Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Why is Bakrid festival celebrated.. Let's know the special features of Qurbani.

బక్రీద్ పండుగను ఎందుకు జరుపుకుంటారు.. ఖుర్బానీ ప్రత్యేతకలేంటో తెలుసుకుందాం.

ఇస్లాం మత విశ్వాసాల ప్రకారం బక్రీద్ పండుగకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. త్యాగానికి ప్రతీకగా ముస్లింలందరూ ‘ఈద్ ఉల్ అద్హా’ అనే పండుగను బక్రీద్ పేరిట జరుపుకుంటారు. ఈ సందర్భంగా ఈ ఏడాడి బక్రీద్ ఎప్పుడొచ్చింది.. ఈ పండుగ విశిష్టతలేంటనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

ప్రపంచ వ్యాప్తంగా ఉండే ముస్లింలందరూ రంజాన్ తర్వాత అతి పెద్ద పండుగ బక్రీదే. బక్రీద్ అంటే బకర్ ఈద్ అని అర్థం. బకర్ అంటే మూగజీవి.. ఈద్ అంటే పండుగ అని అర్థం. ఇస్లాం క్యాలెండర్ ప్రకారం జిల్హిజా మాసంలో పదో రోజున బక్రీద్ పండుగను జరుపుకుంటారు. ఈ కాలంలో ముస్లింలు వలసలు ఎక్కువగా వెళ్తారు. హిజ్రీ అంటే వలస వెళ్లడం అని అర్థం. ముస్లిలందరూ తమ జీవిత కాలంలో ఒక్కసారైన హజ్ యాత్ర చేయాలని కోరుకుంటారు. ఇస్లాం మత విశ్వాసాల ప్రకారం, జీవితకాలంలో ఒక్కసారైన హజ్ యాత్ర చేయాలనే నియమం ఉంది. అది కూడా కష్టపడి సంపాదించిన సొమ్ముతో, ఎలాంటి స్వార్థపూరిత ఆలోచనలు లేకుండా, రాగద్వేషాలను వదిలేసి మానవతను వ్యాప్తి చేయాలన్నానే బక్రీద్ పండుగ యొక్క ముఖ్య ఉద్దేశ్యం. ఇదే సమయంలో ఖుర్బానీ ఇస్తారు కాబట్టి దీన్ని ఈదుల్ ఖుర్బానీ అని కూడా పిలుస్తారు. రంజాన్ మాసం ముగిసిన 70 రోజులకు ఈదుల్ అజ్హా పండుగ వస్తుంది. ముస్లింలు అత్యంత పవిత్రమైన యాత్రగా భావించే హజ్ యాత్ర కూడా ఇదే సమయంలో ప్రారంభమవుతుంది. ఈ సందర్భంగా ఖుర్బానీ సంప్రదాయం ఎప్పుడు ప్రారంభమైంది. బక్రీద్ ప్రాముఖ్యతలేంటో ఇప్పుడు తెలుసుకుందాం

ముస్లిం క్యాలెండర్ చాంద్రమానం ఆధారంగా నిర్ణయిస్తారు. అందుకే చంద్రుడిని చూసిన తర్వాతే బక్రీద్ పండుగ

ఇలా నెలవంక కనిపించడాన్నిని హజ్ చాంద్ అంటారు. చంద్రుడు కనిపించిన మరుసటి రోజు నుంచే హజ్ మాసం ప్రారంభమవుతుంది. దీంతో జిల్హిజా మాసంలో పదో రోజున బక్రీద్ పండుగను జరుపుకుంటారు.

ఖుర్బానీ సంప్రదాయం ఎప్పుడంటే..

ప్రపంచ వ్యాప్తంగా ఉండే ముస్లింలందరికీ ఈద్-అల్-అద్హా ప్రధాన పండుగ. ఈ పండుగను మూడు రోజుల పాటు జరుపుకుంటారు. ఈ సమయంలో తమ ప్రియమైన వస్తువులను త్యాగం చేయమని దేవుడు చెప్పినట్లు ప్రవక్త అబ్రహం(ఇబ్రహీం) తన కుమారుడు ఇస్మాయిల్‌ను త్యాగం(బలి) చేసేందుకు సిద్ధపడతాడు. ఆయన త్యాగానికి మెచ్చిన అల్లాహ్ ప్రాణ త్యాగానికి బదులు ఓ మూగ జీవాన్ని బలి ఇవ్వాలని చెబుతాడు. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం బక్రీద్ పండుగ రోజున ఖుర్బానీ ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది. అలా బలి ఇచ్చిన మూగజీవాలను మూడు భాగాలుగా చేసి.. అందులో ఓ వంతు పేద ప్రజలకు, రెండో వంతు తమ చుట్టాలకు, మూడో వంతు భాగాన్ని తమ కుటుంబం కోసం వాడుకుంటారు. అందుకే బక్రీద్ పండుగ రోజున ముస్లిలందరూ ఖుర్బానీ ఇస్తారు.

అయినా మళ్లీ అదే కల రావడంతో తన బిడ్డను బలిదానం కోరుకుంటున్నాడని, ఈ విషయాన్ని తన పుత్రుడికి చెబుతాడు. తను కూడా అల్లాహ్ కోసం ప్రాణ త్యాగానికి సిద్ధమని చెబుతాడు. దీంతో తన బిడ్డను బలి ఇచ్చేందుకు సిద్ధమవ్వగా, అప్పుడు అల్లాహ్ ప్రాణ త్యాగానికి బదులుగా ఓ జీవాన్ని బలి ఇవ్వాలని జిబ్రాయిల్ అనే దూత ద్వారా సందేశం పంపుతాడు. అప్పటి నుంచి ప్రతి ఏటా బక్రీద్ జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఈ పండుగలో భాగంగా మేక, గొర్ర, ఒంటె లేదా ఇతర జంతువులను బలి ఇవ్వనున్నారు.

ఇస్లాం మత విశ్వాసాల ప్రకారం, అల్లాహ్ పంపిన ప్రవక్తల్లో ఇబ్రహీం ఒకరు. ఆయన మక్కా పట్టణాన్ని నిర్మించి, అక్కడే నివాసం ఉంటారు. అల్లాహ్‌ను ఆరాధించడానికి ప్రార్థనా మందరి ‘కాబా’ నిర్మించి దైవ ప్రవక్తగా పేరు ప్రఖ్యాతలు గడిస్తారు. అయితే ఇబ్రహీం దంపతులు ఎంతో కాలం తర్వాత ఓ బిడ్డకు జన్మినిస్తారు. తనకు ఇస్మాయిల్ అని పేరు పెట్టి అల్లారుముద్దుగా పెంచుకుంటారు. అయితే ఓ రోజు ఇబ్రహీంకు కలలో తన కుమారుడిని చంపుతున్నట్లు కనిపిస్తుంది. దీంతో అల్లాహ్ ఖుర్బానీ కోరుతున్నాడేమో అని భావించి ఒంటెను బలి ఇస్తారు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Why is Bakrid festival celebrated.. Let's know the special features of Qurbani."

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0