Easy loan details for phone pay users
ఫోన్ పే వాడే వారికి ఈజీగా లోన్ వివరాలు
ప్రస్తుతం అంతా డిజిటల్ పేమెంట్స్ చేసేందుకే మొగ్గుచూపుతున్నారు. డిజిటల్ పేమెంట్స్ యాప్స్ అందుబాటులోకి వచ్చాక చెల్లింపుల విధానం ఈజీ అయిపోయింది
చేతిలో నగదు లేకున్నా సరే ఆన్ లైన్ పేమెంట్స్ చేయొచ్చు. దాదాపు స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతిఒక్కరు గూగుల్ పే, ఫోన్ పే వంటి చెల్లింపు యాప్స్ ని వినియోగిస్తున్నారు. అయితే ఈ యాప్స్ ద్వారా ట్రాన్సాక్షన్స్ మాత్రమే కాదు.. మీ తక్షణ ఆర్థిక అవసరాలను తీర్చుకునేందుకు లోన్ కూడా పొందొచ్చు. మీరు ఫోన్ పే వాడుతున్నట్లైతే మీకు గుడ్ న్యూస్. ఇప్పుడు ఫోన్ పే పలు రకాల లోన్స్ ను అందిస్తోంది. నిమిషాల వ్యవధిలోనే రుణం పొందొచ్చు. అప్పు కోసం ఎవరి వద్దకో వెళ్లాల్సిన పనిలేదు.
ప్రముఖ డిజిటల్ పేమెంట్స్ యాప్ ఫోన్ పే తన యూజర్ల కోసం లోన్స్ అందించేందుకు రెడీ అయ్యింది. బంగారం నుంచి కారు, బైక్ కొనుగోలు వరకు రుణాలు పొందొచ్చు. ఫోన్ పే ఈ కొత్త సర్వీసులను యూజర్ల కోసం అందుబాటులోకి తీసుకొచ్చింది. అయితే ఇది వరకు ఫోన్ పే ద్వారా పర్సనల్ లోన్స్ ను పొందే సౌలభ్యం ఉండేది. ఈ లోన్స్ ను ఇతర లెండింగ్ సంస్థలతో కలిసి అందించేది. ఇకపై ఫోన్‌పే ద్వారా ఇతర రుణాలు కూడా పొందొచ్చు. మ్యూచువల్ ఫండ్స్‌పై లోన్స్ తీసుకోవచ్చు. ఇంకా గోల్డ్ లోన్స్, బైక్ లోన్స్, కారు లోన్స్, హోమ్ లోన్స్ వంటివి తీసుకోవచ్చు. ప్రాపర్టీ మీద కూడా రుణాలు లభిస్తాయి. ఎడ్యుకేషన్ లోన్స్ కూడా పొందొచ్చు.
యూజర్లకు లోన్స్ అందించేందుకు ఫోన్‌పే పలు లెండింగ్ సంస్థలతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. బ్యాంకులు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు, ఫిన్‌టెక్ సంస్థలు ఇందులో ఉన్నాయి. టాటా క్యాపిటల్, ఎల్అండ్‌టీ ఫైనాన్స్, హీరో ఫిన్‌కార్ప్, ముత్తూట్ ఫిన్‌కార్ప్, డీఎంఐ హౌసింగ్ ఫైనాన్స్, హోమ్ ఫస్ట్ ఫైనాన్స్, రూపే, వోల్ట్ మనీ, గ్రేడ్ రైట్ వంటి పలు సంస్థలతో ఫోన్‌పే ఒప్పందం కుదుర్చుకుంది. ఆన్ లైన్ లోనే ఈజీగా లోన్ పొందొచ్చు. ఫోన్ పే యూజర్లు నిమిషాల్లోనే రూ. 5 లక్షల వరకు సులభంగా లోన్ పొందొచ్చు. ఫోన్ పే రూల్స్ ప్రకారం అర్హులైన యూజర్లకు లోన్స్ అందించనుంది.
0 Response to "Easy loan details for phone pay users"
Post a Comment