Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

DSC Notification Cancelled

AP DSC Notification Cancelled : ১৯ డీఎస్సీ నోటిఫికేషన్ రద్దు, విద్యాశాఖ జీవో జారీ

DSC Notification Cancelled

 DSC Notification Cancelled : ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గత వైసీపీ ప్రభుత్వంలో విడుదలైన డీఎస్సీ నోటిఫికేషన్ రద్దు చేసింది. ఈ మేరకు విద్యాశాఖ జీవో నెం.256 జారీ చేసింది.

వైసీపీ ప్రభుత్వంలో 6,100 టీచర్ పోస్టుల భర్తీకి డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలైంది. ఎన్నికల సమయంలో నోటిఫికేషన్ విడుదల కావడంతో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ముందుకు సాగలేదు. ఎన్నికల్లో కూటమి పార్టీలు విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. ఎన్నికల ప్రచారం ఇచ్చిన హామీ మేరకు చంద్రబాబు సీఎంగా బాధ్యతలు తీసుకున్న తర్వాత మొదటి సంతకం మెగా డీఎస్సీపై పెట్టారు. ఈ నేపథ్యంలో పాత డీఎస్సీ నోటిఫికేషన్ ను ప్రభుత్వం తాజాగా రద్దు చేసింది. నేడో, రేపో 16,347 పోస్టులతో నూతన డీఎస్సీ నోటిఫికేషన్ జారీకానుంది.

నేడో, రేపో డీఎస్సీ నోటిఫికేషన్

మెగా డీఎస్సీపై సీఎం చంద్రబాబు తొలి సంతకం చేయగా, విధివిధానాలపై మంత్రి నారా లోకేశ్ కూడా సంతకం చేశారు. ఇటీవల జరిగిన కేబినెట్ సమావేశంలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ కు ఆమోదం లభించింది. దీంతో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలకు లైన్ క్లియర్ అయ్యింది. ఇప్పటికే టెట్ ఫలితాలు విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం నేడో, రేపో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయనుంది. మెగా డీఎస్సీ కోసం మరోసారి టెట్ నిర్వహిస్తామని ప్రభుత్వం నిర్ణయించింది. డీఎస్సీతో పాటు టెట్‌ పరీక్షను నిర్వహించనున్నారు.

16,347 పోస్టులు

ఏపీలో కూటమి ప్రభుత్వంలోకి రావటంతో టీచర్ ఉద్యోగ అభ్యర్థులకు శుభవార్తను చెప్పిన సంగతి తెలిసిందే. మెగా డీఎస్సీ దస్త్రంపై చంద్రబాబు తొలి సంతకం కూడా చేసిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ ఆదేశాలతో విద్యాశాఖ కూడా కసరత్తు షురూ చేసింది. ఇందుకు సంబంధించి కీలక ప్రకటన చేసింది. మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ప్రకారం మొత్తం 16,347 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందులో సెకండరీ గ్రేడ్‌ టీచర్లు (ఎస్జీటీ) 6,371,స్కూల్‌ అసిస్టెంట్లు (ఎస్‌ఏ)- 7,725, ట్రైన్డ్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్స్‌ (టీజీటీలు)-1,781, పోస్టు గ్రాడ్యుయేట్‌ టీచర్స్‌ (పీజీటీలు)-286, ప్రిన్సిపాల్స్ 52, వ్యాయామ ఉపాధ్యాయులు (పీఈటీలు)-132 ఉద్యోగాలు ఉన్నాయి.

స్కూల్ అసిస్టెంట్ - 7,725

ఎస్‌జీటీ - 6371

టీజీటీ - 1781

పీజీటీ - 286

పీఈటీ - 132

ప్రిన్సిపల్స్ - 52

జిల్లాల వారీగా ఖాళీలు

ఉమ్మడి శ్రీకాకుళం 543, విజయనగరం, 583, విశాఖపట్నం 1,134, తూర్పుగోదావరి 1,346, పశ్చిమ గోదావరి 1,067, కృష్ణా 1,213, గుంటూరు 1,159, ప్రకాశం 672, నెల్లూరు 673, చిత్తూరు 1,478, కడప, 709, అనంతపురం 811, కర్నూలు 2,678 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటితో పాటు రెసిడెన్షియల్‌, మోడల్ స్కూళ్లు, బీసీ, గిరిజన స్కూళ్లలో 2,281 ఖాళీలు ఉన్నాయి. 16,347 పోస్టులను మెగా డీఎస్సీ ద్వారా భర్తీ చేయనున్నారు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "DSC Notification Cancelled"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0