Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

  • AP Teachers Latest InfoIMP
  • More

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

4 lakhs help from the government for those who want to build a house in AP

 ఏపీలో ఇల్లు కట్టుకోవాలనుకునేవారికి ప్రభుత్వం నుంచి రూ.4లక్షలు సాయం. అప్లై చేసుకొనే విధానం? అర్హతలు ?పూర్తి వివరాలు 

4 lakhs help from the government for those who want to build a house in AP

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇల్లు నిర్మించుకోవాలనుకునే వారికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీపికబురు చెప్పాయి. ఇకపై ఏపీలో ఇల్లు నిర్మించుకునేవారికి నాలుగు లక్షల రూపాయలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి సాయం అందించనుంది.

2024-25 నుంచి అమలుచేయనున్న ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన(పట్టణ) 2.0 పథకానికి సంబంధించిన మార్గదర్శకాలను సవరించింది. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు తమ వాటా నిధుల్ని కేటాయించాల్సిందేనని కేంద్రం తేల్చి చెప్పేసింది. ఈ నేపథ్యంలో పథకానికి సంబంధించిన డ్రాఫ్ట్‌ గైడ్‌లైన్స్‌ను ఎన్నికల ముందే అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకూ కేంద్ర ప్రభుత్వం పంపిణీ చేసింది. కేంద్ర ప్రభుత్వ గైడ్‌లైన్స్ ప్రకారం ఈ పథకం కింద కొత్తగా ఎంపిక చేసే లబ్ధిదారులకు ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ.4లక్షలు అందించనుంది. ఈ నాలుగు లక్షలలో కేంద్ర ప్రభుత్వ వాటా రూ.2.50 లక్షలు కాగా రాష్ట్ర ప్రభుత్వం వాటా రూ.1.50 లక్షలుగా డ్రాఫ్ట్ గైడ్‌లైన్స్‌లో పొందుపరించింది. 

ఒక్కో ఇంటికి రూ.4 లక్షలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త ఇళ్ల నిర్మాణంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఫోకస్‌ పెట్టారు. ఇకపై రాష్ట్రంలో కొత్త ఇంటి నిర్మాణానికి రూ.4 లక్షలు ఖరారు చేయనుంది. ఇందులో కేంద్ర ప్రభుత్వ వాటా రూ.2.50 లక్షలు...రాష్ట్ర ప్రభుత్వం రూ.లక్ష 50 వేలు ఇవ్వాల్సింది. PMAY-U 2.0 పథకం డ్రాప్ట్‌ గైడ్‌లైన్స్‌ను సవరించింది. కొత్తగా ఎంపిక చేసే లబ్ధిదారులకు మాత్రమే ఈ గైడ్‌ లైన్స్‌ వర్తించనున్నాయి. మరోవైపు ఉపాధి హామీ పథకం కింద మరో రూ.30వేలు అందనంగా ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఈనెల 29న మధ్యాహ్నాం గృహనిర్మాణంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించనున్నారు. ఈ సమీక్షలో అధికారులు ఇదే విషయాన్ని నివేదించారు. 

