Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

About Sri Cherukuri Ramoji Rao

 చెరుకూరి రామోజీరావు

 అక్షర శిల్పి రామోజీ కి ఘన నివాళి

అభి మీడియా బ్యూరో ప్రత్యేక ప్రతినిధి :  చెరుకూరి రామోజీరావు, ఒక భారతీయ వ్యాపారవేత్త, ఈనాడు గ్రూపు సంస్థల అధినేత. తెలుగు దినపత్రిక ఈనాడుకు వ్యవస్థాపకుడు, ప్రధాన సంపాదకుడు, ప్రచురణ కర్త. మార్గదర్శి చిట్‌ఫండ్, ప్రియా ఫుడ్స్, కళాంజలి మొదలగు వ్యాపార సంస్థల అధినేత. రామోజీరావు స్థాపించిన రామోజీ గ్రూపు ఆధీనంలో ప్రపంచంలోనే అతిపెద్ద సినిమా స్టూడియో రామోజీ ఫిల్మ్ సిటీ ఉంది. 2016లో భారత ప్రభుత్వం అతనిని దేశ రెండో అత్యున్నత పురస్కారమైన పద్మవిభూషణ్ తో సత్కరించింది.

కుటుంబ నేపథ్యం ఇదీ

రామోజీరావు కృష్ణా జిల్లా పెదపారుపూడిలో 1936 నవంబరు 16న రైతుకుటుంబంలో జన్మించాడు. తల్లి వెంకటసుబ్బమ్మ, తండ్రి వెంకట సుబ్బారావు. రామోజీరావు పూర్వీకులు పామర్రు మండలంలోని పెరిశేపల్లి గ్రామానికి చెందినవారు. అతని తాత రామయ్య కుటుంబంతో పెరిశేపల్లి నుంచి పెదపారుపూడికి వలస వచ్చాడు. రామోజీరావు తాత మరణించిన 13 రోజులకు జన్మించాడు. దానితో అతని జ్ఞాపకార్థం తల్లిదండ్రులు రామయ్య అన్న పేరు పెట్టారు. ఇతనికన్నా ముందు ఇద్దరు అక్కలు ఉన్నారు. పెద్దక్క పేరు రాజ్యలక్ష్మి, చిన్నక్క పేరు రంగనాయకమ్మ.

బాల్యం, విద్యాభ్యాసం, వివాహం (1937 - 1961)

ఇతని కుటుంబానిది శ్రీ వైష్ణవ నేపథ్యం. తల్లి చాలా భక్తిపరురాలు, ఆచారవంతురాలు కావడంతో చిన్నతనంలో ఇతనికీ భక్తి, శుచి అలవడింది. లేకలేక పుట్టిన మగసంతానం కావడంతో రామోజీని చాలా ముద్దుచేసేవారు. పెద్దక్క పెళ్ళిచేసుకుని వెళ్ళిపోయినా చిన్నక్క రంగనాయకమ్మతో సాన్నిహిత్యం ఉండేది. ఇంట్లో తల్లికి ఇంటిపనుల్లో, వంటలో సహాయం చేసే అలవాటూ ఉండేవి. రామయ్య అన్న తన పేరు నచ్చక ప్రాథమిక పాఠశాలలో చేరేప్పుడే స్వంతంగా "రామోజీ రావు" అన్న పేరును సృష్టించుకుని, తానే పెట్టుకున్నాడు. ఆ పేరే జీవితాంతమూ కొనసాగుతోంది. రామోజీరావు 1947లో గుడివాడలో పురపాలకోన్నత పాఠశాలలో 8వ తరగతిలో చేరాడు. 1957లో ఆరవ ఫారం అక్కడే పూర్తిచేసుకుని, గుడివాడ కళాశాలలో ఇంటర్, బీఎస్సీ చదివారు. 1961 ఆగస్టు 19న రామోజీరావుకు, పెనమలూరుకు చెందిన తాతినేని వెంకట సుబ్బయ్య, వాణీదేవిల రెండవ కుమార్తె రమాదేవితో వివాహం జరిగింది. రమాదేవి అసలు పేరు రమణమ్మ కాగా పెద్దలు పెట్టిన పేరు నచ్చక అలా మార్చుకుంది. రామోజీరావుతో భార్య వైపు బంధువుల్లో చిన్న బావమరిది తాతినేని వెంకట కృష్ణారావు మార్గదర్శి చిట్ ఫండ్స్ సంస్థలో డైరెక్టరుగా, తోడల్లుడు ముసునూరు అప్పారావు ఈనాడు, డాల్ఫిన్స్ హోటల్స్ మాజీ ఎండీగా కలసి పనిచేశారు.

