Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Explanation of how to apply for pension in a very easy way if you are eligible for pension but do not receive pensio

పెన్షన్ కు అర్హులై ఉండి పెన్షన్ రానట్లైతే చాలా సులభం గా ఎలా అప్లై చేసుకోవాలో వివరణ

 ఏపీవ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కొనసాగుతోంది. మధ్యాహ్నం ఒంటిగంట వరకు 50% మందికి నగదు పంపిణీ పూర్తయింది. ఇంటింటికీ వెళ్లి పెన్షన్ నగదు పంపిణీ చేస్తున్నారు సచివాలయ ఉద్యోగులు.

ఈ ఒక్క రోజే 100% పెన్షన్లు పంపిణీ పూర్తి చేసే దృక్ఫథంతో ముందుకు సాగుతున్నారు. ప్రణాళికలో భాగంగా ఒక్కో సచివాలయ ఉద్యోగి 50 మంది పింఛనుదారులకు పింఛను అందజేసేలా బాధ్యతలు అప్పగించారు. ఇక తొలి రోజు అందుకోలేని వారికి రెండోరోజు వారి ఇళ్ల వద్దే గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది పింఛను అందజేస్తారు.

పెన్షన్ పంపిణీలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులు భాగమవుతున్నారు. అయితే ఏపీలో అర్హత ఉండి పెన్షన్ పొందాలంటే ఎలా అప్లై చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం

ఆఫ్​లైన్​లో ఇలా… 


తొలుత గవర్నమెంట్ అఫీషియల్ వెబ్‌సైట్… https://sspensions.ap.gov.in/SSP/Home/Index విజిల్ చేయండి. ఆ పోర్టల్​లో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ యోజన దరఖాస్తు ఫామ్ సెలక్ట్ చేసి డౌన్‌లోడ్ చేయండి. ఆ ఫామ్‌ ఫ్రింట్ తీసి వివరాలు కరెక్ట్‌గా నింపండి. ఎక్కడా తప్పులు పడకుండా చూసుకోండి. ఆ ఫామ్‌కు ఆధార్ కార్డ్, అడ్రస్ ఫ్రూప్, తెల్ల రేషన్ కార్డు లేదా ఆదాయ ధృవీకరణ పత్రం.. ఇతర సంబంధిత పత్రాలు జత చేయండి. ఆపై వాటిని గ్రామ పంచాయతీ ఆఫీసులో సంబంధిత అధికారికి ఇవ్వండి.,

ఆన్‌లైన్‌లో ఇలా

పెన్షన్లకు సంబంధించిన అధికారిక పోర్టల్… https://sspensions.ap.gov.in/SSP/Home/Index విజిల్ చేయండి. స్క్రీన్ కుడివైపున ఎగువన ఉన్న లాగిన్ ఆప్షన్ ఎంచుకోండి.క్రెడెన్షియల్‌లను నమోదు తర్వాత.. మీ యూజర్ నేమ్, పాస్ వర్డ్ ఇవ్వండి. ఆ తర్వాత గెట్ OTP ఆప్షన్‌పై క్లిక్ చేయండి. ఆపై మీ రిజిస్టర్డ్ చేసుకున్న మొబైల్ నంబర్‌కు వచ్చిన OTPని అక్కడ ఎంటర్ చేయండి. అనంతరం మీరు ఫిల్ చేయాల్సిన పేజీ అక్కడ వస్తుంది. ఆ సూచనలు బట్టి ఆ ఫామ్ నింపండి. పెన్షన్ల సంబంధించి మీకు ఇంకా సాయం, సమాచారం కావాలంటే.. 0866 - 2410017 కాల్ చేసి వివరాలు పొందవచ్చు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Explanation of how to apply for pension in a very easy way if you are eligible for pension but do not receive pensio"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0