Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Electricity bills cannot be paid through UPI apps including PhonePay, GooglePay, Paytm. Details.

 ఏపీ ప్రజలకు ముఖ్యమైన గమనిక ఇకపై విద్యుత్ బిల్లుల్ని ఫోన్‌పే, గూగుల్‌పే, పేటీఎం సహా యూపీఐ యాప్‌ల ద్వారా చెల్లింపులు కుదరవు . వివరాలు.

Electricity bills cannot be paid through UPI apps including PhonePay, GooglePay, Paytm. Details.

ఏపీ ప్రజలకు ముఖ్యమైన గమనిక.. కరెంట్ బిల్లుల చెల్లింపు విషయంలో డిస్కంలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. ఇకపై విద్యుత్ బిల్లుల్ని ఫోన్‌పే, గూగుల్‌పే, పేటీఎం సహా యూపీఐ యాప్‌ల ద్వారా చెల్లింపులు కుదరవని తెలిపాయి. జులై నెల నుంచి యూపీఐ యాప్‌ల ద్వారా కరెంట్‌ బిల్లులు చెల్లించే సేవలు నిలిచిపోయాయి. అలాగే ఇప్పటికే క్రెడిట్‌ కార్డు బిల్లుల చెల్లింపు సేవలను యాప్‌లు నిలిపివేశాయి. ఇకపై వినియోగదారులు గూగుల్‌ ప్లే స్టోర్‌ నుంచి సంబంధిత విద్యుత్‌ డిస్కంలకు సంబంధించి యాప్‌ను మొబైల్‌లో‌ డౌన్‌లోడ్‌ చేసుకుని బిల్లులు చెల్లించాలని అధికారులు సూచించారు.

డిస్కంలు ఆర్‌బీఐ మార్గదర్శకాలను అనుసరించి ఈ నిర్ణయం తీసుకున్నాయి. జులై ఒకటో తేదీ నుంచి ఆయా చెల్లింపు సంస్థలు బిల్లుల చెల్లింపు సేవలు ఆపేశాయి. ఇకపై విద్యుత్‌ వినియోగదారులు ప్రతినెలా బిల్లు చెల్లింపు కోసం ఆయా డిస్కంల వెబ్‌సైట్, మొబైల్‌ యాప్‌ను వినియోగించక తప్పదు. అయితే చిన్న విషయాన్ని గమనించాల్సి ఉంటుంది.. వినియోగదారులు డిస్కంల యాప్‌/వెబ్‌సైట్‌లోకి వెళ్లిన తర్వాత ఫోన్‌పే, గూగుల్‌పే, పేటీఎం, ఇతర యూపీఐ యాప్‌లను ఉపయోగించి బిల్లులు చెల్లించవచ్చు. అంతేకాదు కరెంట్ బిల్లుల్ని డెబిట్, క్రెడిట్‌ కార్డు, నెట్‌ బ్యాంకింగ్, వాలెట్స్, క్యాష్‌ కార్డ్స్‌ ద్వారా బిల్లులు చెల్లించే అవకాశం ఉంది అంటున్నారు.

ఉమ్మడి కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల పరిధిలోని వినియోగదారులు (ఏపీసీపీడీసీఎల్‌) గూగుల్‌ ప్లే స్టోర్‌ నుంచి Central Power యాప్‌ను మొబైల్‌లో డౌన్‌లోడ్‌ చేసుకోవాలని సూచించారు. డిస్కం వెబ్‌సైట్‌ https://apcpdcl.in/ ద్వారా ఇక మీదట విద్యుత్‌ బిల్లులు చెల్లించాలని అధికారులు కోరారు. ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాలు, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల పరిధిలోని (ఏపీఈపీడీసీఎల్‌) విద్యుత్ వినియోగదారులు.. గూగుల్‌ ప్లే స్టోర్‌ నుంచి Eastern Power యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలని సూచించారు. డిస్కం వెబ్‌సైట్‌ apeasternpower.com ద్వారా బిల్లులు చెల్లించాలన్నారు. ఉమ్మడి చిత్తూరు, అనంతపురం, కర్నూలు, వైఎస్సార్‌ నెల్లూరు జిల్లాల పరిధిలో వినియోగదారులు (ఏపీఎస్‌పీడీసీఎల్) గూగుల్‌ ప్లే స్టోర్‌ నుంచి Southern Power యాప్‌/వెబ్‌సైట్‌ www.apspdcl.in ద్వారా బిల్లులు చెల్లించాలని సూచనలు చేశారు. ఈ మార్పును గమనించాలని కోరుతున్నారు అధికారులు.

