You can check your Aadhaar card history from time to time. Why in detail
మీ ఆధార్ కార్డు హిస్టరీని అప్పుడప్పుడు చెక్ చేసుకోగలరు. ఎందుకో వివరంగా
ఆధార్ కార్డు ప్రస్తుతం అన్నింటికీ అతి ముఖ్యమైన డాక్యుమెంట్ అయ్యింది. బ్యాంకుల్లో ఖాతా తెరవాలన్నా, కొత్త సిమ్ కార్డు తీసుకోవాలన్నా ప్రతి దానికి ఆధార్ కార్డును సమర్పించాల్సిందే.
అవసరమున్న ప్రతి చోటా ఆధార్ కార్డు ఇచ్చేస్తున్నాం. దాంతో ఈ కార్డును ఎక్కడెక్కడ ఉపయోగిస్తున్నామో కూడా తెలియట్లేదు. ఒక్కోసారి ‘వేరెవరైనా మన కార్డును దుర్వినియోగం చేస్తున్నారా..?’ అనే అనుమానం కూడా కలుగుతుంది. అలా అనుమానం కలిగినప్పుడు మీ అనుమానం తీరాలంటే కార్డు హిస్టరీని చెక్ చేయాలి. దాని ద్వారా మీ అనుమతి లేకుండా ఎవరైనా మీ కార్డును వినియోగిస్తే సులువుగా కనిపెట్టవచ్చు. మరి అదెలాగో చూద్దాం.
ఆధార్ హిస్టరీ తెలుసుకొనే విధానం
- ముందుగా ఉడాయ్ https://uidai.gov.in/en/ పోర్టల్‌లోకి వెళ్లాలి.
- తర్వాత పైన ఎడమవైపు ఉన్న My Aadhaar ఆప్షన్‌లో కనిపించే Aadhaar servicesపై క్లిక్ చేయాలి.
- ఇప్పుడు కిందకు స్క్రోల్ చేసి Aadhaar Authentication History అనే ఆప్షన్‌ను ఎంచుకోవాలి. వెంటనే లాగిన్ కోసం కొత్త పేజీ ఓపెన్ అవుతుంది.
- అందులో లాగిన్‌పై క్లిక్ చేసి ఆధార్ నెంబర్, క్యాప్చా, ఓటీపీ ఎంటర్ చేయాలి.
- తర్వాత కనిపించే స్క్రీన్‌లో కిందకు స్క్రోల్ చేయగానే Authentication History అని కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయాలి.
- అక్కడ ALL ని ఎంచుకొని డేట్‌ను ఎంపిక చేసుకొని Fetch Authentication History పై క్లిక్ చేయాలి.
- ఆధార్‌కు లింక్ చేసిన ఓటీపీ, బయోమెట్రిక్, డెమోగ్రాఫిక్ ద్వారా మీ ఆధార్ కార్డును ఆరు నెలలుగా ఎక్కడెక్కడ వినియోగించారనే వివరాలు కనిపిస్తాయి.
0 Response to "You can check your Aadhaar card history from time to time. Why in detail"
Post a Comment