This is the explanation why usually men marry younger girls
సాధారణంగా మగవాళ్ళకి తక్కువ వయసు ఉన్న అమ్మాయి లను ఇచ్చి పెళ్లి చేస్తారు ఎందుకో వివరణ.
పెళ్ళికి అబ్బాయి వయసు కంటే అమ్మాయి వయసు తక్కువగా ఉండాలన్న నియమం ఎప్పటి నుంచో ఉంది. పూర్వం నుంచి ఈ సంప్రదాయం కొనసాగుతూ వస్తుంది. అయితే కొంతమంది వయసుతో సంబంధం లేకుండా తమ కంటే వయసులో చిన్న వాళ్ళని ఆడవాళ్లు, తమ కంటే వయసులో పెద్ద వాళ్ళని మగవాళ్ళు ప్రేమించి పెళ్లిళ్లు చేసుకుంటున్నారు.
అయితే ఆడవాళ్ళకి, మగవాళ్ళకి ఏజ్ గ్యాప్ అనేది పూర్వం పదేళ్లు అయినా ఉండేలా చూసుకునేవారు. ఆ తర్వాత నాలుగైదేళ్ళ వయసు వ్యత్యాసం చూశారు. ఇప్పుడు ఏడాది, రెండేళ్లు గ్యాప్ ఉన్నా చేసేస్తున్నారు. సమానంగా ఉన్నా చేసేస్తున్నారు.
అయితే అబ్బాయి కంటే అమ్మాయి వయసు చిన్నగా ఉండాలి అని మన పెద్దలు ఊరికే అనలేదు. అలానే దీని వెనుక శాస్త్రీయ కారణాలు కూడా ఉన్నాయి. తక్కువ వయసున్న అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తే అణిగి మణిగి ఉంటుంది.. బానిసలా పడుంటుంది. పెత్తనం చెలాయించడానికి, వృద్ధాప్యం వస్తే సేవలు చేయించుకోవడానికి అని అంటారు. కానీ ఇదేమీ కాదు. ఆ మాటకొస్తే భర్త కంటే పెద్ద వయసున్న భార్యలు కూడా అణిగి మణిగి ఉంటున్నారు. బానిసల్లా ఉంటున్నారు. బానిసత్వం వంటి వాటికి వయసుతో సంబంధం లేదు. ఆడ మనిషి ధైర్యం, పిరికితనం, తెగువ మీద ఆధారపడి ఉంటాయి. ఇవన్నీ పక్కన పెడితే అబ్బాయిల కంటే చిన్న వయసున్న అమ్మాయినిచ్చి పెళ్లి చేయడానికి మొదటి కారణం.. వారి మెచ్యూరిటీ స్థాయి.
పరిపక్వత:
మగవారి కంటే ఆడవాళ్లు చిన్న వయసులోనే పరిపక్వత కలిగి ఉంటారు. తక్కువ వయసులోనే మగాళ్ల కంటే కూడా బాగా ఆలోచించగలరు. ఆడవారు మగాళ్ల కంటే తెలివైన వాళ్ళు అని అర్థం. హోమ్ మినిష్టర్ అంటే ఆ మాత్రం తెలివితేటలు ఉండాలిగా. మగాడితో పోలిస్తే అమ్మాయిలు 2, 3 ఏళ్ళ కంటే ముందుగానే పరిపక్వత చెందుతారు. ఆడవాళ్లు 10 నుంచి 14 ఏళ్లకు పరిపక్వత చెందితే.. మగాళ్లు 12 నుంచి 16 ఏళ్ల మధ్యలో పరిపక్వత చెందుతారు. ఆడవాళ్లు వయసులో మగాళ్ల కంటే రెండేళ్లు చిన్నోళ్లే అయినా మానసికంగా ఇద్దరూ సమానమే అని స్టడీస్ చెబుతున్నాయి. అందుకే బాలన్స్ చేయడం కోసం తక్కువ వయసున్న అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తారు.
మగాళ్ల కంటే ఆడవాళ్లే స్ట్రాంగ్:
కుటుంబ బాధ్యతలను నిర్వర్తించడంలో ఆ నేర్పులో గానీ, ఓర్పులో గానీ మగవారితో పోలిస్తే ఆడవాళ్లు ఎక్కువ చురుగ్గా, బలంగా ఉంటారు. దూకుడుగా ఉండే భర్తకు పక్కనే ఉంటూ శ్రీకృష్ణుడిలా దిశా నిర్దేశం చేయగలిగిన నేర్పు ఆమెలో, ఆ వయసులో ఉంటుంది. ఇంకా వివరంగా చెప్పాలంటే భర్త గుర్రంలా పరిగెడుతుంటే.. భార్య పాములా బుసలు కొడుతూ కళ్లెం వేస్తుంటుంది.
