Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Explanation of when and what to eat for diabetic patients.

డయాబెటిస్ పేషేంట్లు ఎప్పుడు ఏమి తినాలో వివరణ.

డయాబెటిస్ వచ్చిందని తెలియగానే.. ఫస్ట్ ఫేవరెట్ ఫుడ్ లిస్ట్ ల కెళ్లి డిష్ లన్నీ ఒక్కొక్కటి మాయం అయితుంటాయ్. అన్నంకు బదులు చపాతీలు తినాలి చాయ్ లో చక్కెర వేసుకోకూడదు.

నాలుకకు తీపి తగలకూడదు... ఇది తినొద్దు.. అదే తినాలి అంటూ కన్ ఫ్యూజ్ చేస్తారు. డయాబెటిస్​ పేషెంట్లు ఎప్పుడు ఏమి తింటే.. షుగర్​ అదుపులో ఉంటుందో తెలుసుకుందాం. 

పొద్దున : పొద్దున సూర్యుడికన్నా ముందు లేవకున్నా... కనీసం సూర్యుడితోనైనా నిద్ర లేవాలి. గ్లాసెడు గోరు వెచ్చని నీళ్లని తాగి రోజును స్టార్ట్ చెయ్యాలి. పరగడుపున గోరు వెచ్చని నీళ్లు తాగితే.. శరీరంలో ఉండే విషపు పదార్థాలు బయటకు కొట్టుకుపోతాయి.

బ్రేక్ ఫాస్ట్: ఉదయం 8 గంటల సమయంలో పేపర్​ చదువుకుంటూనో.. టీవీ చూస్తూనో చాయ్ లేకుంటే కాఫీ తాగాలి. తర్వాత నినెమ్మదిగా బ్రేక్ ఫాస్ట్ చేయాలి.

బిజీ డే స్టార్ట్ కావడానికి ముందు ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటారు. కానీ, ఇది సెలవు రోజుల్లో తప్ప మిగతా రోజుల్లో కుదరని పని. బిజి షెడ్యూల్ వల్ల చాలా మంది బ్రేక్​ ఫాస్ట్​ చేయకుండానే బ్యాగ్​ తగిలించుకొని ఆఫీసుకు వెళతారు. అయితే, ఎవరైన సరే బ్రేక్ ఫాస్ట్ కచ్చితంగా చెయ్యాలి. షుగర్​ ఉన్న వారు బ్రేక్​ ఫాస్ట్​ లో ఏఏ పదార్దాలు తినచ్చో తెలుసుకుందాం.

డయాబెటిస్ వచ్చిందని తెలియగానే.. ఫస్ట్ ఫేవరెట్ ఫుడ్ లిస్ట్ ల కెళ్లి డిష్ లన్నీ ఒక్కొక్కటి మాయం అయితుంటాయ్. అన్నంకు బదులు చపాతీలు తినాలి చాయ్ లో చక్కెర వేసుకోకూడదు. నాలుకకు తీపి తగలకూడదు... ఇది తినొద్దు.. అదే తినాలి అంటూ కన్ ఫ్యూజ్ చేస్తారు. డయాబెటిస్​ పేషెంట్లు ఎప్పుడు ఏమి తింటే.. షుగర్​ అదుపులో ఉంటుందో తెలుసుకుందాం. .

ఒక కప్పు చాయ్/కాఫీ/బటర్ మిల్క్/ పెరుగు తీసుకోవాలి. తర్వాత ఒక గిన్నెడు ఓట్స్ జాపతో పాటు ఒక దోసకాయ తినాలి.

ఒక గిన్నెడు ముస్లిని పాలల్లో కలుపుకుని తినాలి. దీంతో పాటు ఒక టొమాటో లేదా... కీరదోసకాయ తినాలి.

గోధుమ అటుకులు పాలల్లో కలుపుకుని తినాలి. తర్వాత ఒక కీరదోసకాయ లేదా టొమాటో తినాలి.

