Anna Canteens Opening Time Finalized - Prices Details
అన్నా క్యాంటీన్ల ప్రారంభ ముహూర్తం ఖరారు - ధరలు వివరాలు.
ఏపీ ప్రభుత్వం వేగంగా నిర్ణయాలు తీసుకుంటోంది. హామీల అమలుకు ప్రాధాన్యత ఇస్తోంది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు చేపడుతూనే వెంటనే అమలు చేయాల్సిన అయిదు హామీల పైన సంతకాలు చేసారు.
అందులో భాగంగా అన్నా క్యాంటీన్లను తిరిగి ప్రారంభించేందుకు కసరత్తు జరుగుతోంది. ప్రారంభ ముహూర్తాన్ని మంత్రి నారాయణ వెల్లడించారు. అదే విధంగా క్యాంటీన్ల నిర్వహణ.. పదార్ధాల ధరలను ఖరారు చేసారు.
మూడు వారాల్లోప్రారంభం
మంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే మంత్రి నారాయణ తొలిగా అన్నా క్యాంటీన్ల పైన సమీక్ష చేసారు. గతంలో 203 అన్నకాంటీన్‌లకు అనుమతి ఇచ్చామని, 19 మినహా అన్ని అప్పట్లో అందుబాటులోకి వచ్చాయని చెప్పారు. అన్న క్యాంటీన్‌లు రిపేర్ చేసి ఎస్టిమేషన్ ఇవ్వమని అధికారులకు చెప్పామన్నారు. గతంలో అన్న క్యాంటీన్‌లు ఇస్కాన్‌కు ఇచ్చామని, బ్రేక్ ఫాస్ట్‌కు, లంచ్, డిన్నర్‌కు 73 రూపాయలు ఖర్చు అవుతుందని, దీనిలో ఇస్కాన్ వాళ్ళుకు 58 రూపాయలు ప్రభుత్వం ఇచ్చిందని మంత్రి నారాయణ తెలిపారు.
వంద క్యాంటీన్లు
ఆన్న క్యాంటీన్‌లో రోజు 2 లక్షల 20 వేలమంది తినేవారని, 4 కోట్ల 60 లక్షల 31 వేల 600 ప్లేట్‌లు గత ప్రభుత్వంలో అన్న క్యాంటీన్ ద్వారా అందించామన్నారు. రద్దీ ఎక్కువగా వుండే మార్కెట్‌లు, పరిశ్రమలు వుండే చోట వీటిని ఏర్పాటు చేశామని తెలిపారు. రూరల్ ఏరియాలో 150 క్యాంటీన్‌లు ఇవ్వాలని కూడా అప్పట్లో ముఖ్యమంత్రి చెప్పారన్నారు. ఆన్న క్యాంటీన్‌లు 15 రోజుల్లో ప్రారంభించాలని అధికారులను అడిగానని, అందుకు అధికారులు 21 రోజుల సమయం పడుతుందని చెప్పారని మంత్రి నారాయణ అన్నారు. అన్న క్యాంటీన్లు ఉన్న సచివాలయాలు తిరిగి అన్న క్యాంటీన్‌లకు ఇస్తామన్నారు.
రూ 5కే భోజనం
సచివాలయాలకు ప్రత్యామ్నాయ భవనాలు చూస్తామన్నారు. ప్రస్తుతానికి 100 అన్నా క్యాంటీన్లు ప్రారంభిస్తామన్నారు. ఇస్కాన్ వాళ్లు కూడా సెంట్రలైజ్ కిచెన్లు చాలా చోట్ల నిలిపేశారని, ఆన్న క్యాంటీన్ కుకింగ్ ఎక్విప్మెంట్‌ను తిరిగి ఇతర రాష్ట్రాల నుంచి తేవడానికి సమయం కావాలన్నారని వారు అడిగారన్నారు. చివరకు సెంట్రలైజ్డ్ కిచెన్ ఎక్విప్మెంట్ కూడా పక్క రాష్ట్రాలకు తరలిపోయిందన్నారు. ఒక్కో అన్నా క్యాంటీన్ ఏర్పాటుకు అప్పట్లో రూ. 42 లక్షల ఖర్చు అయిందని, అన్నా క్యాంటీన్లు ప్రారంభమయ్యాక తిరిగి అయిదు రూపాయలకే భోజనం, టిఫిన్లు అందిస్తామని మంత్రి నారాయణ వెల్లడించారు.
0 Response to "Anna Canteens Opening Time Finalized - Prices Details"
Post a Comment