మగాళ్ల కంటే ముందే వృద్ధాప్యం
మగాళ్ల కన్నా స్త్రీలకు త్వరగా వృద్ధాప్య ఛాయలు వస్తాయి. అబ్బాయిలతో పోలిస్తే అమ్మాయిలు త్వరగా ఎదిగిపోతారు. సమానంగా ఉన్న అమ్మాయిని గానీ లేదా తనకంటే పెద్ద వయసున్న అమ్మాయిని గానీ పెళ్లి చేసుకోవడం వల్ల.. నడి వయసు వచ్చేసరికి భర్త కంటే భార్య పెద్దదిగా కనిపిస్తుంది. అందుకే అబ్బాయి కంటే అమ్మాయి వయసు తక్కువ ఉండాలని నిర్దేశించారు.
సర్దుకుపోయే మనస్తత్వం:
మగవారితో పోలిస్తే ఆడవారికి సర్దుకుపోయే మనస్తత్వం ఎక్కువగా ఉంటుంది. ఆఫీసుల్లోనే ఎవరైనా ఇబ్బంది పెడుతుంటే ఇంట్లో చెప్పకుండా తనకు తానే హ్యాండిల్ చేసుకునే అమ్మాయి.. ఇంట్లో భర్త విషయంలో ఇబ్బందులు ఎదురైతే హ్యాండిల్ చేసుకోలేరా? ఆఫీసులో, బయట వచ్చే ఇబ్బందుల విషయంలోనే రాజీ పడే అమ్మాయిలు.. ఇంట్లో భర్తతో చిన్న చిన్న ఇబ్బందులు వస్తే సర్దుకుపోకుండా ఎలా ఉంటారు. వయసులో ఇద్దరి మధ్య తేడా ఉండడం వల్ల వయసులో భర్త పెద్ద వాడే కదా.. ఒక మాట అంటే ఏమైంది అని అని ఆ ఇల్లాలు సర్దుకుపోతుంది. ఇద్దరూ సమాన వయసు అయితే.. ఆ ఏంటి.. నువ్వు నాకు చెప్పేది అని విడాకుల వరకూ వెళ్లే ఛాన్స్ ఉంది. ప్రస్తుతం నడుస్తున్న ట్రెండ్ ఇదే కదా.
మనం గమనిస్తే గతంలో విడాకుల బ్యాచ్ తక్కువ. అప్పట్లో మహిళలు.. చిన్న చిన్న గొడవలు వచ్చినా భర్తలతో విడిపోకుండా చాలా బాగా జీవించారు. సామాన్లు సర్దుకుని పోవడం కంటే సర్దుకుపోయి జీవించడం ఉత్తమం అని అప్పట్లో అనుకునేవారు. అంతలేదు.. వాళ్ళకి వేరే దారి లేక, ఉపాధి లేక కూడా రాజీ పడి ఉండవచ్చు అని అంటారా? అలా చూసినా గానీ పిల్లల్ని అనాథలను చేసి వెళ్లిపోయేంత దుర్మార్గంగా అయితే ఆలోచించరు. భర్తకు కష్టమెచ్చినా, భార్యకు కష్టమొచ్చినా అప్పట్లో సర్దుకుపోయి బతికేవారు. అందుకే ఆ కాలంలో కాపురాలు పచ్చగా ఉన్నాయి.
ఆడవాళ్లు శారీరకంగా మానసికంగా దృఢంగా ఉంటారు
మగవారితో పోలిస్తే ఆడవారు ఎక్కువ ఆరోగ్యంగా ఉంటారు. స్త్రీకి శక్తి ఎక్కువ. ఆమెను శక్తితో పోలుస్తారు. ఇందుకే కాబోలు. పుట్టుకతోనే ఆడవారికి రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉంటుంది. రోగనిరోధక శక్తి ఒక్కటే కాదు. సహనం కూడా ఎక్కువే. పురిటి నొప్పులు భరించి పిల్లల్ని కంటారు. మానసికంగా ఎంతో దృఢంగా ఉంటే తప్ప ఒక బిడ్డకు జన్మనివ్వడం సాధ్యం కాదు. ఆడవాళ్లు మానసికంగా దృఢంగా ఉంటారు కాబట్టే.. ఎక్కువ కాలం జీవించగలుగుతారు. మగవాళ్ళకి ఆడవారితో పోలిస్తే మానసికంగా, శారీరకంగా బలహీనంగా ఉంటారు. గుండెపోటు, డయాబెటిస్ వంటి రోగాలు కూడా మగవారికే ఎక్కువ వస్తుంటాయి. ఎక్కువ సందర్భాల్లో మగవాళ్ళు త్వరగా చనిపోతారు. పిల్లలు అనాథలు అవ్వకూడదనే తక్కువ వయసున్న స్త్రీలను ఇచ్చి వివాహం చేస్తారు.
