Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

  • AP Teachers Latest InfoIMP
  • More

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

AP Aadhaar Camps

AP Aadhaar Camps : గ్రామ వార్డు సచివాలయాల్లో ఆధార్ సేవలు- నేటి నుంచి 27 వరకు ప్రత్యేక క్యాంపులు

AP Aadhaar Camps

 ఏపీలో ప్రత్యేక ఆధార్ క్యాంపులు నిర్వహిస్తున్నారు. నేటి నుంచి ఈ నెల 27వ తేదీ వరకు గ్రామ, వార్డు సచివాలయాల్లో ఈ క్యాంపులు నిర్వహించనున్నారు.

కొత్త ఆధార్ కార్డులు, ఆధార్ తీసుకుని పదేళ్లు దాటిన వారికి అప్‌డేట్, ఇంటి అడ్రస్, వయసు, పేరు మార్పు, ఫోన్ నెంబర్ అప్డేట్ వంటి సేవలు అందిస్తున్నారు. గ్రామాల్లో ప్రజలకు అందుబాటులో...గ్రామ, వార్డు సచివాలయాల్లో ఆధార్ సేవలు అందిస్తున్నారు. ఈ సేవలను ప్రజలు వినియోగించుకోవాలని అధికారులు కోరుతున్నారు. అయితే పలు జిల్లాల్లో భారీ వర్షాల నేపథ్యంలో ఆధార్ క్యాంపులను మరో 2, 3 రోజులు పొడిగించనున్నట్లు తెలుస్తోంది.

ఐదేళ్లలోపు చిన్నారులకు బాల ఆధార్ కార్డులు జారీ చేస్తారు. ఐదేళ్లలోపు చిన్నారులకు కొత్త ఆధార్ కార్డు జారీకి రాష్ట్రవ్యాప్తంగా 1.36 కోట్ల మంది డాక్యుమెంట్లను అప్లోడ్ చేయాల్సి ఉందని అధికారులు తెలిపారు. ఈ ప్రక్రియను ప్రత్యేక క్యాంపుల్లో చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. పదేళ్లకు ఓసారి ఆధార్ అప్ డేట్ చేసుకోవాలని యూఐడీఏఐ సూచించింది. ఐడెంటిటీ కార్డు, అడ్రస్ ఫ్రూప్స్ సమర్పించి ఆధార్ ను అప్ డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే మేనర్ గా ఉన్నప్పుడు ఆధార్ తీసుకుంటే... బయోమెట్రిక్ అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. యూఐడీఏఐ కేంద్రాలు, మీసేవా, ప్రభుత్వ రంగ బ్యాంకులు, బీఎస్ఎన్ఎల్ , పోస్టు ఆఫీసుల్లో ఆధార్ సేవలు అందిస్తున్నారు. అయితే ఆధార్ సేవలను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు ఏపీ ప్రభుత్వం ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తుంది. ప్రత్యేక శిబిరాల్లో కొన్ని సేవలు ఉచితంగా అందిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం పథకాలు, రైల్వే సేవలకు ఆధార్ తప్పనిసరి.

ఆధార్ ఉచిత అప్డేట్

యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) వెబ్సైట్ ప్రకారం, ఆధార్ కార్డు వివరాలను సెప్టెంబర్ 14, 2024 వరకు ఉచితంగా అప్డేట్ చేసుకోవచ్చు. ఆధార్ బయోమెట్రిక్, డెమోగ్రాఫిక్ సమాచారం ఆధారంగా అప్డేట్ చేసుకోవచ్చు. మీ ఆధార్ కార్డు దశాబ్దం క్రితం జారీ చేయబడి, ఇప్పటివరకు ఎప్పుడూ అప్డేట్ చేయకపోతే, దానిని తిరిగి ధృవీకరించడానికి ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ, ప్రూఫ్ ఆఫ్ అడ్రస్ డాక్యుమెంట్లను సమర్పించాలని యూఐడీఏఐ సూచించింది. ఆధార్ కార్డు వివరాలను ఉచితంగా అప్ డేట్ చేసుకునే గడువు జూన్ 14తో ముగిసింది. అయితే ఆ గడువును కేంద్ర ప్రభుత్వం మరోసారి పెంచింది. ఇప్పుడు ఆధార్ కార్డు వివరాలను సెప్టెంబర్ 14వ తేదీ వరకు ఉచితంగా అప్ డేట్ చేసుకోవచ్చు. ఆధార్ వివరాలను ఆన్ లైన్ లో ఎలా అప్ డేట్ చేయాలో తెలుసుకోండి.

ఆధార్ కార్డును ఆన్లైన్లో అప్డేట్ చేయడం ఎలా?

  • మీ ఆధార్ కార్డు (Aadhaar card) ను ఆన్లైన్లో అప్డేట్ చేయడానికి, ఈ దశలను అనుసరించండి:
  • యూఐడీఏఐ అధికారిక వెబ్సైట్ https://uidai.gov.in/ ను సందర్శించండి.
  • మీ ఆధార్ నంబర్ మరియు ఓటీపీ ఉపయోగించి లాగిన్ చేయండి.
  • గుర్తింపు ధ్రువీకరణ, చిరునామా ధ్రువీకరణ వివరాలను నమోదు చేయండి. సంబంధిత గుర్తింపు పత్రం, చిరునామా పత్రాలను అప్లోడ్ చేయండి.
  • ఆధార్ లో మార్పు చేయడానికి అనుమతి ఇవ్వండి.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "AP Aadhaar Camps"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0