We Love Reading Summer Activities
We Love Reading Summer Activities ( Class 1 - 5) 22.05.24
Day-28
Class 6-10 We Love Reading Summer Activities 22.05.2024.
Class 6-9 We Love Reading: తెలుగు కథ : బ్లాకీ పుట్టినరోజు
ఒక అడవిలో ఒక బ్లాకీ అనే ఎలుగుబంటి ఉండేది. తన పుట్టిన రోజుకు అందరినీ పిలవాలనుకుంది. అయితే తన స్నేహితుడు జంబో ఏనుగు మాత్రం ‘వీలుచేసుకుని మహారాజుగారిని పిలువు’ అన్నది. ఎలుగుబంటి వెళ్లింది.
ఒక అడవిలో ఒక బ్లాకీ అనే ఎలుగుబంటి ఉండేది. తన పుట్టిన రోజుకు అందరినీ పిలవాలనుకుంది.
అయితే తన స్నేహితుడు జంబో ఏనుగు మాత్రం ‘వీలుచేసుకుని మహారాజుగారిని పిలువు’ అన్నది.
ఎలుగుబంటి వెళ్లింది. మహారాజు షేర్ ఖాన్‌తో ఇలా మాట్లాడింది. ‘మరునాడు నా పుట్టినరోజు. మీరు తప్పకుండా రావాల’ని ఆహ్వానం అందించింది.
తప్పకుండా వస్తానన్నాడు షేర్‌ఖాన్. ఇంటికొచ్చి ఎలుగు చిందులేసింది. తన అమ్మ కేక్ ఏర్పాటు చేయడంలో.. తన నాన్న డెకరేషన్‌లో మునిగిపోయాడు.
పుట్టినరోజు రానే వచ్చింది. ఇళ్లంతా కోలాహలం. జింక, నక్క, ఎలుగుబంట్లు, ఏనుగు.. ఇలా మిత్రులంతా వచ్చారు. తన ఇష్టమైన హనీకేక్‌ను కట్ చేసి ఎప్పుడెప్పుడూ తినాలోనని ఎదురుచూస్తోంది బ్లాకీ.
ఇళ్లంతా డ్యాన్సులు. కూల్ డ్రింక్స్ సర్వ్ చేశారు. బ్లాకీ డ్యాన్స్ చేస్తోంది స్నేహితులతో.
గంట తర్వాత తన ఫోన్ దగ్గరకు వెళ్లింది బ్లాకీ. చూస్తే అందులో తొమ్మిది మిస్డ్ కాల్స్ ఉన్నాయి. వెంటనే ఫోన్ చేసింది.
‘నేను మీ ఇంటికి వచ్చాను. నువ్వు డ్యాన్స్‌లో మునిగిపోయావేమో. తలుపు కొట్టినా ఎవరూ తీయలేదు.. అంటూ వెంటనే ఫోన్ కట్ చేసింది. బాధపడింది బ్లాకీ. విచారంతోనే కేక్ కట్ చేసింది. తినింది. అయినా ఏదో విచారంగా ఉంది.
తన పేరెంట్స్ అడిగితే.. విషయం చెప్పింది. ఆ తర్వాత జంబోకి కూడా చెప్పింది. ‘భయపడకు. జరిగేదేదో జరిగింది. అందరూ డిన్నర్ చేశాక రాజుగారి దగ్గరకు వెళ్దాం’ అన్నది.
అందరూ వెళ్లిపోయాక.. జంబో తన స్నేహితుడు బ్లాకీని తీసుకుని రాజుగారి గుహ దగ్గరకు వెళ్లింది. బ్లాకీని చూస్తూనే షేర్ ఖాన్ కోప్పడ్డాడు. ‘వెళ్లిపో’ అన్నాడు. ‘మీకు ఫ్రూట్‌కేక్ సపరేట్‌గా తెప్పించా’ అన్నాడు.
‘ఎంగిలి కేక్ ఎవరికి కావాలి’ అన్నాడు షేర్ ఖాన్. ఇది మీకోసమే స్పెషల్‌గా తెప్పించా అన్నారు. వెంటనే రాజుగారు కరిగిపోయారు. దగ్గరకిరా అన్నాడు.
పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పాడు. కట్ చేయమన్నాడు. ఇతర జంతువులన్నీ క్లాప్స్ కొడుతుంటుంటే బ్లాకీ కేక్ కట్ చేశాడు. సగం కేక్ తీసుకున్నాడు షేర్ ఖాన్.
అందరూ బ్లాకీ ముఖానికి పూస్తాడేమో అనుకున్నారు. ఆ వెంటనే నవ్వుతూ ‘ముఖానికి పూయను. తింటా’ అంటూ కేక్ తినటం ప్రారంభించాడు షేర్ ఖాన్.
అంతలో ‘మహారాజా మన్నించండి.. నా తప్పుకు’ అన్నాడు బ్లాకీ. ‘కేక్ తీయగా ఉంది’ అంటూ హ్యాపీగా నవ్వాడు షేర్‌ఖాన్.
Class 3-5 We Love Reading: English : Form New Sentences
Insert Commas
0 Response to " We Love Reading Summer Activities"
Post a Comment