AP Open School APOSS Admissions 2024 Schedule
AP Open School APOSS Admissions 2024 Schedule, Apply Online APOSS SSC Inter Admission 2024-25 APOSS-SSC and Intermediate Courses-Admissions for the academic year 2024-25-Enrollment Drive APOSS SSC Inter Admission Schedule.
ఏ.పి. ఓపెన్ స్కూల్ పదవ తరగతి మరియు ఇంటర్మీడియట్ అడ్మిషన్స్ నోటిఫికేషన్ విడుదల
ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠము (APOSS) ద్వారా 2024-2025 విద్యా సంవత్సరంనకు సంభందించి పదవ తరగతి మరియు ఇంటర్మీడియట్ తరగతులలో అడ్మిషన్ పొందడానికి ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠము (APOSS) సంచాలకులు వారు నోటిఫికేషన్ జారీ చేయడం జరిగినది. పదవ తరగతిలో చేరుటకుగాను 14 సంవత్సరాలు నిండిన వారికి మరియు ఇంటర్మీడియట్ చేరుటకుగాను పదవ తరగతి పాసై 15 సంవత్సరాలు నిండిన వారు దరఖాస్తులు చేయుటకు అర్హులు. దరఖాస్తు చేసుకోవడానికి www.apopenschool.ap.gov.in నందు 31-07-2024 నుండి అవకాశం.
ప్రవేశం కొరకు వివరములు:
అడ్మిషన్లు ప్రారంభ తేది: 31-07-2024
అడ్మిషన్లు ఆన్లైన్ లో సబ్మిట్ చేయడానికి చివరి తేది: 27-08-2024
అడ్మిషన్ ఫీజు చెల్లించడానికి చివరి తేది: 28-08-2024
Rs. 200/- లేటు ఫీజుతో అడ్మిషన్లు ఆన్లైన్ లో చేయడానికి చివరి తేది: 04-09-2024
ప్రవేశమునకు సూచనలు:
దరఖాస్తు వివరముల నమూనా నింపబోయే ముందు ప్రాస్పెక్టస్ నందలి సూచనలన్ని జాగ్రత్తగా చదివి, విద్యార్హతలు, కనీస వయస్సు మొదలైన అర్హతల గురించి సంతృప్తి చెందవలెను. తదుపరి ఆన్లైన్ దరఖాస్తులో పూర్తిచేయవలసిన అంశముల అవగాహన కోసం నమూనా దరఖాస్తు నింపవలెను.
అభ్యాసకులు దరఖాస్తు చేసుకొనుటకు మరియు 30 రోజుల పి.సి.పి. (ముఖాముఖి) తరగతులకు హాజరయ్యేందుకు తమకు అనుకూలమైన అధ్యయన కేంద్రము (A.I.) ను ఎంపిక చేసుకోవచ్చును.
ఒక అధ్యయన కేంద్రము నందు కనిష్ఠంగా నమోదు కావలసిన ఇంటర్మీడియట్ అభ్యాసకుల సంఖ్య సైన్సు గ్రూపు నందు 30 మరియు నాన్ సైన్సు తరగతులకు (P.C.Ps) సర్దుబాటు చేయబడిన అధ్యయన కేంద్రములకు మాత్రమే హాజరవ్వవలెను. దీనికి సంబంధించి ఎ.పి. ఓపెన్ స్కూల్ ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరములు అనుమతించదు.
దరఖాస్తు సమర్పించడం నుండి ఫీచెల్లించి, ప్రవేశం నిర్ధారించు వరకు అన్ని దశలు ఆన్లైన్లో మాత్రమే అనుమతించబడును. ఆన్లైన్ కాకుండా మరి ఏ ఇతర విధానము ఎట్టి పరిస్థితులలోను అనుమతించబడదు.
రిజిస్ట్రేషన్ పద్ధతి:
వ్యక్తిగతంగానైనా లేక ఎ.పి.టి. ఆన్ లైన్ కేంద్రము మరియు గ్రామ/వార్డు సచివాలయాల ద్వారానైనా అభ్యాసకులు అన్ని దశల ప్రవేశ దరఖాస్తు ప్రక్రియ పూర్తిచేసుకొనవచ్చును.
ఏదైనా కోర్స్ రిజిస్ట్రేషన్ కొరకు https://apopenschool. ap.gov.in వెబ్ సైట్ లోనికి ప్రవేశించి, అడ్మిషన్ పేజీ నందలి రిజిస్ట్రేషన్ బటన్ను క్లిక్ చేసి, INTERMEDIATE కోర్సును సెలెక్ట్ చేసుకొనవలెను. తదుపరి అభ్యాసకులు తమ మొబైల్ నెంబర్, పూర్తి పేరు, లింగం, పుట్టిన తేదీ మరియు తండ్రి పేరుని నమోదు చేసి 'సబ్మిట్' చేయవలెను. సబ్మిషన్ ను విజయవంతముగా పూర్తిచేసిన తర్వాత వెబ్సైట్నందు గల Payment Gateway/APT ONLINE ద్వారా నిర్ణీత రిజిస్ట్రేషన్ ఫీజును చెల్లించవలెను, తదుపరి దరఖాస్తు ప్రక్రియ పూర్తిచేయుటకు మరియు అడ్మిషన్ ఫీజు చెల్లింపు పూర్తిచేయుటకు అభ్యాసకులకు సంక్షిప్త సమాచారము (SMS) ద్వారా రిజిస్ట్రేషన్ నెంబర్ పంపబడును. పాస్ సర్టిఫికెట్లు డిజిలాకర్కు అనుసంధానమైనందున అభ్యాసకుని ఖచ్చితమైన ఆధార్ నెంబర్ను నమోదు చేయవలెను.
అభ్యాసకులు ఇచ్చిన ఫోన్ నెంబర్ ఒకసారి రిజిస్ట్రేషన్కు మాత్రమే అంగీకరింపబడును.
రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించినంతమాత్రాన ప్రవేశము, సీటు కేటాయించుట నిర్ధారణ అయినట్లు కాదు. ప్రవేశ నిబంధనలన్ని ఖచ్చితంగా పాటించినప్పుడు మాత్రమే ప్రవేశ నిర్ధారణ జరుగును.
APOSS 10th, INTER ADMISSIONS APPLY ONLINE
DOWNLOAD APOSS SSC PROSPECTUS, ADMISSION & EXAMINATION FEE DETAILS
DOWNLOAD APOSS SSC, INTER ENROLLMENT DRIVE PROCEEDINGS
APOSS ADMISSION 2024 NOTIFICATION, SCHEDULE
0 Response to "AP Open School APOSS Admissions 2024 Schedule"
Post a Comment