేందుకు అనుమతి ఉంటుంది. అలాగే రూల్ 68K కింద పీఎఫ్ ఖాతాదారుడు తన కుమార్తె లేదా కుమారుడు, సోదరి లేదా సోదరుని వివాహానికి డబ్బు విత్ డ్రా చేయవచ్చు. అలాగే పిల్లల ఉన్నత విద్యకు సైతం దీనికింద పీఎఫ్ సొమ్ము ఉపసంహరణకు అనుమతి ఉంది. ఇక చివరిగా రూల్ 68B కింద ఇంటి కొనుగోలు లేదా నిర్మాణం కోసం డబ్బును విత్‌డ్రా చేసుకోవడానికి అనుమతిస్తుంది. అలాగే ఇంటి రెనోవేషన్, మార్పులు చేర్పులకు సైతం పీఎప్ సొమ్మును అడ్వాన్స్ రూపంలో ఉపసంహరించుకోవచ్చు.
0 Response to "Good news for PF members.. Money Withdraw Rules Changed EPF"
Post a Comment