Latest instructions of AP government on distribution of pensions on July 1.
జులై 1 పెన్షన్ల పంపిణీ పై ఏపీ ప్రభుత్వం తాజా ఆదేశాలు.
ఏపీలో కొత్త ప్రభుత్వం పెన్షన్ల పై నిర్ణయం తీసుకుంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు పెన్షన్లను పెంచుతూ చంద్రబాబు ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు చేపడుతూనే సంతకం చేసారు.
ఈ నెల నుంచి రూ 4వేలు కలిపి జూలై 1న పంపిణీ దిశగా కసరత్తు జరుగుతోంది. వాలంటీర్లతో పంపిణీ చేయాలా..ప్రభుత్వ సిబ్బందితో ఇవ్వాలా అనేది చర్చ జరుగుతోంది. ఈ సమయంలోనే పెన్షన్ల పంపిణీ పైన ఏపీ ప్రభుత్వం తాజాగా ఆదేశాలు ఇచ్చింది.
పెన్షన్ల పంపిణీ
ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువు తీరింది. అధికారంలోకి రాగానే పెన్షన్లను రూ 4 వేలకు పెంచుతామని ఎన్నికల సమయంలో చంద్రబాబు హామీ ఇచ్చారు. అమల్లో భాగంగా..పెరిగిన పెన్షన్ల వెయ్యి రూపాయాలను మూడు నెలల నుంచి అమలు చేసేలా నిర్ణయించారు. పెరిగిన వెయ్యితో పాటుగా రూ 4వేలు కలిపి మొత్తంగా రూ 7 వేలు జూలై 1న చెల్లించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. తాజాగా ఈ పంపిణీ పైన మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అధికారులకు కీలక ఆదేశాలు ఇచ్చారు. నూతన ఫించన్ పాసు పుస్తకాలనూ నగదుతో పాటు అందించాలని నిర్దేశించారు.
పెంచిన ఫించన్లు
రాష్ట్ర వ్యాప్తంగా వృద్ధాప్య, వితంతు, ఒంటరి మహిళల పింఛన్ రూ.4 వేలకు పెంచుతూ ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. అదే విధంగా.. ట్రాన్స్ జెండర్లు, గీత కార్మికులు, మత్స్యకార వర్గాలకు పింఛన్ రూ.4 వేలకు పెంపుకు ఆదేశాలు ఇచ్చారు. దివ్యాంగులకు పింఛన్ రూ.3 వేల నుంచి రూ.6 వేలకు పెంచుతూ నిర్ణయించారు. పూర్తిస్థాయి దివ్యాంగులకు పింఛన్ రూ.5 వేల నుంచి రూ.15 వేలకు పెంపుదల జరిగింది. తీవ్ర అనారోగ్యంతో బాధపడేవారికి రూ.5 వేల నుంచి రూ.10 వేలకు పింఛన్ పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. జూలై 1 నుంచి ఈ పెంపుదల అమలు కానుంది.
అమలుకు ఆదేశాలు
ఈ పెన్షన్లను వాలంటీర్ల ద్వారా పంపిణీ చేయాలా..ప్రభుత్వ సిబ్బంది ద్వారా అందిస్తారా అనేది తేలాల్సి ఉంది. ఈ నెల 24న జరిగే మంత్రివర్గ సమావేశంలో ఈ పంపిణీ పైన నిర్ణయం తీసుకోనున్నారు. అదే విధంగా ఈ నెల పెన్షన్ల పంపిణీకి నగదు సమస్య లేదని ఆర్దిక మంత్రి పయ్యావుల కేవశ్ వెల్లడించారు. జూలై 1న ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా పంపిణీ కార్యక్రమం ప్రారంభించాలని కూటమి నేతలు ఆలోచన చేస్తున్నారు. ఇందుకు సంబంధించి వేదిక ఖరారు చేయనున్నారు. తొలి హామీ అమల్లో భాగంగా జూలై 1న ఈ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించాలని భావిస్తున్నారు. దీని పైన రేపు (సోమవారం) జరిగే మంత్రి వర్గ సమావేశంలో తుది నిర్ణయం జరిగే అవకాశం ఉంది.
0 Response to "Latest instructions of AP government on distribution of pensions on July 1."
Post a Comment