Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

  • AP Teachers Latest InfoIMP
  • More

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

AP high court jobs

 AP హై కోర్టు లో లా క్లర్క్ పోస్టులు 

AP high court jobs

న్యాయశాస్త్రంలో మూడేళ్లు లేదా ఐదేళ్ల డిగ్రీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు 30 సంవత్సరాలకు మించకూడదు. అయితే బార్ కౌన్సిల్లో అడ్వకేట్గా సభ్యత్వం ఉండకూడదు. అభ్యర్థులు ఆగస్టు 6లోగా ఆఫ్లైన్ విధానంలో తమ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది.

అభ్యర్థులు వెబ్సైట్ నుంచి దరఖాస్తు డౌన్లోడ్ చేసుకోవాలి. దరఖాస్తు నింపి, నిర్ణీత గడువులోగా సంబంధిత చిరునామాకు చేరేలా పంపాలి. విద్యార్హత, వైవా వోస్, సర్టిఫికెట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా ఎంపికచేస్తారు. కమిటీ నామినేట్ చేసిన అభ్యర్థులను ప్రధాన న్యాయమూర్తి అంగీకారంతో ఎంపికలు చేపడతారు. అభ్యర్థులు మెరిట్ ఆధారంగా ఎంపికచేస్తారు. ఎంపికైన వారికి నెలకు రూ.35,000 జీతం చెల్లిస్తారు. అభ్యర్థులు వారి అపాయింట్మెంట్ ఆర్డర్లో పేర్కొన్న వ్యవధిలోపు వారి లా క్లర్క్లో చేరాలి. లా క్లర్క్గా అసైన్మెంట్లో చేరడానికి సమయం పొడిగింపు కోసం చేసిన అభ్యర్థనను ప్రధాన న్యాయమూర్తి యొక్క స్వంత విచక్షణపై స్వీకరించవచ్చు.

ఉద్యోగాలకు ఎంపికైనవారు ఉద్యోగ సమయంలో ఎలాంటి రెగ్యులర్ కోర్సులు చదవకూడదు. అలాగే ఉద్యోగం చేస్తూ.. వేరే వృత్తిలో కొనసాగకూడదు. ఉద్యోగాలకు ఎంపికైనవారు కాంట్రాక్ట్ ప్రకారం ఏడాదిపాటు పనిచేయాల్సి ఉంటుంది. అయితే అవసరానికి అనుగుణంగా కాంట్రాక్ట్ వ్యవధిని పొడగించే అవకాశం కూడా ఉంటుంది. ప్రధాన న్యాయమూర్తి అంగీకారంతో గరిష్ఠంగా నాలుగేళ్ల వరకు పొడిగించే అవకాశం ఉంటుంది. కాంట్రాక్ట్ గడువు కంటే ముందుగానే విధుల నుంచి వైదొలిగే వారికి కోర్టు ఉపేక్షించదు. వారిని అనర్హత కింద పరిగణిస్తుంది. 

విధులకు హాజరయ్యేవారు తమ కేటాయించిన కోర్టుకు సంబంధించిన అసిస్టెంట్ రిజిస్ట్రార్ (అడ్మిన్) గదిలో ఉంచిన రిజిస్టర్లో అటెండెన్స్ కింద ప్రతిరోజూ సంతకం చేయాల్సి ఉంటుంది. కోర్టు సెలవులు మినహాయించి.. అభ్యర్థులకు నెలకు ఒక సాధారణ సెలవు మాత్రమే ఉంటుంది. ఏడాదికి 12 సాధారణ సెలవులు మాత్రమే ఉంటాయి. అంతకు మించి సెలవులు తీసుకుంటే.. ఆ మొత్తాన్ని వారికిచ్చే జీతం నుంచి కోత విధిస్తారు.

ఖాళీల సంఖ్య: 12

కాంట్రాక్ట్ వ్యవధి: ఏడాది. అవసరానికి అనుగుణంగా కాంట్రాక్ట్ వ్యవధిని గరిష్ఠంగా నాలుగేళ్ల వరకు పొడిగించే అవకాశం ఉంటుంది.

అర్హత: న్యాయశాస్త్రంలో డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. ఏ రాష్ట్ర బార్ కౌన్సిల్లోనూ అడ్వకేట్గా తమ పేరు నమోదు చేసుకుని ఉండకూడదు.

వయోపరిమితి:01.01.2024 లేదా 01.07.2024 నాటికి 30 సంవత్సరాలకు మించకూడదు.

దరఖాస్తు విధానం: ఆఫ్లైన్ విధానంలో. దరఖాస్తులు పంపే కవరు మీద 'Application for the Post of Law Clerks' అని రాయాలి.

ఎంపిక విధానం:విద్యార్హత, వైవా వోస్, సర్టిఫికెట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా.

జీతం: నెలకు రూ.35,000. ఇతర ఎలాంటి అలవెన్సులు ఉండవు.

దరఖాస్తులు పంపాల్సిన చిరునామా:

The Registrar (Recruitment),

High Court of A.P. at Amaravathi, 

Nelapadu, Guntur District, 

Andhra Pradesh -522239.

దరఖాస్తుల సమర్పణకు చివరితేదీ:06.08.2024. (5 PM.)

WEBSITE https://hc.ap.nic.in/

NOTIFICATION 

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "AP high court jobs"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0