సొంతింటికల సాకారం చేస్తున్న కేంద్రం

ఈ దేశంలో ప్రతి ఒక్కరికీ ఇల్లు ఉండాలనే కలను కేంద్ర ప్రభుత్వం నెరవేర్చే దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. భారతదేశ ప్రధానిగా మోడి హయాంలో దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 3 కోట్ల ఇళ్లను నిర్మించింది. తాజాగా రాబోయే ఐదేళ్లలో మరో 3 కోట్ల ఇళ్లను నిర్మించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఇటీవలే కేంద్రఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు.వీటిలో అర్బన్‌లోని పేదలకు కోటి ఇళ్లు నిర్మిస్తారు. రాష్ట్రంలో పట్టణాభివృద్ధి సంస్థల్లోని పేదలకూ ఈ పథకం వర్తించనుంది. ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన కింద రాబోయే ఐదేళ్లలో మూడుకోట్ల ఇల్లు నిర్మిస్తామని స్పష్టం చేశారు. మధ్యతరగతి వారి కోసం ఇళ్ల నిర్మాణానికి ప్రాధాన్యమిస్తామని చెప్పుకొచ్చారు. ఇందులో భాగంగా జిల్లాలు, బ్లాక్‌ల అభివృద్ధి కోసం రాష్ట్రాలతో కలిసి పనిచేస్తున్నామని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. బస్తీలు, అద్దె ఇళ్లలో ఉండేవారి సొంత ఇంటి కలను త్వరలోనే నిజం చేయబోతున్నట్లు బడ్జెట్ ప్రసంగంలో స్పష్టం చేశారు. ఇకపై ప్రతీ ఒక్కరికీ ఇళ్లు, ప్రతి ఇంటికి నీరు, అందరికీ విద్యుత్‌, అందరికీ వంటగ్యాస్‌, అందరికీ బ్యాంకు ఖాతాలు ఇవ్వనున్నట్లు తెలిపారు. వ్యక్తి లక్ష్యంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని అన్నారు. తమ ప్రభుత్వం సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తోందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ వెల్లడించారు.

రూరల్ ప్రాంతాల్లో అర్హులు ఎవరు?

గ్రామీణ ప్రాంతాల్లో ఈ పథకానికి అర్హత పొందేందుకు వైట్ రేషన్ కార్డును ప్రామాణికంగా తీసుకోనున్నారు. లబ్ధిదారుడి కుటుంబానికి వైట్ రేషన్ కార్డ్ ఉండాలి. లబ్దిదారుకు ఏపీలో ఎక్కడా సొంత ఇల్లు, ఇంటి స్థలం ఉండకూడదు. లబ్దిదారునకు 2.5 సెంట్ల వెట్ లాండ్ లేదా.. 5 సెంట్ల డ్రై లాండ్ ఉన్నవాళ్లు కూడా అర్హత ఉంది. లబ్దిదారు ఇతర ఏ రాష్ట్రం లేదా కేంద్ర ప్రభుత్వ హౌసింగ్ స్కీమ్‌లో లబ్దిదారు అయి ఉండకూడదు.

అర్బన్ ఏరియాలో అర్హులు ఎవరు?

అర్బన్ ప్రాంతంలోని లబ్దిదారుకు ఏపీలో ఎక్కడా సొంత ఇల్లు, ఇంటి స్థలం ఉండకూడదు. లబ్దిదారు ఇతర ఏ రాష్ట్రం లేదా కేంద్ర ప్రభుత్వ హౌసింగ్ స్కీమ్‌లో లబ్దిదారు అయి ఉండకూడదు. లబ్దిదారు సంవత్సర ఆదాయం రూ.3లక్షలు లేదా అంతకుమించి దాటకూడదు. అలాగే లబ్దిదారుకు 2.5 సెంట్ల వెట్ లాండ్ లేదా.. 5 సెంట్ల డ్రై లాండ్ ఉన్నప్పటికీ అర్హత పొందొచ్చు. 

ఈ డాక్యుమెంట్స్ తప్పనిసరి

ఇదిలా ఉంటే లబ్దిదారు తప్పనిసరిగా ఆధార్ కార్డు, అడ్రెస్ ప్రూఫ్, వైట్ రేషన్ కార్డు, నో హౌస్ సర్టిఫికెట్, కుల ధృవీకరణ పత్రం, ఆదాయ సర్టిఫికెట్, బ్యాంక్ అకౌంట్‌లు తప్పనిసరిగా కలిగి ఉండాలి.

అప్లై చేసుకునే అవకాశం

ఏపీ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ ద్వారా ఇల్లు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. మరిన్ని వివరాల కోసం ఆంధ్రప్రదేశ్ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్‌ను సంప్రదించాల్సి ఉంది. లేదా హెల్ప్ లైన్ నంబర్‌ 1902కి కాల్ చేసి వివరాలు అడగొచ్చు. లేదా helpdesk.apshcl@apcfss.in కి ఈమెయిల్ పంపవచ్చు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "4 lakhs help from the government for those who want to build a house in AP"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0