Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Top Engineering Colleges in Andhra Pradesh 2024

AP ఎంసెట్ లో ర్యాంకు వచ్చిందా...అయితే ఏపీలో ఉన్న టాప్ 10 ఇంజనీరింగ్ కాలేజీల వివరాలు.

Top Engineering Colleges in Andhra Pradesh 2024

ఏపీ ఎంసెట్‌ ఫలితాలు విడుదల అయ్యాయి. దాదాపు 3 లక్షల మందికి పైగా విద్యార్థులు ఎంసెట్ రాశారు. వీరిలో దాదాపు ఇంజినీరింగ్‌కు సంబంధించి 2,58,373 మంది ఎంసెట్ పరీక్ష రాశారు.

అయితే ప్రస్తుతం విడుదలైన ఫలితాలను బట్టి విద్యార్థులు ఏ ఇంజనీరింగ్ కాలేజీని ఎంపిక చేసుకుంటే తమ భవిష్యత్తుకు మంచిదే అని ఆలోచించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి టాప్ టెన్ ఇంజనీరింగ్ కాలేజీలను ఇక్కడ పొందుపరిచాము. ఈ కాలేజీల్లో చక్కటి మౌలిక వసతులతో పాటు ప్లేస్మెంట్ ల ద్వారా విద్యార్థులకు ఉపాధి అవకాశాలు సైతం కల్పిస్తున్నారు. మీరు ఎంసెట్లో ర్యాంకు సాధించి కాలేజీ కోసం వెతుకుతున్నట్లయితే ఇక్కడ పేర్కొన్నటువంటి టాప్ 10 కాలేజీల సమాచారం మీకు ఉపయోగపడుతుంది. ప్రస్తుతం మనం టాప్ టెన్ ఇంజనీరింగ్ కాలేజీల గురించి తెలుసుకుందాం. కేంద్ర ప్రభుత్వ ఉన్నత విద్యా శాఖ ఆధ్వర్యంలో పనిచేసే నేషనల్ ఇన్‌స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్ వర్క్‌ (NIRF) దేశంలోని ఇంజినీరింగ్ కళాశాలల ప్రమాణాలను బట్టి ప్రతీ ఏడాది ర్యాంకులను ప్రకటిస్తుంది. అలాగే దేశంలోనే టాప్ - 200 ఇంజనీరింగ్ కాలేజీల్లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 10 కాలేజీలు చోటు దక్కించుకోవడం విశేషం. సదరు కాలేజీల్లో మంచి అధ్యాపక బృందంతో పాటు. చక్కటి మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉంటాయి. వీటిలో ల్యాబులు, ప్రొఫెసర్లు, ఇలా అనేక అంశాలను పరిగణలోకి తీసుకొని ఈ ర్యాంకులను కేటాయించారు. 

Andhra University College of Engineering , Andhra University 

విశాఖపట్నంలో ఉన్నటువంటి ఆంధ్ర యూనివర్సిటీ ఆధ్వర్యంలోని ఆంధ్ర యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, దేశంలోనే అత్యున్నత ప్రమాణాలు కలిగిన టాప్ యూనివర్సిటీలో ఒకటిగా పేరు పొందింది. ఈ కాలేజీ అత్యుత్తమ ఫ్యాకల్టీ తో పాటు అద్భుతమైన మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి. ఈ కాలేజీని విద్యార్థులు దేశ విదేశాల్లోని మల్టీ నేషనల్ కంపెనీలతో పాటు, ప్రభుత్వ రంగ సంస్థల్లో కూడా అత్యున్నత స్థాయిలో ఉద్యోగాలు చేస్తున్నారు. 

Jawaharlal Nehru Technological University, Kakinada 

కాకినాడలో ఉన్నటువంటి జేఎన్టీయూ కాకినాడ యూనివర్సిటీ కాలేజ్ అత్యున్నత ప్రమాణాలతో అద్భుతమైన ఫ్యాకల్టీతో ఇంజనీరింగ్ విద్యార్థులను తీర్చిదిద్దుతోంది. దశాబ్దాల అనుభవంతో ఈ కాలేజీ నుంచి బయటికి వచ్చిన విద్యార్థులు చక్కటి ఉపాధి అవకాశాలను పొందుతున్నారు. 

