AP Cabinet meeting today. Key discussion on the implementation of Super Six schemes
నేడు ఏపీ కేబినెట్ సమావేశం. సూపర్ సిక్స్ పథకాల అమలుపై కీలక చర్చ
ఇటీవల వరుసగా శ్వేతపత్రాలు రిలీజ్ చేస్తూ బిజీ అయ్యారు ఏపీ సీఎం చంద్రబాబు. గత నెల 12న అధికారంలోకి రాగానే.. వివిధ శాఖలపై సమీక్షలు చేశారు. అలాగే పోలవరం వెళ్లి ప్రాజెక్టు పరిస్థితిని పరిశీలించారు.
అమరావతిలో నిర్మాణాలను చూశారు. ఢిల్లీ వెళ్లి పెద్దల్ని కలిశారు. కొన్ని కంపెనీల ప్రతినిధులతో చర్చించారు. ఇలా పాలన వేగంగానే సాగుతోంది. ఐతే.. ప్రజలు సూపర్ సిక్స్ పథకాలు ఎప్పుడు అమలు చేస్తారా అని ఎదురుచూస్తున్నారు. దానికి ఇవాళ జరిగే కేబినెట్ భేటీ కీలకం కాబోతోంది.
సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఈ కేబినెట్ భేటీ ఉంది. వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయంలోని మొదటి బ్లాక్‌లో ఉదయం 11 గంటలకు ఇది మొదలవుతుంది. ఇది మధ్యాహ్నం 1.30 వరకూ ఉంటుందని తెలుస్తోంది. ఈ భేటీలో ప్రధానంగా అసెంబ్లీ సమావేశాలు ఎలా నిర్వహించాలి, బడ్జెట్ ఎలా ఉండాలి అనేది చర్చిస్తారు.
ఈ కేబినెట్ భేటీలో టీడీపీతోపాటూ.. జనసేన అదినేత పవన్ కళ్యాణ్, బీజేపీ నేతలూ ఉంటారు. అందువల్ల మూడు పార్టీలతో ఏకాభిప్రాయం తెస్తూ.. సీఎం చంద్రబాబు నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. ఐతే.. జనసేన, బీజేపీ నుంచి టీడీపీకి సపోర్టు బలంగా ఉంది. చంద్రబాబు స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునేలా ఈ సపోర్ట్ ఉంటోంది. అందువల్ల ఇవాళ్టి సమావేశంలో కీలక నిర్ణయాలు ఉంటాయని తెలుస్తోంది.
ఏపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. పెన్షన్లను 1వ తేదీనే ఇచ్చేసింది. పెంచిన మనీ కూడా ఇచ్చింది. అలాగే ఉద్యోగులకు 1నే జీతాలు కూడా ఇచ్చింది. ఈ అంశాలు.. ప్రభుత్వంలో కాన్ఫిడెన్స్ పెంచాయి. ఐతే.. మహిళలు ఉచిత బస్సు పథకం, నెలకు రూ.1500 కోసం చూస్తున్నారు. అలాగే రైతులు.. ఎన్టీఆర్ రైతు భరోసా కోసం చూస్తున్నారు. తల్లులు తల్లికి వందనం, నిరుద్యోగులు నిరుద్యోగ భృతి, ఫ్యామిలీలు 3 ఉచిత సిలిండర్ల కోసం చూస్తున్నాయి. అందువల్ల ప్రభుత్వంపై ఒత్తిడి ఉంది.
సూపర్ సిక్స్ పథకాలు ఇవే:
1. యువతకు 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు / నెలకు రూ.3,000 నిరుద్యోగ భృతి.
2. స్కూల్ విద్యార్థులకు సంవత్సరానికి రూ.15,000.
3. ప్రతి రైతుకూ ఏటా రూ.20వేలు ఆర్థిక సాయం.
4. ప్రతి మహిళకీ నెలకు రూ.1,500 (19 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల వరకు).
5. ప్రతి ఇంటికి సంవత్సరానికి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు.
6. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.
రాష్ట్ర ఖజానాలో డబ్బు లేదు అని సీఎం చంద్రబాబు చాలా సార్లు అంటున్నా్రు. తద్వారా ప్రజలను బ్రెయిన్ వాష్ చేస్తున్నారు. పథకాల అమలుపై వెంటనే ఆశలు పెట్టుకోవద్దనే సంకేతాలు ఇస్తున్నారు. ఐతే.. ప్రజలు మాత్రం సీఎం చంద్రబాబుపై అంచనాలు భారీగా పెట్టుకున్నారు. ఏదో ఒకటి చేసి, సంపద సృష్టించి,పథకాలను త్వరగా అమలుచేస్తారని వారు కాన్ఫిడెన్స్‌తో ఉన్నారు. ఇదే చంద్రబాబుకి పెద్ద సమస్య అవుతోంది. ప్రజల్లో ఇంత భారీగా నమ్మకం ఉండటంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. అందువల్ల ఇవాళ్టి కేబినెట్‌లో పథకాల అమలు అంశంపై చర్చ లోతుగా సాగుతుందని సమాచారం.
0 Response to "AP Cabinet meeting today. Key discussion on the implementation of Super Six schemes"
Post a Comment