ఆడవారిలో లైంగిక కోరికలు:
మగాడితో పోలిస్తే.. ఆడవాళ్ళలో లైంగిక కోరికలు, లైంగిక ప్రతిస్పందనలు 20వ ఏట నుంచే మొదలవుతాయి. మగాళ్ళకి మాత్రం 35 ఏళ్ల నుంచి మొదలవుతాయి. మగాళ్లకు 40 నుంచి 50 ఏళ్ల వయసులో లైంగిక కోరికలు అధికంగా ఉంటాయి. ఆ 40, 50 ఏళ్ల వయసులో మహిళలకు లైంగిక కోరికలు క్షీణిస్తాయి. ఈ కారణం వల్లే ఒకే వయసున్న వారిని పెళ్లి చేసుకోకూడదు అని అంటారు. చేసుకుంటే లైంగిక కోరికల విషయంలో ఏకాభిప్రాయం లేక మనస్పర్థలు వస్తాయి. అందుకే తక్కువ వయసున్న అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తారు. 60, 70 ఏళ్ళు వచ్చాక మాగాళ్ళలో లైంగిక కోరికలు తగ్గిపోతాయి. 20 నుంచి 40 లోపు వయసున్న ఆడవాళ్లను.. 35 నుంచి 50 లోపు వయసున్న మగాళ్లు పెళ్లి చేసుకుంటే ఆ బ్యాలెన్స్ అనేది కరెక్ట్ గా కుదురుతుందని స్టడీస్ చెబుతున్నాయి.
ఉదాహరణకు 20 ఏళ్ల అమ్మాయిని.. 35 ఏళ్ల మగాడు పెళ్లి చేసుకుంటే బాగుంటుందనే విషయంపై పై కారణాలు చూస్తేనే అర్థమవుతుంది. ఈ కారణాల వల్లే ఒకప్పుడు మగాడి కన్నా పది, పదిహేనేళ్ళు తక్కువ వయసున్న అమ్మాయిలను పెళ్లి చేసుకునేవారేమో అనిపిస్తుంది. ఒక రకంగా అలా చేసుకున్న కాపురాలు కూడా నిలబడ్డాయి. అయితే మారుతున్న కాలం ప్రకారం.. ఇప్పుడు అమ్మాయి వయసు అబ్బాయి కంటే ఐదేళ్లు చిన్నగా ఉండాలని స్టడీస్ చెబుతున్నాయి. మరీ చిన్న వయసున్న అమ్మాయిని చేసుకుంటే 60-70 ఏళ్ళు వచ్చేసరికి మగాళ్ల లైంగిక కోరికలు తగ్గిపోతాయి. దీని వల్ల కూడా అసంతృప్తి నెలకొంటుంది. అందుకే ఈ లైంగిక కోరికలను బ్యాలెన్స్ చేసేందుకు వయసు వ్యత్యాసం సరిగ్గా ఉండాలని అంటారు.
సంతానోత్పత్తి సామర్థ్యం,పునరుత్పత్తి సామర్థ్యం:
పాత రోజుల్లో పెళ్లిళ్లు గమనించినట్లయితే.. ఒక స్త్రీ 48 నుంచి 50 ఏళ్ల వయసుకొచ్చేసరికి మోనోపాజ్ దశకు వస్తుంది. 20, 30 ఏళ్ల మధ్యలో ఆమె సంతానోత్పత్తి సామర్థ్యం, పునరుత్పత్తి సామర్థ్యం మెరుగ్గా ఉంటాయి. 30 ఏళ్ల తర్వాత సామర్థ్యం తగ్గిపోయి.. అండాశయంలో అండాలు తగ్గిపోతాయి. ఈ కారణం వల్లే 20 ఏళ్ళు దాటగానే ఆడవారికి పెళ్లిళ్లు చేస్తుండచ్చు.
సాంప్రదాయం ప్రకారం చూసినా.. లేదా శాస్త్రీయంగా చూసినా.. ఎలా చూసినా గానీ.. మగవారితో పోలిస్తే ఆడవారికి వయసు తక్కువ ఉంటే బాగుంటుందనేది స్పష్టమవుతుంది. అయితే ఇదే ఖచ్చితంగా జరుగుతుంది అని చెప్పలేం. ఎందుకంటే ఇప్పుడు సమాన వయసున్న వారు కూడా పెళ్లి చేసుకుని ఒకరినొకరు అర్థం చేసుకుని ఆనందంగా గడుపుతున్నారు. తమకంటే వయసులో పెద్దవారిని పెళ్లి చేసుకుని మగాళ్లు సంతోషంగా ఉంటున్నారు. ఇది వారి వారి సొంత అభిప్రాయాల మీద ఆధారపడి ఉంటుంది. మరి ఈ విషయంలో మీ అభిప్రాయం ఏమిటో కామెంట్ చేయండి.
0 Response to "This is the explanation why usually men marry younger girls"
Post a Comment