Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

AP Ration Distribution

AP Ration Distribution:ఇక రేషన్ షాపుల్లోనే పంపిణీ.. మొబైల్ డెలివరీ వ్యవస్థకు మంగళం

AP Ration Distribution

 రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో అన్ని వ్యవస్థల్లో మార్పులు చకచక చేస్తున్నారు. ఇక నుంచి ఇంటి వద్దే రేషన్ ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయించింది.

అలాగే రేషన్ డీలర్ల కమిషన్ పెంచేందుకు కూడా సమీక్షలు చేస్తున్నారు. దీంతో పాత పద్దతినే అమలు చేయడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తుంది.

తొలుత రాష్ట్రంలో రేషన్ షాప్‌ల వద్ద రేషన్ ఇచ్చేవారు. రేషన్ డీలర్లు కమిషన్‌ ప్రాతిపదికన దుకాణాలను నిర్వహించేవారు. 2019 ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఇంటింటికీ రేషన్ వ్యవస్థ తీసుకొచ్చారు. రేషన్‌ డీలర్లకు లబ్దిదారులకు మధ్య మొబైల్ డెలివరీ యూనిట్లను నెలకొల్పారు. రేషన్ డీలర్ల నుంచి బియ్యాన్ని మొబైల్ డెలివరి యూనిట్లలో తరలించి కార్డు దారులకు పంపిణీ చేసేవారు.

2021 జనవరి 1 నుంచి గ్రామాల్లోనూ, ఫిబ్రవరి 1నుంచి పట్టణాల్లో ఇంటింటికి రేషన్ పంపిణీ చేసేందుకు వైసీపీ ప్రభుత్వం నిర్ణయించింది. సిఎం జగన్మోహన్ రెడ్డి ఈ పథకాన్ని ప్రారంభించారు.రేషన్ పంపిణీ కోసం మొబైల్ వాహనాలను కూడా కొనుగోలు చేసింది. శ్రీకాకుళం జిల్లాల్లో పైలెట్ ప్రాజెక్టుగా ఏడాదిగా అమలు చేసి అనంతరం 2021లో రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నించింది.

అప్పుడే స్థానిక సంస్థల ఎన్నికల రావడంతో అప్పటి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ) నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఈ పథకాన్ని నిలిపివేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్‌కు లేఖ రాశారు. దీనిపై ప్రభుత్వం సవివరంగా ఎస్ఈసీకి తిరిగిసమాధానం రాసింది.

పేదలకు ఆహార భద్రత కల్పించడం ప్రభుత్వ విధి అని, ఇందులో భాగంగానే అర్హత కలిగిన పేదలందరికీ వారి ఇళ్ల వద్దే నాణ్యమైన బియ్యం అందజేసేందుకు ముందుకు అడుగులు వేస్తున్నామని ప్రభుత్వం ఆ లేఖలో పేర్కొంది. దీన్ని అనుమతించాలని కోరింది. అలాగే హైకోర్టు అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. హైకోర్టు రాజకీయ నాయకులు ఫోటోలు పెట్టకుండా అమలు చేయాలని ఆదేశాలు ఇచ్చింది. దీంతో ఇంటింటికీ రేషన్ పథకం అమలులోకి వచ్చింది.

ఇంటింటికీ సరుకులు పంపిణీ చేయడానికి రూ.538 కోట్లతో 9,260 మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్ వాహనాలను కొనుగోలు చేసింది. ఒక్కో వాహనం రూ.5,81,190 ధర పడింది. ఒక్కో వాహనానికి డ్రైవర్ కమ్ సప్లైదారుడు ఒకరు, సహాయకుడు మరొకరు ఉంటారు. నిర్ణీత సమయంలో ఇళ్ల వద్దకే వాహనం వెళ్లి రేషన్ సరఫరా చేస్తున్నారు. అయితే నెట్‌వర్క్ సమస్య వల్ల ప్రతి ఇంటికి వాహనం వెళ్లటం లేదు. ఒక దగ్గర వాహనాన్ని ఆపి ఆ ప్రాంతంలోని పది ఇళ్లకు రేషన్ ఇస్తున్నారు. ఆ తరువాత మరొక ప్రాంతంలో ఆపి అక్కడ చుట్టుపక్కల ఉన్న ఇళ్లకు రేషన్ ఇస్తారు.

ఇటీవలి జరిగిన ఎన్నికల్లో ప్రభుత్వం మారింది. దీంతో గతంలోనే టీడీపీ నేతలు తాము అధికారంలోకి రాగానే రేషన్ షాపుల వద్దే   రేషన్ ఇచ్చే పాత వ్యవస్థను పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చారు. అందులో భాగంగానే ఇంటింటికీ రేషన్ పథకాన్ని రద్దు చేసి, పాత రేషన్ షాపుల వ్యవస్థే రానుంది. అందుకోసం ప్రభుత్వం చర్యలు చేపడుతుంది. అలాగే రేషన్ డీలర్ల కమిషన్ కూడా పెంచేందుకు ప్రభుత్వం సమీక్షిస్తుంది. రేషన్ దుకాణాలు, మొబైల్ డెలివరీ యూనిట్లతో బియ్యం మాత్రమే ప్రస్తుతం పంపిణీ చేస్తున్నారు.

ఏపీలో ప్రస్తుతం 2రుపాయలకు సరఫరా చేస్తోన్న బియ్యాన్ని రైతుల నుంచి కొనుగోలు చేసి పేదలకు పంపిణీ చేయడానికి ప్రభుత్వం కిలోకు రూ.39 ఖర్చు చేస్తోంది. చాలామంది కార్డు దారులు ఈ బియ్యాన్ని రేషన్‌ వాహనాలకే విక్రయించేస్తున్నారు. వాటిని రీ సైక్లింగ్ చేయడం, ఇతర దేశాలకు అక్రమంగా ఎగుమతి చేస్తున్న నేపథ్యంలో బియ్యం స్థానంలో నగదు పంపిణీ చేయాలనే ప్రతిపాదనలు కూడా ఉన్నాయి. 

చౌకధరల వస్తువుల పంపిణీ వ్యవస్థలో వేల కోట్ల రుపాయలు అక్రమాలు జరుగుతున్నాయనే ఆరోపణలు చాలా కాలంగా ఉన్నాయి. మొబైల్ డెలివరీ వ్యవస్థను ప్రవేశపెట్టిన తర్వాత రేషన్ డీలర్లు, ఎండియు యూనిట్లు సిండికేట్‌గా మారిపోయి రాష్ట్ర వ్యాప్తంగా దందాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. గతంలో కార్డు దారులు రేషన్ తీసుకోడానికి ప్రతినెల 15వ తేదీ వరకు అనుమతించే వారు. ప్రస్తుతం నెలలో కేవలం ఒక్క రోజు మాత్రమే అయా ప్రాంతాల్లో బియ్యం పంపిణీ జరుగుతోంది. వాహనం వచ్చిన సమయంలో కార్డుదారుడు లేకపోయినా, వరుసగా మూడు నెలలు బియ్యం తీసుకోకపోయిన కార్డులను రద్దు చేస్తున్నారు. 

ఈ క్రమంలోనే పౌరసరఫరాల వ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేసేందుకు ఏపీ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ప్రధానంగా రాష్ట్రంలోని పోర్టుల నుంచి విదేశాలకు అక్రమంగా జరుగుతున్న బియ్యం రవాణాాపై ఇప్పటికే పూర్తి సమాచారాన్ని విజిలెన్స్‌ నివేదికలు ప్రభుత్వానికి చేరాయి.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "AP Ration Distribution"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0