Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

We Love Reading Summer Activities

 We Love Reading Summer Activities ( Class 6 - 10) 09.06.24

We Love Reading Summer Activities
Day-47

Class 6-10 We Love Reading Summer Activities 09.06.2024.

Class 6-10 We Love Reading Summer Activities 09.06.2024. The 6th, 10th Class 47th  Day We Love Reading Activities are listed below for All Students Summer Camp Activities.. These We Love Reading Activities encourages the students towards innovative activities, creative activities. 
Class 3-5 We Love Reading: తెలుగు కథ :వెర్రి వెంగళాయిలు!

ఐదుగురు వెర్రి వెంగళప్పలు తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి పొరుగుదేశానికి బయల్దేరారు. మార్గమధ్యంలో వారు ఒక నది దాటవలసి వచ్చింది. 
నది దాటిన తర్వాత వారిలో ఒక వెర్రి వెంగళప్ప - "ఆగండాగండి! ఇంతకీ మన మంతా సరిగానే నది దాటామా? లేదా ఎవరైనా నీళ్ళలో కొట్టుకుపోయామా?" అనే సందేహాన్నిలేవదీశాడు.
"అయితే అందర్నీ లెక్కించు. మొత్తం మనం ఐదుగురం ఉండాలి" సలహా ఇచ్చాడో మొదటి వెంగళప్ప.
లెక్కించడం మొదలె ట్టాడు. 'ఒకటి... రెండు... మూడు... నాలుగు.. తనను తప్ప మిగతా వారందరినీ లెక్కపెట్టాడు "మనం ఇంతకు ముందు అయిదుగురం ఉన్నాం. కాని ఇప్పుడు నలుగురమే ఉన్నాం. అయ్యో మనలో ఒకడు నదిలో మునిగి పోయాడు" అన్నాడు కంగారుగా మొదటి వెంగళప్ప.
దానితో భయపడ్డ మిగతా వెంగళప్పలు, మొదటి వెంగళప్పలాగే లెక్కించారు. ఎన్నిసార్లు లెక్కించినా లెక్క నాలుగనే తేలుతోంది. తమలో ఒకడు మునిగిపోయాడని అంతా నిర్ధారించుకున్నారు. అంతా ఒకచోట కూర్చుని ఏడ వడం మొదలెట్టారు.
అటుగా వెళ్తున్న పండితుడు ఏడుస్తున్న వాళ్ళను చూసి "ఏమైంది. బాబూ, ఎందుకేడుస్తున్నారు అని ప్రశ్నించాడు."మేం ఐదుగురం ఉండేవాళ్ళం. 
మాలో ఒకడు నదిలో మునిగిపోయాడు" జరిగింది. వివరించి చెప్పారు వెంగళప్పలు. "కాని మీరు ఐదుగురూ ఇక్కడే ఉన్నారు. కదా!" అన్నాడు పండితుడు."లేదు. మునిగిపోయాడు. మేము లెక్కపెట్టి చూశాం..." అంటూ మళ్ళీ ఏడవటం మొదలెట్టారు. పండితుడు ఎన్ని రకాలుగా వివరించినా వెంగళప్పలకు అర్థం కాలేదు.
"ఏదీ అందరూ వరసగా నిలబడి . ఒక్కొక్కరు నా ముందుకు రండి" అన్నాడు.పండితుడు కాలిజోడుతో ఒక్కొక్కరి తలపై కొడుతూ వాళ్ళ చేతనే అంకెలు చెప్పించాడు. 
చివరివాడు 'అయిదు' అని అనగానే వెంగళప్పల ముఖాలలో సంతోషం వచ్చింది. వెంటనే ఆ పండితుడి కాళ్ళపై పడ్డారు. "అయ్యా మీ కాలిజోడు ఎంత మహత్తరమైనది. మునిగిపోయిన మా స్నేహితుడిని తిరిగి కాపాడింది. మీరు ఎంతో గొప్పవారు" అని అన్నారు. పండితుడు వెంగళప్పల తెలివితక్కువ తనానికి నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు.

Work:
పై కధలో ఒత్తు పదాలు వేరు చేసి రాయండి. 

Ex: వెంగళప్పలు,అదృష్టాన్ని మార్గమధ్యంలో ....
Class 3-5 We Love Reading: English : 5 Crazy People

Five crazy people traveled to a neighboring town to try their luck. On the way, they had to cross a river. After crossing the river, a crazy person said, "Wait! Did we all cross the river properly, or did someone drown in the river?" He raised the doubt. 'But count them all. There should be five of us in total," advised the person first.
He started counting. 'One... two... three... four...' He counted all the others except himself. "There were five of us before. But now there are only four of us. Alas! one of us has drowned in the river," said the first person anxiously.
The rest of the persons who were frightened by that counted like the first person. No matter how many times they counted, the number was four. Everyone confirmed that one of them had drowned. [This is copied from www.apteachers.in website]. They sat together and started crying.
A passing scholar saw them crying and asked, "What happened? Why are you doing this?" They explained, "There were five of us. One of us drowned in the river." "But all five of you are here," said the scholar. "No, one drowned. We have calculated and seen..." and started crying again. 
No matter how many ways the scholar explained, they could not understand.
"Everyone is standing in a row. Come before me," said the scholar with socks, beating each one on the head. They said the numbers by themselves. The last one is 'Five.' The faces were happy. Immediately, they fell at the feet of the scholar, "Oh, How great your socks!
You saved our lost friend. You are very great." 
The scholar laughed at their foolishness and went away.

Complete the Prepositions Worksheet



Class 6-9 We Love Reading: Maths: BODMAS RULE

Class-6-9 We Love Reading: AP Districts Map



SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "We Love Reading Summer Activities"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0