విద్యుత్ బిల్లు చెల్లింపుల్లో సమర్థత, సెక్యూరిటీ పరంగా పెద్ద పీట వేసేందుకు ఆర్బీఐ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై కరెంట్ బిల్లు చెల్లింపులన్నీ భారత్‌ బిల్‌ పేమెంట్‌ సిస్టమ్‌ (BBPS) ద్వారానే జరగాలని నిర్దేశించింది. అందుకే ఈ నెల 1 నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి తీసుకొచ్చింది. అందుకే భారత్‌ బిల్‌ పేమెంట్‌ సిస్టమ్‌ను బిల్లర్లు ఎనేబుల్‌ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రైవేటు ప్రధాన బ్యాంకులు ఈ పేమెంట్‌ సిస్టమ్‌ను యాక్టివేట్‌ చేసుకోలేదని చెబుతున్నారు. అందుకే ఫోన్ పే, క్రెడ్‌ వంటి కంపెనీలు కస్టమర్ల క్రెడిట్‌ కార్డుల బిల్లులను ప్రాసెస్‌ చేయలేవు అంటున్నారు. అందుకే పేమెం్టస్ యాప్స్‌లో క్రెడిట్‌ కార్డు బిల్లుల చెల్లింపు కుదరడం లేదట.

ఒక్కసారి యూనిక్ సర్వీస్ నెంబర్ ను రిజిస్టర్ చేసి పే చేస్తే చాలు, ప్రతినెలా బిల్ అప్డేట్ మరియు పేమెంట్ వివరాలు నోటిఫై చేస్తాయి ఈ యాప్స్. అయితే, ఇరు తెలుగు రాష్ట్రాల్లో కొత్తగా కరెంట్ బిల్ పేమెంట్స్ పైన RBI ఆంక్షలు విధించింది. దీనితో, UPI యాప్స్ తో నేరుగా కరెంట్ బిల్ పేమెంట్ చేసే అవకాశం లేకుండా పోయింది. దీంతో కరెంట్ బిల్ ఎలా పేమెంట్ చెయ్యాలో తెలియక చాలా మంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అందుకే, చాలా సింపుల్ గా ఆన్లైన్ లో కరెంట్ బిల్ పేమెంట్ చెయ్యాలో తెలియచేస్తున్నాము.

Power Bill ఆన్లైన్లో ఎలా చెల్లించాలి?

ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ఇరు తెలుగు రాష్ట్రాల్లో ఈ జూలై 1 నుండి నయా రూల్స్ అమలులోకి వచ్చాయి. ఇప్పుడు ఈ కొత్తగా పెట్టిన రూల్స్ ప్రకారం కస్టమర్లు UPI యాప్స్ ద్వారా ఆన్లైన్ లో కరెంట్ బిల్లులు చెల్లించడం కుదరదు. దానికి బదులుగా ప్రభుత్వం యోక్క అధికారిక వెబ్ సైట్ మరియు యాప్స్ ని ఉపయోగించాలి. అందుకే ఇరు రాష్ట్రాల్లో కొత్త ఆన్లైన్ పద్దతి ద్వారా కస్టమర్లు కరెంట్ బిల్లులు చెల్లించవచ్చు.

 Power Bill online

తెలంగాణ రాష్ట్ర కరెంట్ వినియోగదారులు TGSPDCL యాప్ లేదా https://tgsouthernpower.org అధికారిక సైట్ ద్వారా కరెంట్ బిల్స్ ను చెల్లింవచ్చు. ఈ సైట్ లేదా యాప్ లో యూనిక్ సర్వీస్ నెంబర్ ను ఎంటర్ చేసి అందుకున్న కస్టమర్ వివరాల ను సరి చూసుకొని కరెంట్ బిల్ ను చెల్లించవచ్చు.

 Online Electricity Bill Payment

ఆంధ్రప్రదేశ్ కరెంట్ వినియోగదారులు APCPDCL యాప్ లేదా www.apcpdcl.in వెబ్సైట్ ద్వారా కరెంట్ బిల్లులు చెల్లించవచ్చు. కస్టమర్లు, సైట్ లేదా యాప్ లో Pay Your Bill ట్యాబ్ ను పైన నొక్కి అడిగిన వద్ద యూనిక్ సర్వీస్ నెంబర్ ను ఎంటర్ చేసి బిల్ ను చెల్లించాలి.

వెబ్సైట్ ద్వారా బిల్లు చెల్లించాలి అనుకుంటే Billdesk ఆప్షన్ ను ఎంచుకొని, ఇందులో మీ యూనిక్ సర్వీస్ నెంబర్ మరియు క్యాప్చా ఎంటర్ చెయ్యాలి. ఇప్పుడు వెంటనే మీ బిల్ వివరాలు వస్తాయి మరియు క్రింద సబ్ మీట్ బటన్ ను నొక్కండి. తర్వాత, వచ్చే పేమెంట్ ఆప్షన్ లలో ఒకదానిని ఎంచుకొని క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, వాలెట్ మరియు UPI యాప్ ద్వారా కూడా పే చేయవచ్చు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Electricity bills cannot be paid through UPI apps including PhonePay, GooglePay, Paytm. Details."

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0