We Love Reading Summer Activities
We Love Reading Summer Activities ( Class 6 - 10) 27.05.24
Day-34
Class 6-10 We Love Reading Summer Activities 27.05.2024.
Class 6-9 We Love Reading: తెలుగు కథ : అద్దం లో మనిషి
ఒక గ్రామంలో ఒక కుమ్మరి నివసించేవాడు. అతడు రోజంతా కష్టపడి కుండలు తయారుచేసి అమ్మేవాడు. రోజూ కుండలు తయారుచేయడం కోసం అవసరమైన నీటిని దగ్గరలో ఉన్న కొలనులో నుంచి తెచ్చుకొనేవాడు. అందుకోసం రెండు కుండలు
ఒక గ్రామంలో ఒక కుమ్మరి నివసించేవాడు. అతడు రోజంతా కష్టపడి కుండలు తయారుచేసి అమ్మేవాడు.
రోజూ కుండలు తయారుచేయడం కోసం అవసరమైన నీటిని దగ్గరలో ఉన్న కొలనులో నుంచి తెచ్చుకొనేవాడు.
అందుకోసం రెండు కుండలు ఉపయోగించేవాడు. అందులో ఒక కుండకు చిన్న రంధ్రం ఉంది. దానివల్ల దారివెంట నీళ్లు దారగా పోయేవి.
అలా నీళ్లు పడిపోతుండటం చూసి మరో కుండ నవ్వేది. దాంతో చిల్లు ఉన్న కుండ దిగాలుపడిపోయేది.
అది గమనించిన కుమ్మరి ఒక రోజు ‘‘నువ్వు దిగాలుగా ఉండకు. నీకు రంధ్రం ఉందని నాకు తెలుసు. అయినా నిన్ను ప్రతిరోజు కావాలనే కొలనుకు తీసుకువస్తున్నాను.
ఎందుకంటే నీ రంధ్రంలో నుంచి నీళ్లు ఈ మొక్కలకు పడుతున్నాయి.
అలా నీళ్లు పడటం వల్ల మొక్కలు ఎంత బాగున్నాయో చూడు!
వాటి పువ్వులు ఎంత అందంగా ఉన్నాయో! అదంతా నీవల్లే!
కాబట్టి చిన్న చిన్న లోపాలకు కుంగిపోకూడదు’’ అని అన్నాడు. దాంతో ఆ కుండ సంతోషపడింది.
Class 3-5 We Love Reading: English : Unity is Strength
0 Response to "We Love Reading Summer Activities"
Post a Comment