రామోజీరావు గారి ప్రస్థానం 

 కృష్ణా జిల్లా పెదపారపూడి గ్రామంలో మధ్య తరగతి రైతు కుటుంబంలో 1936 నవంబర్‌16న చెరుకూరి వెంకట సుబ్బారావు, వెంకట సుబ్బమ్మ దంపతులకు రామోజీరావు జన్మించారు. ఆయనకు రాజ్యలక్ష్మీ, రంగనాయకమ్మ అనే ఇద్దరు అక్కయ్యలు ఉన్నారు.

1947లో గుడివాడ మున్సిపల్‌ ఉన్నత పాఠశాలలో ఎనిమిదో తరగతిలో చేరి 1951 వరకు సిక్త్స్‌ ఫాం వరకు చదివారు. గుడివాడ కళాశాలలో ఇంటర్మీడియట్‌, బీఎస్సీ పూర్తి చేశారు. అనంతరం దిల్లీలోని ఓ యాడ్‌ ఏజన్సీలో ఆర్టిస్ట్‌గా చేరారు.

* 19.08.1961లో తాతినేని రమాదేవితో వివాహం. 

* 1962లో హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. 

* 1962 అక్టోబరులో మార్గదర్శి చిట్‌ఫండ్‌ స్థాపన. 

* 1965లో కిరణ్‌ యాడ్స్‌ ప్రారంభం.

* 1967-1969 వరకు ఖమ్మంలో వసుంధర ఫెర్టిలైజర్స్‌ పేరుతో ఎరువుల వ్యాపారం.

* 1969లో అన్నదాత పత్రికను ప్రారంభించారు. 

* 1970లో ఇమేజస్‌ అవుట్‌డోర్‌ అడ్వర్టయిజింగ్‌ ఏజన్సీ ప్రారంభం. 

* 1972-1973 విశాఖలో డాల్ఫిన్‌ హోటల్‌ నిర్మాణానికి శ్రీకారం.

* 21.06.1980లో త్రీస్టార్‌ హోటల్‌గా డాల్ఫిన్‌ ప్రారంభం. 

* 10.08.1974లో విశాఖ ‘ఈనాడు’ దిన పత్రిక ప్రారంభం. 

* 12.08.1974లో మార్గదర్శి మార్కెటింగ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ప్రారంభం. 

* 1975 డిసెంబరు 17న ‘ఈనాడు’ హైదరాబాదు ఎడిషన్‌ ప్రారంభమైంది.

* 03.10.1976లో సినీ ప్రేమికుల కోసం ‘సితార’ పత్రికను ప్రారంభించారు. 

* ఫిబ్రవరి 1978లో ‘చతుర’, ‘విపుల’ మాస పత్రికల ప్రారంభం. 

* 09.02.1980లో ‘ప్రియా ఫుడ్స్‌’ ప్రారంభం. 

* 02.03.1983లో ‘ఉషాకిరణ్‌ మూవీస్‌’ సంస్థ ఏర్పాటు.

* 1990లో ‘ఈనాడు జర్నలిజం స్కూలు’ ప్రారంభం. 

* 1992-1993లో సారాపై సమరం. మధ్యంపై నిషేద ఉత్తర్వులు వచ్చేదాకా పోరు. 

* 1996లో ప్రపంచలోనే అతి పెద్ద చిత్రనగరి ‘రామోజీ ఫిల్మ్‌ సిటీ’ స్థాపన 

* 27.01.2002లో ‘ఈటీవీ’ ఆధ్వర్యంలో ఆరు ప్రాంతీయ ఛానళ్ల ప్రారంభం.

* 20.06.2002లో ‘రమాదేవి పబ్లిక్‌ స్కూల్‌’ ప్రారంభం. 

* 14.04.2008లో సమాచార చట్టం కోసం ‘ముందడుగు’ 

* 25.12.2014లో ప్రధాని మోదీ ‘స్వచ్ఛభారత్‌’ కార్యక్రమ ప్రచార భాగస్వామిగా రామోజీరావును నామినేట్‌ చేశారు. 

* 14.11.2015లో మరో నాలుగు ఈటీవీ ఛానళ్ల ఆరంభం.


రామోజీరావు గారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నా🙏

ఓం శాంతి🙏

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "About Sri Cherukuri Ramoji Rao"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0