కూరగాయలు కలిపి వండిన గిన్నెడు ఉప్మాని తినాలి.

రెండు చపాతీలను బచ్చలి కూర లేదా ముల్లంగి లేదా మెంతికూరతో వండిన గిన్నెడు కర్రీతో రెండు చపాతీలు తినాలి. తర్వాత ఒక కప్పు పెరుగు తినాలి..

గోధుమ బ్రెడ్, ఎగ్ వైట్ అమ్లెట్ వేసుకొని తినాలి. ఈ శాండ్విచ్ మధ్యలో ఎన్ని ఎక్కువ కూరగాయల ముక్కలు ఉంటే అంత మంచిది.

పొద్దున బ్రేక్ ఫాస్ట్, లంచ్ కి మధ్య ఎక్కువ గ్యాప్ తీసుకుంటారు చానామంది. ఇది డయాబెటిస్ పేషెంట్స్ కి మంచిది కాదు. ఈ గ్యాప్ లో ఒక కప్పు గ్రీన్ టీ, వేగించిన వేరుశెనగలు గుప్పెడు తీసుకోవాలి. లేదా ఏదన్నా ఒక పండు (యాపిల్, పియర్, ఆరెంజ్, బొప్పాయి,జామ) మొత్తం తినాలి.

లంచ్ లో..

గిన్నెడు సలాడ్, రెండు చపాతీలు గిన్నెడు. పప్పు+ కూరగాయలతో చేసిన కర్రీతో తినాలి./ మొలకలు/ పెరుగు/బటర్ మిల్క్ / చికెన్ ఫిష్

ఒక పెద్ద గిన్నెడు కూరగాయలు, పప్పుతో చేసిన కిచిడి పెరుగుతో తినాలి.

గిన్నెడు సలాడ్/రెండు కీరదోసకాయలు/ రెండు టొమాటోలు, సగం గిన్నెడు బ్రౌన్ రైస్/ పప్పు+సబ్జి/ మొలకలు/పెరుగు/బట్టర్​మిల్క్​/చికెన్​/ఫిష్​

సాయంత్రం నాలుగు నుంచి ఐదు గంటల మధ్యలో 

ఏదైనా ఒక పండు (యాపిల్/పీర్/ ఆరెంజ్/బొప్పాయి/జామ) పూర్తిగా తినాలి.

పిడికెడు ఉడికించిన లేదా వేయించిన శెనగలు తినాలి.

ఉప్పు, షుగర్ కలపకుండా గ్లాసెడు బట్టర్ మిల్క్ తాగాలి.

డిన్నర్​లో

డిన్నర్​ తిన్నమంటే తిన్నం అనేలా ఉండాలి. చాలా తక్కువ తినాలి. రాత్రి భోజనంలో కూరగాయలను భాగం చేసుకోవాలి. డిన్నర్లో దుంపలు, వేర్లకు సంబంధించిన వాటిని దూరం పెట్టాలి.

గిన్నెడు సలాడ్/రెండు కీరదోసకాయలు/ రెండు టొమాటోలు-రెండు చపాతీలు సబ్లీ, పప్పుతో/ మొలకలు/ పెరుగు/లైట్​గా చికెన్ లేదా షిష్​

పెరుగుతో వెజిటబుల్​ కిచిడి తినాలి

గిన్నెడు సలాడ్​/రెండు కీర దోసకాయలు/రెండు టమాటోలు+చపాతి లేదా రొట్టె/ మొలకలు

బెడ్​ టైం:

పడుకునే ముందు నట్స్ తింటే బెటర్. రెండు వాల్​నట్స్ లేదా నాలుగు బాదం తిన్న తర్వాతకొన్ని గోరు వెచ్చని నీళ్లు తాగి నిద్రపోవాలి

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Explanation of when and what to eat for diabetic patients."

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0