High Court orders for two-wheeler drivers
టూవీలర్ నడిపే వారికి హైకోర్టు ఆదేశాలు
ఇటీవల కాలంలో రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలు విపరీతంగా చోటు చేసుకుంటున్నాయి. ఈ ప్రమాదాల్లో భారీ సంఖ్యలో వాహనదారులు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు.
ద్విచక్రవాహన దారులే ఎక్కువగా మృతి చెందుతున్నారు. చిన్నపాటి నిర్లక్ష్యంతో కుటుంబాలకు క్షోభమిగులుస్తున్నారు. కొన్ని సమయాల్లో హెల్మెట్ ధరిస్తే మృత్యువాత తప్పేది. ప్రాణాలు పోకుండా గాయాలతో బయటపడేవారు. హెల్మెట్ పెట్టుకోకుండా చేసిన ప్రయాణాల ఘటనలు చూస్తే ఇది కరెక్ట్ అని నిరూపితమైంది. దీంతో న్యాయవాది తాండవ యోగేశ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. రాష్ట్రంలో టూ వీలర్ నడిపేవాళ్లు తప్పనిసరిగా హెల్మెట్ ధరించేలా ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ పిటిషన్‌ను విచారించిన హైకోర్టు ధర్మాసనం కీలక ఆదేశాలు జారీ చేసింది.
ఇక నుంచి రాష్ట్రంలో టూ వీలర్ నడిపే ప్రతీ వాహనదారుడు తప్పనిసరిగా హెల్మెట్ పెట్టుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. అంతేకాదు హెల్మట్ ధరించకపోతే కేసు నమోదు చేయొచ్చని సూచించింది. పోలీసులు వాహన తనిఖీలు చేసే సమయంలో బాడీ కెమెరా తప్పనిసరిగా ధరించాలని ఆదేశించింది. ప్రమాదాల్లో చాలా మంది దుర్మణాలకు హెల్మెట్ ధరించకపోవడమే కారణమని న్యాయవాది యోగేశ్ వాదనలు వినిపించారు. ఈ వాదనలతో ఏకీభవించిన కోర్టు ద్విచక్రవాహనాలు నడిపేవాళ్లు కచ్చితంగా హెల్మెట్ ధరించాలని ఆదేశించింది. ఈ ఆదేశాలతో ఇక నుంచి హెల్మెట్ ధరించకుండా టూ వీరల్ నడిపేవాళ్లు మూల్యం చెల్లించుకోకతప్పదు. టూవీలర్ నడిపితే తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, రోడ్డు ప్రమాదాల నుంచి బయటపడాలని వాహనదారులకు న్యాయవాది యోగేశ్ విజ్ఞప్తి చేశారు.
0 Response to "High Court orders for two-wheeler drivers"
Post a Comment