The education department orders to take back the break in the distribution of textbooks across the state
తెలంగాణా : రాష్ట్ర వ్యాప్తంగా పాఠ్య పుస్తకాల పంపిణీకి బ్రేక్ తిరిగి వెనక్కి తీసుకోవాలని విద్యాశాఖ ఆదేశాలు.
రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో పాఠ్య పుస్తకాల పంపిణీ కొత్త గందరగోళానికి దారి తీసింది. రాష్ట్ర వ్యాప్తంగా బుధవారం పాఠశాలలు పున: ప్రారంభం కావడంతో ఆయా జిల్లాల్లో అధికారులు, ఉపాధ్యాయులు 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు పాఠ్య పుస్తకాలు వాటితో పాటు వర్క్ బుక్‌లను కూడా పంపిణీ చేశారు.
ఈ క్రమంలోనే పుస్తకాల్లో ప్రచురణకు సంబంధించి కొత్త వివాదం తలెత్తింది. పుస్తకాల్లోని మొదటి పేజీలో ఉండే ముందుమాట మార్చుకుండానే విద్యాశాఖ పుస్తకాలను ముద్రించినట్లుగా ప్రభుత్వం దృష్టికి వచ్చింది. ఆ విషయం కాస్త వివాదాస్పదం కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా పుస్తకాల పంపిణీని నిలిపివేసి, ఇప్పటి వరకు పంపిణీ చేసిన పుస్తకాలను కూడా వెనక్కి తీసుకోవాలని విద్యాశాఖ ఆయా జిల్లాల డీఈవోలకు సమాచారం అందజేసింది.
0 Response to "The education department orders to take back the break in the distribution of textbooks across the state"
Post a Comment