Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

AP Amaravathi Assembly Session 2024

 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు 24 జూన్ 2024 మూడు రోజుల పాటు నిర్వహణ వివరాలు.

AP Amaravathi Assembly Session  2024  AP అసెంబ్లీ సమావేశాలు : ఏపీలో కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు తేదీలు ఖరారు చేసింది. జూన్ 24 నుంచి మూడు రోజుల పాటు సమావేశాలు నిర్వహించనున్నారు.

లోకసభ స్పీకర్ గా అయ్యన్నపాత్రుడు ఎంపిక అయ్యారు !

ఏపీలో పొత్తుతో పోటీ చేసిన టీడీపీ, బీజేపీ, జనసేన విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. కూటమి ప్రభుత్వానికి సీఎంగా చంద్రబాబు, డిప్యూటీ సీఎంగా పవన్ కల్యాణ్ ఇటీవల ప్రమాణ స్వీకారం చేశారు. ఇప్పుడు కేబినెట్ పంపకాలు కూడా పూర్తయ్యాయినట్టే . జనసేనకు మూడు మంత్రి పదవులు చోటు దక్కించుక్కాయి , బీజేపీకి ఒక కేబినేట్ స్థానాన్ని కేటాయించారు చంద్రబాబు. కేబినెట్ లో సీనియర్లతో పాటు కొత్త వారికి కుడా అవకాశం కల్పించారు. అయితే ఇప్పుడు స్పీకర్ పదవిపై ఆసక్తి నెలకొంది. స్పీకర్, డిప్యూటీ స్పీకర్, చీఫ్ విప్ పదవులను సీనియర్లకు కేటాయిస్తారని ప్రచారం జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ రేసులో టీడీపీ సీనియర్ల పేర్లు వినిపిస్తున్నాయి. వీరిలో మాజీ మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడు పేరు ప్రథమంగా వినిపిస్తుంది.

ఇప్పుడు అయ్యన్న పాత్రుడి పేరును దాదాపు ఖరారు అయినట్లేనని టీడీపీ వర్గాల్లో చర్చ జరుగుతుంది. మరోవైపు డిప్యూటీ స్పీకర్ పదవిపై జనసేన ఆసక్తిగా ఉందని తెలుస్తోంది. జనసేన నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం మాధవి లేదా కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ పేర్లను డిప్యూటీ స్పీకర్ పదవికి పరిశీలిస్తున్నట్లు సమాచారం వినిపిస్తుంది . చీఫ్‌ విప్‌గా టీడీపీ సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్ర పేరును చంద్రబాబు ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. వీటిపై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

జూన్ 24న ఏపీ అసెంబ్లీ, శాసనమండలి తొలి సమావేశాలు ప్రారంభం కానున్నాయి. జూన్ 22న జరగనున్న క్యాబినెట్ సమావేశంలో తొలి సెషన్‌కు సంబంధించి నిర్ణయాన్ని ఖరారు చేయనున్నారు. ప్రారంభ సెషన్ మూడు రోజుల పాటు ఉంటుందని అంచనా వేయబడింది. ఈ సమయంలో ప్రొటెం స్పీకర్ కొత్తగా ఎన్నికైన సభ్యులతో ప్రమాణం చేయిస్తారు. ఆ తర్వాత అసెంబ్లీ స్పీకర్‌, డిప్యూటీ స్పీకర్‌ పదవులకు ఎన్నికలు జరగనున్నాయి

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "AP Amaravathi Assembly Session 2024 "

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0