University College of Engineering, Adikavi Nannaya University 

రాజమండ్రిలో ఉన్నటువంటి ఆదికవి నన్నయ యూనివర్సిటీ ఆధ్వర్యంలోని యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ మంచి ఫ్యాకల్టీ తో అద్భుతమైనటువంటి మౌలిక సదుపాయాలతో రాష్ట్రంలోనే అత్యుత్తమ ఇంజనీరింగ్ కాలేజీల్లో ఒకటిగా పేరుపొందింది. 

Sri Venkateswara College of Engineering 

తిరుపతిలోని ఎస్వీ యూనివర్సిటీ ఆధ్వర్యంలోని శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కూడా రాష్ట్రంలోనే అత్యుత్తమమైన ఇంజనీరింగ్ కాలేజీలో ఒకటిగా పేరు సంపాదించింది. ఈ కాలేజీ కూడా మంచి ఫ్యాకల్టీ తో పాటు అద్భుతమైన మౌలిక సదుపాయాలతో విద్యార్థులకు నాణ్యమైన ఇంజనీరింగ్ విద్యను అందిస్తోంది. 

JNTU Anantapur 

అనంతపురంలో ఉన్నటువంటి జేఎన్టీయూ కాలేజీ ఆఫ్ ఇంజనీరింగ్ రాష్ట్రంలోనే అత్యుత్తమమైన ఇంజనీరింగ్ విద్య అందిస్తున్న కాలేజీలో ఒకటిగా నిలిచింది. ఈ కాలేజీలో ఇంజనీరింగ్ విభాగాలకు సంబంధించిన అనేక కోర్సులు అందుబాటులో ఉన్నాయి. రాష్ట్రంలోనే అత్యుత్తమ ఫ్యాకల్టీ ఉన్నటువంటి కాలేజీల్లో ఒకటిగా పేరు సంపాదించుకుంది. 

IIIT Kurnool 

కర్నూలులో ఏర్పాటు చేసిన ట్రిపుల్ ఐటి అద్భుతమైన మౌలిక సదుపాయాలతో పాటు, మ్యానుఫ్యాక్చరింగ్ డిజైనింగ్ విభాగాల్లో ప్రత్యేకతను సొంతం చేసుకుంది. ఎంసెట్ ఆధారంగా కూడా ఈ కాలేజీలో సీట్లను భర్తీ చేస్తున్నారు. రాయలసీమలో ఉన్నటువంటి ఇంజనీరింగ్ కాలేజీలో నాణ్యమైనటువంటి విద్య అందిస్తున్న సంస్థగా త్రిపుల్ ఐటీ కర్నూలు అగ్రస్థాయిలో నిలిచింది. 

Velagapudi Ramakrishna Siddhartha Engineering College 

విజయవాడలో ఉన్న సుప్రసిద్ధ సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్ చక్కటి ఫ్యాకల్టీ తోను అద్భుతమైన మౌలిక సదుపాయలతో దశాబ్దాల అనుభవంతో నాణ్యమైన ఇంజనీరింగ్ విద్య అందిస్తున్న కాలేజీ గా పేరు సంపాదించుకుంది. ఈ కాలేజీ విద్యార్థులు దేశ విదేశాల్లో ఉన్నటువంటి అనేక మల్టీ నేషనల్ కంపెనీలో ఉన్నత స్థాయిలో ఉన్నారు. ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో కూడా ఈ కాలేజీ అగ్రస్థాయిలో ఉంది. 

KL (Deemed to be University) 

డీమ్డ్ యూనివర్సిటీ హోదా కలిగిన కేఎల్ యూనివర్సిటీ ఇంజనీరింగ్ విద్య అందించడంలో చక్కటి మౌలిక సదుపాయాలు ఫ్యాకల్టీని కలిగి ఉంది. 

Vignan's Foundation for Science, Technology and Research

గుంటూరులో ఉన్నటువంటి విజ్ఞాన్ విద్యాసంస్థలకు చెందిన ఇంజనీరింగ్ కాలేజీ చక్కటి ఇంజనీరింగ్ విద్య అందించడంలో రాష్ట్రంలోనే అత్యుత్తమ కాలేజీల్లో ఒకటిగా నిలిచింది. 

GITAM School of Technology, Visakhapatnam

విశాఖపట్నంలో ఉన్నటువంటి గీతం కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అద్భుతమైన మౌలిక వసతులతో పాటు, చక్కటి ఫ్యాకల్టీ తో రాష్ట్రంలోనే అత్యుత్తమ కాలేజీల్లో ఒకటిగా ముందు వరసలో నిలిచింది.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Top Engineering Colleges in Andhra Pradesh 2024"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0